వైయస్ఆర్ సున్నా వడ్డీ డ్వాక్రా రుణాల పథకం 2024

𝐘𝐒𝐑 𝐒𝐮𝐧𝐧𝐚 𝐕𝐚𝐝𝐝𝐢 𝐒𝐜𝐡𝐞𝐦𝐞 𝐯𝐢𝐝𝐞𝐨Videos

This video lists all about Sunna Vaddi scheme Thank you visit our youtube channel....

#వైయస్ఆర్ సున్నా వడ్డీ డ్వాక్రా రుణాల పథకం 2024 : YSR Zero Interest Dwakra Women Scheme 2024: Apply Online, Eligibility & Beneficiary List
SHG Urban 4.3.0 appDownload

Uninstall old version and clear cache

స్వయం సహాయక సంఘాలు లేదా DWCRA సంఘాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం. వైఎస్ఆర్ హయాంలో పావలా వడ్డీ రుణాలతో ప్రారంభించ బడిన ఈ పథకం తరువాత సున్నా వడ్డీ పథకం గా అమలు అవుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు తీసుకున్నటువంటి రుణాలకు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఒక ఏడాదిలో సకాలంలో చెల్లించిన రుణాలకు వడ్డీ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం ఖాతాలో జమ చేస్తుంది. ఈ ఏడాది 1.02 కోట్ల మంది డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ జమ చేసింది.

వైయస్ఆర్ జీరో వడ్డీ రుణ వివరాలు

పేరు DWCRA మహిళా సంఘాల కోసం వైయస్ఆర్ జీరో వడ్డీ పథకం
ప్రారంభించబడింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి
లబ్ధిదారులు స్వయం సహాయక బృందాలు మరియు DWCRA మహిళా సంఘాలు
లక్ష్యం ద్రవ్య సహాయం అందించడం
అధికారిక వెబ్‌సైట్

ముఖ్య ఉద్దేశం

⦿ పొదుపు సంఘాల మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించడం
⦿ జీవనోపాధి కోసం తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించలేని పొదుపు సంఘాలకు ఆర్థిక భరోసా ఇవ్వడం.
⦿ పొదుపు సంఘాల చెల్లించలేని మొత్తం వడ్డీని ప్రభుత్వమే భరించడం


వైయస్ఆర్ జీరో వడ్డీ రుణానికి బడ్జెట్

COVID ని పరిష్కరించడం ప్రాధాన్యత అని, అయితే సంక్షేమ పథకాలు కూడా చాలా ముఖ్యమని ఆర్థిక మంత్రి అన్నారు. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలకు సహాయం చేయడానికి వైఎస్‌ఆర్ జీరో వడ్డీ రుణ పథకానికి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో రూ .1,365.08 కోట్లు కేటాయించింది.

ప్రయోజనాలు

⦿ ఈ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారం అంతటినీ ప్రభుత్వమే భరిస్తుంది
⦿ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండే పొదుపు సంఘాలకు నేరుగా వారి సంఘం యొక్క బ్యాంకు ఖాతాలో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడత లో డబ్బులు జమ చేస్తారు

అర్హతలు

⦿ బ్యాంకుల నుంచి గరిష్టంగా ఐదు లక్షల రుణం తీసుకున్న కాదు సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది
⦿ రుణం తీసుకున్న నాటి నుంచి సకాలంలో వాయిదాల చెల్లించిన పొదుపు సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది
⦿ లబ్ధిదారుల గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలు డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఉండాలి

అనర్హతలు

⦿ సకాలంలో వాయిదాలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన సంఘాలు అనర్హులు
⦿ ఐదు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారు అనర్హులు

కావలసిన పత్రాలు

⦿ ద్వాక్రా గ్రూప్ కలిగిన బ్యాంకు ఖాతా పుస్తకం
⦿ ఆధార్ కార్డు
⦿ పొదుపు సంఘం రిజిస్టర్

ఇతర వివరాలు

⦿ వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారు సంబంధిత గ్రామ వార్డు సచివాలయం ప్రదర్శించబడిన అర్హుల జాబితాను వివరంగా పరిశీలించాలి.
⦿ ఒకవేళ జాబితాలో పేర్లు నమోదు కానట్లయితే మీ సమీప గ్రామ సచివాలయం కానీ వాలంటీర్లకు కానీ మీ వివరాలు అందించగలరు
⦿ అలా కాకపోతే 155251 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది

#

JOIN Our Telegram Group

  • #
  • #
  • #
  • #