రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి సంక్షేమ పథకానికి ప్రభుత్వం అర్హతలను నిర్ణయిస్తుంది. వీటితో పాటు అన్నీ సంక్షేమ పథకాలకు ఆరు అంచెల దృవీకరణ తప్పనిసరి చేసింది. అయితే కొంతమందికి ప్రస్తుతం అర్హత ఉన్నప్పటికీ గతంలో ఏదైనా అనర్హత కారణాలు ఇంకా క్లియర్ అవ్వని కారణం చేత చివరి నిమిషంలో చాలా మంది అమౌంట్ ను మిస్ అవుతున్నారు. బ్యాంక్ ఖాతాకు NPCI లింక్ చేసుకోవడం కూడా ఇందులో ప్రధాన కారణం. ఇటువంటి వారందరికీ ప్రతి ఏటా ద్వై వార్షిక చెల్లింపుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లబ్ధిదారులకు వారి అమౌంట్ ను నేరుగా బ్యాంక్ ఖాతా లో జమ చేస్తుంది.
2.62 లక్షల మందికి నేడు అమౌంట్ జమ
గత ఏడాది డిసెంబర్ నుంచి జూలై 2023 వరకు అర్హత ఉండి కూడా వివిధ కారణాల చేత చివరి నిమిషంలో అమౌంట్ పడని వారికి సీఎం ఈరోజు ద్వైవార్షిక చెల్లింపులు ( Biannual Payments) లో భాగంగా ఈరోజు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలో అమౌంట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,62,169 మంది లబ్ధిదారులకు 216.14 కోట్లను బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరిగింది.
Biannual Sanctions 2023 payments released
ఈ పథకాల వారికి ఈరోజు డబ్బులు
మొత్తం 10 పథకాలకు సంబంధించి పెండింగ్ నిధులను నేడు ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేశారు.
పథకాలు ఇవే..
✓ జగనన్న చేదోడు కింద 43,131 మంది లబ్ధిదారులకు
✓ వైయస్సార్ ఈబిసీ నేస్తం కింద 8753 మంది మహిళలు
✓ వైయస్సార్ నేతన్న నేస్తం 267 మంది లబ్ధిదారులు
✓ వైయస్సార్ మత్స్యకార భరోసా కింద 207 మంది మత్స్యకారులు
✓ జగనన్న అమ్మఒడి 14,836 మంది తల్లులు
✓ జగనన్న విద్యా దీవెన కింద 32,770 మంది విద్యార్థులు
✓ జగనన్న వసతి దీవెన కింద 36,898 మంది విద్యార్థులు
✓ వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు మరియు ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద 1,08,590 మంది రైతులు
✓ వైయస్సార్ ఆసరా 16,717 మంది డ్వాక్రా మహిళలు
వీరందరికీ ఈరోజు బటన్ నొక్కి ముఖ్యమంత్రి అమౌంట్ విడుదల చేశారు.
వీరితోపాటు కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల మంజూరు
గత ఏడాది డిసెంబర్ నుంచి జూలై 2023 వరకు అర్హత సాధించినటువంటి 1,49,875 మంది కి కొత్త పెన్షన్లు, 2,00,312 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలు, 4,327 మంది లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను ఈరోజు ముఖ్యమంత్రి అందిస్తున్నారు.
Leave a Reply