2 నిమిషాల్లో… ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

,

ఆధార్…. ఆధార్… ఆధార్…. ఈ రోజుల్లో ఈ ప్రభుత్వ పనులకైనా మరియు ప్రైవేటుగా పనులకైనా ఆధార అనేది తప్పనిసరి అయిపోయింది. కొన్ని సమయాలలో మనం ఆధార్ కార్డును మర్చిపోతుంటాము. ఇలాంటి సమయంలో మళ్లీ ఇంటికి చేరుకొని ఆధార కార్డును తిరిగి తీసుకొని వెళ్లేంత సమయం లేక తీవ్ర ఇబ్బంది పడుతుంటాం.

అటువంటి సమస్యల నుంచి అధిగమించడానికి UIDAi ఆధార్ వెబ్సైట్ నుంచి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కలిగించింది.

అయితే ఈ ఆప్షన్ గురించి చాలామందికి తెలియదు మరియు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలియక సతమతమవుతుంటారు. అటువంటి వారి కోసం రెండే నిమిషాల్లో మీ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం

అయితే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి

  1. ఆధార్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం.
  2. mAadhaar యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం.
  3. DigiLocker ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం.

ఆధార్ వెబ్సైట్ ద్వారా మీ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం ఎలా

మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా ఆధార్ వెబ్సైట్ కి వెళ్ళాలి. ఆధార్ వెబ్సైట్ లింకు కింద ఇవ్వబడింది

ఆధార్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కింది విధంగా ఆధార్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.

ఆధార్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే Get Aadhaar ఆప్షన్ దగ్గర Download Aadhar ఆప్షన్ కనిపిస్తుంది. Download Aadhar ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.

క్లిక్ చేసిన తరువాత, మిమ్మల్ని my aadhaar వెబ్సైట్ తీసుకోని వెళ్తుంది. కిందికి స్క్రోల్ చేస్తే Download Aadhar అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.

క్లిక్ చేసిన తర్వాత, మీరు మీ ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ లేదా virtual ID ఉపయోగించి మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యండి.

ఆధార్ నంబరు ఎంటర్ చేసిన తరువాత CAPTCHA code ని ఎంటర్ చేసి, Send OTP బటన్ పైన క్లిక్ చెయ్యండి.

Send OTP బటన్ పైన క్లిక్ చేసిన తరువాత, మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కు otp వస్తుంది.

ఆ OTP ని ఎంటర్ చేసి, Verify & Download బటన్ పైన క్లిక్ చేయండి.

OTP వెరిఫికేషన్ పూర్తి అయిన తరువాత మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.

డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డ్ ఫైల్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. మీ ఆధార్ కార్డు ఓపెన్ చెయ్యడానికి, మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు మరియు మీరు జన్మించిన సంవత్సరం ఎంటర్ చేయాలి. ఉదా. మీ పేరు K Sharath Babu మరియు మీరు పుట్టిన సంవత్సరం 1976 అయితే, మీ ఆధార్ కార్డు పాస్వర్డ్ KSHA1976. లెటర్స్ అన్ని క్యాపిటల్ లోనే ఉండాలి.

గమనిక: కేవలం ఆధార్ తో మొబైల్ నంబర్ లింక్ అయిన వారు మాత్రమే ఆధార్ వెబ్సైట్ ద్వారా ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోగలరు. మిగిలిన వారు ఆఫ్లైన్ సెంటర్ ద్వారా ఆధార్ కార్డు పొందవచ్చు.

mAadhaar యాప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

ముందుగా maadhaar యాప్ ను కింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి

ఆప్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, భాష ని ఎంచుకోండి.

భాష ఎంచుకున్న తర్వాత, register my Aadhar బటన్ పైన క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి

లాగిన్ అయిన తర్వాత కింది విధంగా మీ ఆధార్ డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

ఆధార్ డౌన్లోడ్ మాత్రమే కాకుండా మరిన్ని సర్వీసులను కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

DigiLocker ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా

ముందుగా కింద ఇవ్వబడిన డిజి లాకర్ వెబ్సైట్ లింకును క్లిక్ చేయండి. వెబ్ సైట్ ఓపెన్ అయిన తర్వాత సైన్ ఇన్ బటన్ పైన క్లిక్ చేయాలి. మీకు అకౌంట్ లేనట్టు అయితే signup బటన్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

Sign ఇన్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత, మీరు మీ మొబైల్ ద్వారా కానీ లేదా ఆధార్ నెంబర్ ఉపయోగించి డిజి లాకర్ వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు. మొదటగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మరియు రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఇచ్చిన ఆరు అంకెల పిన్ నెంబర్ ఎంటర్ చేయండి.

ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి రావడం జరుగుతుంది.

మీ మొబైల్ నెంబర్కు గాని లేదా ఈమెయిల్ ఐడి కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి.

మీ డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత మీ digi లాకర్ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎడమవైపున ఉన్న సర్చ్ డాక్యుమెంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బార్ లో ఆధార్ అని టైప్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కింది విధంగా ఆధార్ కార్డు ఆప్షన్ రావడం జరుగుతుంది.

మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చెయ్యండి

ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత కింద ఉన్న consent పైన క్లిక్ చెయ్యండి. అప్డేట్ బటన్ పైన క్లిక్ చెయ్యాలి

ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నంబర్ కి OTP వస్తుంది. ఆ OTP ని ఎంటర్ చేసి Submit బటన్ పైన క్లిక్ చెయ్యండి.

వెరిఫికేషన్ పూర్తి అయిన తరువాత మీ అకౌంట్ హోమ్ పేజీ లో ఆధార్ కార్డు అనే ఆప్షన్ యాడ్ అవ్వడం జరుగుతుంది

ఆధార్ కార్డు ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు వివరాలు చూపిస్తాయి

ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి view all పైన క్లిక్ చేస్తే కింది విధంగా చూపిస్తుంది. డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే పిడిఎఫ్ ఆప్షన్ వస్తుంది.

డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి పిడిఎఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. మీ నచ్చిన Folder లో స్టోర్ చేసుకోవచ్చు

డౌన్లోడ్ అయిన ఫైల్ ఓపెన్ చేస్తే మీ ఆధార్ కార్డు వివరాలు చూపిస్తాయి

ఈ సమచారం మీకు నచ్చినట్లయితే, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ తో షేర్ చెయ్యగలరు

ఆధార్ కి సంబందించిన మరిన్ని ముఖ్యమైన లింకులు

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page