Aadhar Name Update : ఆధార్ లో మీ పేరులో తప్పులు ఉంటె ఇలా ఆన్లైన్ లో మార్చుకోండి

,

ఆధార్ మన జీవితాల్లో ఒక కీలక భాగమైపోయింది. ప్రతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ కి ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తున్నారు. బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, NREGA కార్డ్, రేషన్ కార్డ్ ఇలా ప్రతి చోట ఆధార్ ను లింక్ చేస్తున్నారు.

ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ సీడింగ్ తప్పనిసరి అయింది. అయితే ఆధార్ లో డేటా తప్పు ఉంటే? ఖచ్చితంగా మార్చుకోవాలి, లేదంటే మనకు చాలా అవాంతరాలు ఎదురవుతాయి. ఆధార్ లో ఎక్కువగా అడ్రస్, మొబైల్ నంబర్ లేదా బయోమెట్రిక్స్ మార్చుకుంటూ ఉంటాము. అయితే పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కూడా కొన్ని పరిమితులకు లోబడి  మార్చుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

పేరు లో ఏవైనా చిన్న తప్పులు ఉంటే మార్చుకోవచ్చు. అయితే పేరును జీవితంలో రెండు సార్లు మాత్రమే మార్చుకొగలం.

డేట్ ఆఫ్ బర్త్ – DOB అనగా పుట్టిన తేదీని జీవితంలో ఒక్కసారి మార్చుకోవచ్చు. జెండర్ (లింగం) – జీవితంలో ఒక్కసారి మార్చుకోవచ్చు.

ఆధార్ లో పేరు లో చిన్న చిన్న సవరణలు ఎలా మార్చుకోవచ్చు [Aadhaar Name Change Process]

గమనిక: పేరులో చిన్న మిస్టేక్స్ మాత్రమే మార్చుకునే వీలుంది. పూర్తి పేరు మార్చలేము

Step 1 : ముందుగా myaadhar.gov.in వెబ్సైట్ కి వెళ్ళండి

Step 2 : లాగిన్ పై క్లిక్ చేసి మీ ఆధార్, captcha ఎంటర్ చేసి send OTP పైన క్లిక్ చేయండి

Step 3 : మీ మొబైల్ కి వచ్చే 6 అంకెల OTP నంబర్ ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి

Step 4 : లాగిన్ అయిన తర్వాత కింద చుపిస్తున్న Name Gender DOB update option పైన క్లిక్ చేయండి

Step 5 : తర్వాత మీకు కింది విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మొదటి ఆప్షన్ ను ఎంచుకోండి.

Step 6 : కింద విధంగా ఒక జనరల్ మెసేజ్ వస్తుంది. Proceed to update aadhar పైన క్లిక్ చేయండి

Step 7 : కింది స్క్రీన్ లో మీకు ఏ వివరాలు మార్చాలో అది సెలెక్ట్ చేయమని అడుగుతుంది. అదే విధంగా మీరు ఇంకా ఎన్ని సార్లు మార్చుకునే ఛాన్స్ ఉందో కూడా చూపిస్తుంది. Name పైన సెలెక్ట్ చేసి Proceed to update aadhar పైన క్లిక్ చేయండి.

Note: మీరు ఒకేసారి మీ పేరుతో పాటు ఇంకేదైనా డేటా అప్డేట్ చేసుకోవాలని అనుకున్నా, వాటిని కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు.

Step 8 : తర్వాత మీకు మీ ప్రస్తుత పేరు ఏంటో చూపిస్తుంది. దాని కిందనే కొత్త పేరు అడుగుతుంది.

Step 9: తర్వాత మీ కొత్త పేరును ఎంటర్ చెయ్యండి

Step 10: కొత్త పేరు ఎంటర్ చేసిన తరువాత, ఆ పేరుకు సంబంధించి డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చెయ్యాలి

14. తరవాత payment screen open అవుతుంది. ఆధార్ అడ్రస్ కి నిర్ధారించిన అమౌంట్ ₹50 రూపాయలు పే చేసి సబ్మిట్ చేస్తే మీ పేరు అప్డేట్ అవుతుంది.

15. మీ పేమెంట్ పూర్తి అయిన తర్వాత మీకు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అందులో మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి SRN నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. వారంలోపు మీ పేరు అప్డేట్ అయిపోతుంది.

Note: మీరు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ , జెండర్ , అడ్రస్ ఇలా ఒకటి కంటే ఎక్కువ ఫీల్డ్స్ ఒకేసారి చేసుకోచ్చు.

మీ ఆధార్ అప్డేట్ స్టేటస్ SRN ఉపయోగించి ఎప్పుడైనా చెక్ చేసుకోవాలంటే కింది లింక్ పై క్లిక్ చేయండి.


Click here to Share

3 responses to “Aadhar Name Update : ఆధార్ లో మీ పేరులో తప్పులు ఉంటె ఇలా ఆన్లైన్ లో మార్చుకోండి”

  1. APPALA SWAMY BOTTA Avatar
    APPALA SWAMY BOTTA

    Ippudu avvadam ledhu

  2. Peter paul M Avatar
    Peter paul M

    Only. Address option is showing

  3. 2 నిమిషాల్లో… ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? – GOVERNMENT SCHEMES UPDATES

    […] […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page