update: 𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 𝐟𝐨𝐫 𝐅𝐚𝐫𝐦𝐞𝐫𝐬: వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం పెండింగ్ అమౌంట్ విడుదల చేస్తున్న ప్రభుత్వం. కింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా మీ సున్నా వడ్డీ పంట రుణాల స్టేటస్ తెలుసుకోండి. |
sunna vaddi panta runalu status - సున్నా వడ్డీ పంట రుణాల స్టేటస్ కొరకు క్లిక్ చేయండి New
మీ ఆధార్ ఎంటర్ చేసి చెక్ చేయండి. Enter aadhar to check your status
[ పై లింక్ ని క్లిక్ చేసి Kharif 2022 ➔ మీ జిల్లా ➔ మీ మండలం ➔ గ్రామం ➔ ఖాతా నెంబర్/సర్వే నంబర్ ఎంటర్ చేసి మీ వివరాలు చూడవచ్చు ]
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం
రైతులు తీసుకున్న పంట రుణాల పై పూర్తిగా వడ్డీ మాఫీ చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం
.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాన్ని 2020 లో ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లించడం జరుగుతుంది. 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలకు పైగా మొదటి విడతలో జమ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రతియేటా పంటల సీజన్ ముగిసే సమయానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.
ప్రతి ఏటా పంట సీజన్ ముగిసే సమయం నాటికి రైతుల ఖాతాల్లో వడ్డీ డబ్బులు జమవుతాయి
రైతులు సకాలంలో రుణం చెల్లిస్తే సరిపోతుంది..
లక్ష వరకు రుణాలు తీసుకున్న వారికి వడ్డీ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది
రుణం తీసుకొని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు ఈ పథకం వర్తిస్తుంది
ఇప్పటికే ఉన్న కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ మరియు కిసాన్ క్రెడిట్ కార్డ్ కి అనుసంధానంగా ఈ పథకం యొక్క అర్హత విధానం ఉంటుంది.
Ecrop లో నమోదు తప్పనిసరి గా చేయించుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది. నమోదు చేసిన వారికి వడ్డీ రాయితీ కింద నగదు జమ చేయడం జరుగుతుంది.
నేరుగా రైతుల ఖాతాల్లోకి వడ్డీ అమౌంట్ ఏమవుతుంది పూర్తిగా రుణం మరియు వడ్డీ సకాలంలో చెల్లించిన రైతులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది
సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీని చెల్లిస్తుంది
అసలు మరియు వడ్డీ ని రైతు చెల్లించినట్లు జాబితాలు తయారు చేసి ఆయా బ్యాంకు లేదా నోడల్ బ్యాంకు శాఖలు వ్యవసాయ కమిషనర్ శాఖ కార్యాలయానికి పంపుతాయి
వీటి ఆధారంగా వ్యవసాయ శాఖ కమిషనర్ నేరుగా వడ్డీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తారు
ఇందుకోసం వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా క్రింది పోర్టల్ ను ఏర్పాటు చేసింది