జిల్లా కలెక్టర్లతో గురువారం నాడు సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ జనవరి నుండి ఫిబ్రవరి వరకు మొత్తం నాలుగు పథకాల అమలుకు శ్రీకరం చుట్టినట్టు తెలిపారు. జనవరిలో 3 ఫిబ్రవరిలో ఒకటి పథకాల అమలు కానున్నాయి.
జనవరి నుండి పెన్షన్ పెన్షన్ అమౌంట్ ను 3 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
జనవరి 1 నుండి 8వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుందని ఇందులో ప్రతి అధికారులు పాల్గొని పెన్షన్ పెంపును సంబరంగా జరపాలని ఆదేశించారు.
జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు.
జనవరి 5న వివిధ కారణాల చేత సంక్షేమ పథకాల నిధులు జమ కాని వారికి ద్వై వార్షిక చెల్లింపుల ద్వారా అమౌంట్ ను విడుదల చేయనున్నారు.
జనవరి 23 నుండి 31 వరకు వైయస్సార్ ఆసరా కార్యక్రమం.
ఫిబ్రవరి 5 నుండి 14 వరకు వైయస్సార్ చేయూత కార్యక్రమం.
ఫిబ్రవరి 15,16 తేదీల్లో ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సేవా మిత్ర, రత్న, వజ్ర అవార్డులను ఇచ్చి సత్కరించనున్నారు.