Navaratnalu Biannual Sanctions Amount 2024 - నవరత్నాలు ద్వైవార్షిక చెల్లింపులు - అందరికీ సంక్షేమం

#

Navaratnalu Biannual Sanctions Amount Scheme 2024: Apply Online, Eligibility & Beneficiary List






Navaratnalu Biannual Sanctions Payment Status new


[Scheme దగ్గర Bi-annual 2024 అని ఎంచుకోండి , UID లో ఆధార్ ఎంటర్ చేయండి]

Check bank balance with missed call - మిస్డ్ కాల్ తో మీ అకౌంట్లో అమౌంట్ జమ అయిందో లేదో చెక్ చేసుకోండి.


[రిజిస్టర్ మొబైల్ నుంచి మీ బ్యాంక్ నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ బ్యాలెన్స్ వివరాలు SMS రూపంలో పొందవచ్చు ]



ఈ ద్వైవార్షిక చెల్లింపుల ముఖ్య ఉద్దేశం

అర్హులందరికీ ఆర్థిక తోడ్పాటు అందజేయాలనే లక్ష్యంతో వివిధ సంక్షేమ పథకాలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా సంక్షేమ క్యాలెండర్ ని విడుదల చేసి , అందులో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ప్రతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే నవరత్నాలలో ఆయా పథకాలకు సంబంధించి వివిధ కారణాల వలన షెడ్యూల్ ప్రకారం అమౌంట్ అందని వారికి లేదా నిర్దిష్ట గడువు దాటిన తర్వాత గ్రీవెన్స్ క్లియర్ అయ్యి అర్హత ఉన్న వారికి ప్రభుత్వం ఏటా రెండు సార్లు ద్వైవార్షిక చెల్లింపులు చేసి అమౌంట్ జమ చేస్తుంది


అర్హతలు

⦿ ప్రతి ఏటా జూలై మరియు డిసెంబర్ లో ఈ నవరత్నాల ద్వైవార్షిక చెల్లింపుల పథకాన్ని ప్రభుతం నిర్వహిస్తుంది

⦿ అమ్మ ఒడి , విద్యా వసతి దీవెన , ఆసరా , ఉచిత పంటల భీమా , రైతు భరోసా, మత్స్యకార భరోసా వంటి పథకాల లబ్ధిదారులు ప్రస్తుతం లబ్ది పొందనున్నారు.

ఏ ఏ పథకాలకు చెల్లిస్తారు?

కింది పథకాల లబ్ధిదారులకు అమౌంట్ విడుదల
➠ EBC Nestham ఈబీసీ నేస్తం
➠ Jagananna chedodu జగనన్న చేదోడు
➠ YSR Matsyakara Bharosa వైఎస్ఆర్ మత్స్యకార భరోసా
➠ Input subsidy to farmers(November-Floods) రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ
➠ Jagananna Vidya Deevena జగనన్న విద్యా దీవెన
➠ Jagananna Vasati Deevena జగనన్న వసతి దీవెన
➠ YSR Zero Vaddi (SHGS) Urban వైఎస్ఆర్ సున్నా వడ్డీ
➠ YSR Cheyutha వైఎస్ఆర్ చేయూత
➠ YSR Kapu Nestham వైఎస్ఆర్ కాపు నేస్తం
➠ YSR Netanna Nestham వైఎస్ఆర్ నేతన్న నేస్తం
➠ YSR Vahana Mitra వైఎస్ఆర్ వాహన మిత్ర
➠ YSR Zero Vaddi Khariff వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఖరీఫ్
➠ YSR Zero Vaddi Rabi వైఎస్ఆర్ సున్నా వడ్డీ రబీ

ఎలా చెల్లిస్తారు?

ముఖ్యమంత్రి ద్వారా ఈ పథకం ప్రారంభించబడుతుంది. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ చేయనున్నారు

Note: నవరత్నాలు ద్వైవార్షిక చెల్లింపుల లబ్ధిదారులు కోసం ప్రత్యేక పేజీ ఇది. ఇందులో ఈ పథకానికి సంబందించి రెగ్యులర్ గా అప్డేట్స్ పోస్ట్ చేయబడతాయి .

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #