YSR Cheyutha Scheme - వైయస్ఆర్ చేయూత పథకం

#

YSR Cheyutha Scheme-వైయస్ఆర్ చేయూత పథకం

 Updates
YSR Cheyutha Amount released today. Click here to check your payment status. * * * చేయూత స్టేటస్ చెక్ చేసే లింక్ మరియు ప్రాసెస్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి Click here

YSR Cheyutha Payment Status 2022 - ఆధార్ తో మీ వైస్సార్ చేయూత స్టేటస్ చెక్ చేయండి New

NBM GSWS [Select Scheme as YSR Cheyutha and Enter Aadar at UID]

Eligible ఉండి అమౌంట్ పడని వారికి ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ పడుతుంది.
స్టేటస్ అప్డేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. Eligibile అని ఉంటే మీకు ఒకటి లేదా రెండు రోజుల్లోపు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా స్టేటస్ తెలుసుకునే పూర్తి ప్రాసెస్ ని చూడవచ్చు.

Download cheyuthaApplication formClick here

మిస్ అయిన వారు మరలా అప్లై చేయవచ్చు.

చేయూత application form for spandana grevience. Download

చేయూత లో పేర్లు రాని వారు స్పందన లో గ్రీవెన్స్ పెట్టడానికి కావలసిన అర్జీ..

Get Aadhar update history online మీ ఆధార్ అప్డేట్ హిస్టరి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కేవలం కొత్త లబ్ధిదారులకు మాత్రమే ఆధార్ అప్డేట్ హిస్టరీ అవసరం

సంక్షిప్త లక్ష్యం

ఈ పథకం ద్వారా ఎస్సీ / ఎస్టీ / ఓబిసి / మైనారిటీ కులాల మహిళలకు ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నాలుగేళ్ల వ్యవధిలో 75000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది..

ప్రయోజనాలు

⦿ నాలుగు సంవత్సరాల వ్యవధిలో 75,000 రూపాయల సహాయం మహిళా లబ్ధిదారునికి నాలుగు సమాన వాయిదాలలో రూ. సంవత్సరానికి 18750 రూపాయలు.
⦿ ఈ మొత్తాన్ని లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో బదిలీ చేస్తారు.



అర్హత

▣ SC, ST BC మైనారిటీ వర్గానికి చెందిన మరియు 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు.
▣ మొత్తం కుటుంబ ఆదాయం రూ. 10,000, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 / - రూపాయలు.
▣ కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి మరియు పొడి భూమి కలిపి మించరాదు.
▣ కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ కాకూడదు
▣ కుటుంబానికి 4 వీలర్ (టాక్సీ, ఆటో, ట్రాక్టర్లు మినహాయింపు) ఉండకూడదు
▣ కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు.
▣ పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేని కుటుంబం లేదా 750 అడుగుల కంటే తక్కువ నిర్మించిన ప్రాంతం.



ఎలా దరఖాస్తు చేయాలి

అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు:
⦿ చిరునామా రుజువు
⦿ ఆధార్ కార్డు
⦿ కుల ధృవీకరణ పత్రం
⦿ నివాస ధృవీకరణ పత్రం
⦿ వయస్సు రుజువు
⦿ బ్యాంక్ ఖాతా పాస్బుక్
⦿ ఫోటో
⦿ మొబైల్ నెంబర్



ఎవరిని సంప్రదించాలి (అమలు చేసే ఏజెన్సీ)

రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్స్ డోర్ టు డోర్ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ ప్రభుత్వం నోటిఫై చేసిన డేట్ నుంచి మొదలవుతుంది. సాధారణంగా మే జూన్ జూలై నెలల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వాలంటరీ తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి సచివాలయం వెల్ఫేర్ కి సమర్పిస్తారు. తర్వాత వాటిని నవశకం పోర్టల్ లో అప్ లోడ్ చేయడం జరుగుతుంది.
లబ్ధిదారుల వివరాలు సిక్స్ స్టెప్ validation లో పాస్ అయితే వారిని అర్హులుగా గుర్తించి పథకం ప్రారంభించిన రోజు అమౌంట్ జమ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని SERP MEPMA వారి పర్యవేక్షణలో చేస్తారు.



ఈ పథకానికి ఎవరు అర్హులు కారు?

ఈ పథకానికి 60 ఏళ్లు దాటిన వారు లేదా 45 సంవత్సరం లోపు వారు అర్హులు కాదు. ప్రభుత్వం నోటిఫై చేసిన సమయానికి ఈ ఏజ్ క్రైటీరియా అనేది పరిగణిస్తారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం దీనికి సంబంధించిన జీవో జారీ చేస్తుంది.
ఈ పథకానికి ఆరు దశల్లో ధ్రువీకరణ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ మహిళలు మాత్రమే అర్హులు. కాపు మహిళలు లేదా ఈ బిసి లేదా ఓ సి మహిళలు ఇందుకు అర్హులు కాదు.
అయితే ఈ పథకానికి ఒంటరి మరియు వితంతు మహిళలు కూడా అర్హులు అవుతారని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది.





New WhatsApp group for Govt schemes [only for public]: 

#

JOIN Our Govt Schemes Telegram Group

#

JOIN Our STUDYBIZZ Telegram Group

  • #
  • #
  • #
  • #