సాధారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో అటు కేంద్రం గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గానీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తాయి. తద్వారా మహిళా సాధికారత మరియు మహిళలకు ఆర్థిక స్వలంబన లభిస్తే దేశం పురోగమిస్తుందని అందరి నమ్మకం.
అంతేకాదు దేశంలోనే సగం జనాభా ఉన్నటువంటి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లో ప్రభుత్వాలు కూడా ముందు వరుసలో ఉంటాయి.
మహిళా దినోత్సవ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు ముఖ్యమైన సంక్షేమ పథకాలు మీకోసం
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు
మహిళలు లేదా ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుంది.
1. ప్రధానమంత్రి మాతృ వందన యోజన – ఈ పథకం ద్వారా ప్రసవించే తల్లులకు కేంద్ర ప్రభుత్వం ప్రసూతి ఖర్చుల కింద 5000 రూపాయలను వారి ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకం లబ్ధిదారులకు ప్రసూతి సమయంలో జనని సురక్ష యోజన కూడా వర్తిస్తుంది.
2. సుకన్య సమృద్ధి యోజన పథకం : దేశంలోనే ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మరో పథకమే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకం ద్వారా ఒక వార్షిక సంవత్సరంలో కనిష్టంగా 250 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 వరకు ఆడపిల్ల పేరు మీద జమ చేయవచ్చు. ఆడపిల్లకు 21ఏళ్ళు నిండిన తర్వాత ఈ ఖాతా మెచ్యూర్ అవుతుంది. చదువు నిమిత్తం లేదా పెళ్లి నిమిత్తం ముందస్తు ఉపసంహరణ కూడా చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకం మీద 7.6 శాతం వడ్డీని అందిస్తున్నారు.
3. బేటి బచావో బేటి పడావో – ఆడపిల్లల చదువు ను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక పథకం బేటి బచావో బేటి పడావో..ఈ initiative ద్వారా ఆడపిల్ల విద్య కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో, ఆడపిల్లల చదువు ప్రాముఖ్యతను తెలియజేయడంలో ఈ పథకం ముఖ్యపాత్ర పోషిస్తుంది.
4. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ – ఈ పథకాన్ని కేంద్ర బడ్జెట్ 2023లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా మహిళలు లేదా ఆడపిల్లల పేరిట రెండు లక్షల వరకు డిపాజిట్ చేసి 7.5% వడ్డీని పొందవచ్చు. ఈ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలుపరచనున్నారు.
5. ప్రధానమంత్రి ఉజ్వల పథకం : ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా LPG గ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం దారిద్ర రేఖ కు దిగువున ఉన్న మహిళల పేరిట ఉచితంగా అందిస్తుంది. ఇప్పటికే మొదటి దశ పూర్తయిన నేపథ్యంలో రెండో దశ ఉజ్వల పథకం 2.0 కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో మహిళల కోసం అమలవుతున్న పథకాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ లో మహిళల కోసం అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల విషయంలో మహిళలకే రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానాన్ని కట్టబెట్టింది.
ఈ నేపథ్యంలో మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మీకోసం.
వైయస్సార్ ఆసరా పథకం – ఈ పథకం ద్వారా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో అమలు చేస్తుంది. డ్వాక్రా మహిళలు ఏప్రిల్ 11 2019 వరకు తీసుకున్న రుణాలను ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది.
వైయస్సార్ చేయూత పథకం : ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ తదితర కులాలకు చెందినటువంటి పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం 18500 రూపాయలను నాలుగు దశల్లో వారి ఖాతాలో జమ చేస్తుంది.
ఈ బీసీ నేస్తం పథకం – ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉండే అగ్రకులాల పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 15 వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేస్తుంది.
వైయస్సార్ కాపు నేస్తం పథకం: ఈ పథకం ద్వారా కాపు కులానికి చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు ఉండే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 15 వేల రూపాయల అమౌంట్ ను వారి ఖాతాలో జమ చేస్తుంది.
వైయస్సార్ సున్నా వడ్డీ పథకం (డ్వాక్రా) – ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీ అమౌంటు ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వారి ఖాతాలో జమ చేస్తుంది.
పేదలందరికీ ఇల్లు పథకం (జగనన్న కాలనీలు) : ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేటటువంటి ఇళ్లను మహిళల పేరు మీదే రాష్ట్రప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తుంది.
ఇవే కాకుండా అమ్మ ఒడి వసతి దీవెన విద్య దీవెన వంటి పథకాల అమౌంట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాలోనే జమ చేస్తుంది.
మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న పలు ముఖ్యమైన సంక్షేమ పథకాలు మీకోసం.
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ – ఈ పథకం ద్వారా కొత్తగా పెళ్లి చేసుకుంటున్న ఆడపిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలు ఈ పథకానికి అర్హులు. వీరికి పెళ్లి కానుకగా 1,00,116 ను ప్రభుత్వం ఆడబిడ్డలకు అందిస్తుంది.
Kcr kit – కెసిఆర్ కిట్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రెగ్నెంట్ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్ను పంపిణీ చేస్తుంది. ఇందులో ప్రెగ్నెంట్ మహిళలకు కావలసిన పోషక పదార్థాలను, సిరప్, నెయ్యి వంటివి అందించడం జరుగుతుంది.
ఆరోగ్య లక్ష్మి పథకం – ఈ పథకం ద్వారా ప్రతిరోజు గర్భం తో ఉన్న లేదా పాలిచ్చే మహిళలకు ఒక ఉచిత భోజనాన్ని అంగన్వాడి కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. భోజనంతోపాటు ప్రతిరోజు గుడ్డు మరియు 200 ml పాలను రాష్ట్ర ప్రభుత్వం వారికి భోజనం తో పాటు అందిస్తుంది.
రెగ్యులర్ గా మరిన్ని అప్డేట్స్ కోసం studybizz ని ఫాలో అవ్వండి.
Leave a Reply