AP P4 Survey Complete Process for Grama Ward Sachivalayam Employees – User Manual, Dashboard and FAQs

AP P4 Survey Complete Process for Grama Ward Sachivalayam Employees – User Manual, Dashboard and FAQs

P4 Survey Process: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవలె రాష్ట్రంలో p4 విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. మార్చ్ 30 ఉగాది నాడు ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.‘P4’ మోడల్ అంటే ‘పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్‌షిప్’.(Public Private People Partnership)

ఈ విధానం ద్వారా ఆర్థికంగా బలంగా ఉన్న అగ్రశ్రేణి 10% వర్గాలు అట్టడుగున ఉన్న 20% మందికి సహాయం చేయడం ద్వారా సానుకూల ఫలితాలను అందించడమే ప్రధాన లక్ష్యం

ఈ విధానం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి, ప్రజల అభిప్రాయం, సూచనలు మరియు అభిప్రాయాలను సేకరించడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మొబైల్ అప్లికేషన్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

P4 సర్వే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది?

పి ఫోర్ సర్వే మొదటి ఫేజ్ లో 20 ఫిబ్రవరి నుండి 2 మార్చ్ వరకు జరగనుంది.

AP P4 Survey Process

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎంప్లాయ్ మొబైల్ యాప్ లో (P4 Survey Process) P4 సర్వే కు సంబంధించిన చేయడం జరిగింది

ఉద్యోగి తన వినియోగదారి వివరాలుతో లాగిన్ కావాలి లాగిన్ బటన్ పైన నొక్కాలి

లాగిన్ బటన్ ని టాప్ చేసిన తర్వాత ప్రామాణికరణ పేజీ కనిపిస్తుంది ఉద్యోగి బయోమెట్రిక్ , ఐరిస్ లేదా ముఖ గుర్తింపు దృవీకరణలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకోవాలి

ధ్రువీకరణ ముగిసిన తర్వాత కింది చూపించిన స్క్రీన్ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. అందులో సచివాలయ ఉద్యోగి ఈ ఫోర్ సర్వే మా డ్యూయల్ పై టాప్ చేయాలి

సర్వేకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే కింద ఇచ్చిన P4 సర్వే FAQ లను చదవండి

తర్వాత ఉద్యోగి టాప్ 10 నుండి  క్లస్టర్ను ఎంచుకోండి

Select Cluster ఆప్షన్ను ఎంపిక చేసుకున్న తర్వాత వినియోగదారు క్లస్టర్ ఐడీలను చూడవచ్చు. మీకు అవసరమైన క్లస్టర్ ఐడి పై క్లిక్ చేయాలి

క్లస్టర్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఉద్యోగి డ్రాఫ్ట్ నుండి గృహ సంఖ్యను ఎంచుకోండి.

హౌస్ హోల్డ్ ఎంపికను ఎంచుకున్న తర్వాత వినియోగదారుడు హౌస్ హోల్డ్ ఐడి లను చూడగలుగుతారు మరియు అవసరమైన హౌస్ హోల్డ్ ఐడి పై టాప్ చేయాల్సి ఉంటుంది

వినియోగదారు కుటుంబ సభ్యులు గృహంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని సూచించేందుకు అవును లేదా కాదు ను ఎంచుకోవాలి

యూసర్ అవును అని ఎంచుకున్నట్లయితే ఉద్యోగి డ్రాప్ డౌన్ నుండి గృహ సభ్యుడి పేరును ఎంచుకోవాలి.

గృహ సభ్యుడిని ఎంపిక చేసిన తర్వాత సభ్యుడు సీఎం హౌస్ హోల్డింగ్ వ్యాయామంలో పాల్గొంటారా లేదా అనే విషయంలో అవును లేదా కాదు ఎంపిక చేయాల్సి ఉంటుంది

ఎస్ ఎంచుకున్న తర్వాత ఉద్యోగి అవసరమైన అన్ని ప్రశ్నలను పూర్తి చేయాలి

అన్ని ప్రశ్నలకు పూర్తి అయిన తర్వాత ఉద్యోగి చెక్ బాక్స్ ఎంచుకొని సబ్మిట్ చేయాలి

సబ్మిట్ బటన్ పై టాప్ చేసిన తర్వాత ఉద్యోగి బయోమెట్రిక్ ఐరిఫ్ ఫేస్ రికగ్నిషన్ లేదా ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి.

ఉద్యోగి సీఎం యొక్క హౌస్ హోల్డింగ్ వ్యాయామానికి నో ఎంచుకుంటే చెక్ బాక్స్ ఎంచుకొని సబ్మిట్ చేయాలి.

సబ్మిట్ చాట్ చేసిన తర్వాత ఉద్యోగి బయోమెట్రిక్ ముఖ గుర్తింపు లేదా ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి.

ఉద్యోగి నో ఎంచుకుంటే ఇంటి సభ్యుడు అందుబాటులో ఎందుకు లేరు అనే ప్రశ్న కనిపిస్తుంది.

ఉద్యోగి ట్రాక్టర్ నుంచి సరైన ఆప్షన్ ఉంచుకోవాలి ఇది ఇంటి సభ్యుడు రాష్ట్రంలోని వలస వెళ్లాడా లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాడా లేక మరణించాడు అనే వివరాలను సూచిస్తుంది.

అన్ని ప్రశ్నలను పూర్తి చేసిన తర్వాత ఉద్యోగి థర్డ్ బాక్స్ ఎంచుకొని సబ్మిట్ చేయాలి

సబ్మిట్ ట్యాప్ చేసిన తర్వాత ఉద్యోగి బయోమెట్రిక్ ఐరిస్ ముఖ గుర్తింపు లేదా ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి.

ధ్రువీకరణ సబ్మిట్ చేసిన తర్వాత రికార్డు విజయవంతంగా సమర్పించబడుతుంది

P4 -FAQS IN TELUGU

  • ఈ సర్వే ఏ పథకం అందజేతను ప్రభావితం చేయదు.
  • ఇది ‘మినహాయింపు’ (exclusion) సర్వే కాదు, ఇది గృహ వినియోగ నిర్వహణ యొక్క P4ప్రోగ్రామ్లో భాగమైన’ (inclusion) సర్వే.
  • సేకరించిన డేటా ఆధారంగా, ఇంటి అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగంతో కలిసి ప్రత్యేకప్రాజెక్టులు అమలు చేయబడతాయి.
  • ప్రభుత్వం సమర్థంగా ప్రణాళికలు రూపొందించేందుకు ఖచ్చితమైన డేటా అందించడం ముఖ్యం

వారు వలస వెళ్లకపోతే లేదా మరణించి లేకపోతే, సర్వేయర్ తిరిగి వెళ్లి సర్వే చేయాలి.

  • కుటుంబం అందుబాటులో లేదని ‘No’ గా ఎంచుకోవాలి.
  • తదుపరి కారణాలను ఎంపిక చేయాలి:
    • ‘రాష్ట్రంలో వలస’ అయితే, వారు వెళ్లిన కొత్త సచివాలయాన్ని ఎంచుకోవాలి.
    • ‘రాష్ట్రం బయట వలస’ లేదా ‘మరణం’ అయితే, సర్వేయర్ బయోమెట్రిక్ ద్వారాధృవీకరించాలి.
  • సర్వే ఉద్దేశ్యం ఏమిటో వారికి వివరించాలి:
    • ఇది ఇంటి వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మాత్రమే.
    • ప్రభుత్వ ప్రాజెక్టుల ద్వారా అవసరమైన కుటుంబాలకు ప్రైవేట్ రంగ సహాయాన్నిఅందించడమే లక్ష్యం.
    • ఈ సర్వే డేటా ప్రస్తుత స్కీమ్ల అమలుపై ఎటువంటి ప్రభావం చూపదు.
  • వారు ఇంకా నిరాకరిస్తే, ‘Denied Consent’ అనే ఎంపికను ఎంచుకోవాలి. ఇది సర్వేయర్ బయోమెట్రిక్ద్వారా ధృవీకరించబడాలి.
  • ఏదైనా ఆదాయ వనరు కలిగి ఉన్నవారిని సంపాదన కలిగిన సభ్యులుగా పరిగణించాలి.
  • ఉదాహరణలు:
    • వ్యవసాయ భూమి కలిగి ఉన్నవారు•
    • వ్యవసాయ కూలీలు•
    • పెన్షన్ పొందుతున్న వృద్ధులు
    • అద్దె ఆదాయం పొందుతున్న వారు
  • గోడలు లేదా పైకప్పు మట్టి, కలప, కలప పొదలు, కాల్చని ఇటుకలతో తయారై ఉంటే కచ్చా ఇల్లు(Kutcha house) అని పిలుస్తారు.
  • గోడలు మరియు పైకప్పు రెండూ సిమెంట్, కాల్చిన ఇటుకలు లాంటి మన్నికైన పదార్థాలతోతయారై ఉంటే, అది పక్కా ఇల్లు (Pakka house) అవుతుంది.

Q7: వాణిజ్యేతర (non-commercial) 4 వీలర్ లేదా 2 వీలర్ అంటే ఏమిటి?

  • ఆ కుటుంబ జీవనోపాధికి ఉపయోగించని వాహనం.
  • ఉదాహరణలు:
    • వాణిజ్య నంబర్ ప్లేట్ (Yellow plate) ఉన్న కార్లు వాణిజ్య వాహనంగా పరిగణించాలి.
    • ఇంట్లో వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లు, బైకులు – వాణిజ్యేతర వాహనంగా పరిగణించాలి.
  • ఇంటి నుండి నీటి మూలానికి వెళ్లి తిరిగి రావడానికి మొత్తం పట్టే సమయం.
  • ఉదాహరణ:
    • నీటి మూలానికి వెళ్లడానికి 10 నిమిషాలు, తిరిగి ఇంటికి రావడానికి 10 నిమిషాలు అయితే,మొత్తం రౌండ్ ట్రిప్ సమయం 20 నిమిషాలు.
  • సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన సమాచారం అందుకోవడానికి ప్రయత్నించాలి.
  • ఆస్తి యజమాన్యం, పట్టణ ఆస్తులు, వాణిజ్యేతర 4-వీలర్, తాగునీటి అందుబాటు, విద్యుత్వినియోగం వంటి అంశాలపై కనీస స్థాయిలో ప్రత్యక్ష ధృవీకరణ చేయవచ్చు.
  • ఉదాహరణలు:
    • ఒక ఇంట్లో టీవీ లేనట్లు చెబితే, కానీ టీవీ శబ్దం వినిపిస్తే టీవీ ఉందని నమోదు చేయాలి.
    • ఒక కుటుంబం విద్యుత్ లేనని చెప్పినా, ఫ్యాన్ తిరుగుతుంటే – విద్యుత్ ఉందని నమోదుచేయాలి.•



Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page