AP Agri Stack Farmer Registry 2025 – Full Details, Benefits & Registration Guide

AP Agri Stack Farmer Registry 2025 – Full Details, Benefits & Registration Guide

What is AP Agri Stack Farmer Registry 2025?

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆధార్ కార్డు లాగానే 14 అంకెలు గల రైతు విశిష్ట గుర్తింపు నెంబర్ / రైతు గుర్తింపు సంఖ్య / ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ AP Farmer Registry Number అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు అందించే సేవలను నేరుగా రైతుకు అందించాలని లక్ష్యంగా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 

Benefits of AP Agri Stack for Farmer Registry Number 

  1. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను సులువుగా పొందవచ్చు. 
  2. పీఎం కిసాన్ నగదు సులువుగా పొందవచ్చు. 
  3. పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ లో ఏమైనా సమస్యలు ఉంటే సులువుగా క్లియర్ అవుతాయి. 
  4. అన్నదాత సుఖీభవ పథకం పొందవచ్చు. 
  5. పెట్టుబడి రాయితీలు పొందవచ్చు 
  6. ఎరువులపై రాయితీలు పొందవచ్చు 
  7. పంటల బీమా పథకానికి సులువుగా నమోదు చేసుకోవచ్చు. 
  8. పంటలకు కనీస మద్దతు ధర పొందవచ్చు 
  9. పంటల రుణాలు పొందవచ్చు 
  10. వివిధ రకముల వ్యవసాయ అనుబంధ రంగాల సేవలు పొందవచ్చు.
  11. యంత్ర పరికరాల కొనుగోలు పై సబ్సిడీ పొందవచ్చు
  12. సూక్ష్మ సేద్యంపై రాయితీలు పొందవచ్చు
  13. ఇన్పుట్ సబ్సిడీ పొందవచ్చు
  14. కిసాన్ క్రెడిట్ సదుపాయం పొందవచ్చు
  15. వ్యవసాయ సేవలను తక్కువ ఖర్చుతో తక్కువతో రైతులకు ప్రభుత్వం అందించవచ్చు.
  16. సహాయం చేయాల్సిన సహాయం అందాల్సిన రైతుల డేటాను త్వరగా కనిపెట్టవచ్చు 
  17. ఖచ్చితమైన డేటా ఉండటం వలన ఎటువంటి కొత్త సేవలు కొత్త పథకాలు అందించాలన్న సులువు అవుతుంది.

Who is Eligible For Farmer Registry Number ?

ఎవరు నమోదు చేసుకోవాలి ?

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం సొంత భూమి కలిగి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులకు మొదట రిజిస్ట్రేషన్ చేస్తారు తర్వాత చిన్న సన్నకారు రైతులు మరియు కౌలు రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పీఎం కిసాన్ లబ్ధిదారులకు రైతు గుర్తింపు సంఖ్య నమోదు కార్యక్రమం జరుగుతుంది.

Who Enrol Farmer Registry Number in AP  ?

ఎవరు నమోదు చేస్తారు ?

రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు వ్యవసాయ డిపార్ట్మెంట్ కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియ జరుగుతుంది. రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులు / గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ వారు మరియు విలేజ్ రెవెన్యూ అధికారి వారికి నమోదు చేయుటకు అవకాశం ఉన్నది. 

Documents Required for AP Agri Stack Farmer Registration Number 

నమోదుకు ఏం కావాలి ?

  1. రైతు గుర్తింపు సంఖ్య నమోదుకు తప్పనిసరిగా కింద తెలిపిన వివరాలు ఉండాలి
  2. ఆధార్ పాస్ బుక్కు లేదా ROR 1B
  3. ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ కు వచ్చే OTP
  4. ఆధార్ కార్డు జిరాక్స్

మీ ఆధార్ కార్డు కు ఏ నెంబర్ లింక్ ఉందో ఇక్కడ తెలుసుకోండి 

Click Here

How to Apply For PM Kisan Scheme through Farmer Registry Number  ?

రైతు గుర్తింపు సంఖ్యకు పిఎం కిసాన్ పథకానికి సంబంధం ఉందా ?

  • రైతు గుర్తింపు సంఖ్య ఉండటం వలన రిజిస్ట్రేషన్ వేగంగా అవుతుంది పిఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ వేగంగా అవుతుంది. 
  • అర్హతలు కూడా ఆటోమేటిక్గా ఆన్లైన్ లోనే వాలిడేషన్ పూర్తి అవుతుంది. తద్వారా త్వరగా పథకాన్ని పొందే అవకాశం ఉంటుంది. 
  • బోగస్ లబ్ధిదారులు ఉండరు. 
  • లంచం ప్రసక్టే ఉండదు. 
  • బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ అవుతుంది. రైతులు వివరాలు సులువుగా అప్డేట్ అవ్వడం వలన పీఎం కిసాన్ పథకం నేరుగా పొందవచ్చు. 
  • చిన్న సన్నకారు రైతులకు కూడా పీఎం కిసాన్ పథకాన్ని పొడిగించవచ్చు. పేమెంట్ లపై ఏదైనా సమస్య ఉన్న పరిష్కారం కోసం రైతు గుర్తింపు సంఖ్య నమోదు చేసుకున్న వారికి సులువు అవుతుంది. 
  • పిఎం కిసాన్ పథకాన్ని ఇతర పథకాలతో లింక్ చేయవచ్చు.

Step-by-Step Guide to Register for AP Agri Stack

ఎలా నమోదు చేసుకోవాలి ? 

రైతు గుర్తింపు నెంబరు నమోదుకు రెండు రకములుగా నమోదు చేసుకోవచ్చు.  ఆన్లైన్ లో / CSC login లో సొంతంగా రైతు చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది లేదా రైతు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవచ్చు. సొంతంగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి కింద లింక్ ఓపెన్ చేసి నమోదు చేసుకోవచ్చు.

రైతు సేవా కేంద్రంలో రైతు గుర్తింపు సంఖ్య నమోదు విధానం

గుర్తింపు సంఖ్యను గ్రామ రైతు సేవా కేంద్రాల్లో కింద తెలిపిన విధంగా పూర్తి చేస్తారు

APFR వెబ్ పోర్టల్ అనగా ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రీ పోర్టల్ లో గ్రామ వ్యవసాయ సహాయకులు / గ్రామ హార్టికల్చర్ సహాయకులు / గ్రామ రెవెన్యూ అధికారి వారు ఎవరైనా లాగిన్ అవుతారు . 

రైతు యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేస్తారు .

ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ కి వచ్చే ఓటీపీను ఎంటర్ చేసి ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేస్తారు.

రైతు వాడుతున్న మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి దానికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తారు .

తర్వాత రైతు పేరు పుట్టిన తేదీ మొబైల్ నెంబరు ఇతర వివరాలు ఆధార్ కార్డులో ఉన్నట్టు వస్తాయి వాటిని ధృవీకరిస్తారు ఆధార్ కార్డులు ఉన్న ఫోటో వస్తుంది దాన్ని కూడా ధ్రువీకరణ ఇస్తారు .

కుల వివరాలు వస్తాయి వాటిని ధృవీకరిస్తారు .

ప్రస్తుతం ఉన్నటువంటి చిరునామా వివరాలు వస్తాయి అందులో ఎటువంటి తప్పులు ఉంటే అప్డేట్ చేయుటకు ఆప్షన్ ఉంటుంది పాత జిల్లాలు పాత మండలాలు, పాత రెవెన్యూ వివరాలు వచ్చినట్టయితే వాటిని అప్డేట్ చేసుకుని అవకాశం ఉంటుంది .

తర్వాత భూమి వివరాలు ఎంటర్ చేస్తారు . భూమి వివరాలు ఎంటర్ చేసేటప్పుడు సర్వేనెంబర్ ఎంటర్ చేసేటప్పుడు పార్ట్ మారకుండా నేరుగా సర్వే నెంబరు ROR 1B లేదా పట్టాదారు పాసుబుక్కులో ఎలా ఉందో ఆ విధంగా సర్వే నెంబరు పూర్తిగా ఎంటర్ చేస్తారు .

చేసిన తర్వాత ఆధార్ కార్డులో ఉన్న పేరుకు భూమి రికార్డులో ఉన్న పేరుకు సరిపోయినట్టయితే NMS [ What is Name Matching Score ]  అనేది 100% గా ఉంటుంది . అలా కాకుండా ఇటువంటి తప్పులు ఉన్న Name Matching Score అనేది 0 నుండి 100% మధ్య రావడం జరుగుతుంది. 0 నుండి 60 శాతం వస్తే ముందుగా VRO గారి పరిశీలించి MRO గారికి ఫార్వర్డ్ చేస్తే MRO గారి లాగిన్ లో అన్ని సరిపోయినట్టయితే ఆమోదమా లేదా సరిపోకపోతే రద్దువు గాని చేస్తారు . 60 నుండి 80% మధ్య Name Matching Score వచ్చినట్టయితే సంబంధిత VRO వారు పరిశీలించి సరిపోయినట్టయితే అప్పుడు మాత్రమే ఆమోదం తెలుపుతారు.  80% కన్నా ఎక్కువ అంటే 80 నుండి 100%  వచ్చినట్లయితే నేరుగా రైతు సేవ కేంద్రం అధికారుల లాగిన్ లోనే రైతు గుర్తింపు సంఖ్య తుది ఆమోదం జరుగుతుంది. పాసుబుక్కులో ఏదైనా పేరు తప్పు ఉన్నట్టయితే ఆధార్ కార్డు ప్రకారం సంబంధిత డాక్యుమెంట్లు పట్టుకొని సచివాలయంలో లేదా మీ సేవలో Mutation Correction కింద భూమి రికార్డులో పేరు మార్చుకోవచ్చు .

తరువాత రైతు యొక్క మొబైల్ కొచ్చే ఓటిపి లేదా రైతు యొక్క బయోమెట్రిక్ ద్వారా e SIgn ప్రాసెస్ పూర్తి చేసినట్లయితే Name Matchinf Score ప్రకారం నేరుగా రైతు గుర్తింపు సంఖ్య జనరేట్ అవుతుంది

How to Check Your Farmer Registry Number Status?

రైతు గుర్తింపు సంఖ్య స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి

రైతు గుర్తింపు సంఖ్య జనరేట్ అయ్యిందా లేదా ప్రస్తుత స్టేటస్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఎవరికీ వారు లేదా ఎవరైనా సరే సొంతంగా మొబైల్ లోనే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు .ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసిన

Know FRN Number Status

తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే కింద చూపిన విధంగా వచ్చినట్టయితే వారికి రైతు గుర్తింపు సంఖ్య పూర్తి అయినది అని అర్థము .

చూపిన విధంగా వచ్చినట్టయితే వారికి ఇంతవరకు రైతు గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియ ప్రారంభించలేదు అని అర్థము .

ఇటువంటి వారు తప్పనిసరిగా ఆన్లైన్ లో లేదా మీకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని విజిట్ చేసి సందర్శించి వెంటనే రైతు గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి .

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page