Sukanya Samriddhi Yojana Scheme - సుకన్య సమృద్ధి యోజన పథకం
సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది ఆడపిల్లల తల్లిదండ్రులకు భారత ప్రభుత్వ మద్దతుతో ప్రవేశపెట్టిన పొదుపు పథకం. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ ఆడ పిల్లల భవిష్యత్తు, విద్య కోసం నిధిని సమకూర్చుకునే వెసులుబాటు కలుగుతుంది.
బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారంలో భాగంగా 22 జనవరి 2015న ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ పథకం పూర్తి వివరాలు
- సుకన్య సమృద్ధి పథకం కింద ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా ₹250/- గరిష్టంగా ₹ 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.
- 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆడపిల్ల పేరు మీద ఈ ఖాతాను తెరవవచ్చు.
- ఒక ఆడపిల్ల పేరిట ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది.
- పోస్టాఫీసుల్లో మరియు నిర్దేశించబడిన బ్యాంకుల్లో ఖాతా తెరవవచ్చు.
- విద్య ఖర్చులను తీర్చడానికి ఖాతాదారు యొక్క ఉన్నత విద్య ప్రయోజనం కోసం 50% వరకు ఉపసంహరణ అనుమతించబడుతుంది.
- 18 ఏళ్లు నిండిన తర్వాత ఆడపిల్లకు వివాహం జరిగితే ఖాతాను ముందుగానే మూసివేయవచ్చు.
- ఖాతాను భారతదేశంలో ఎక్కడికైనా ఒక పోస్టాఫీసు/బ్యాంకు నుండి మరొకదానికి బదిలీ చేయవచ్చు.
- ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది.
- I.T. చట్టంలోని సెక్షన్.80-C కింద ఈ డిపాజిట్ మినహాయింపుకు అర్హత పొందుతుంది.
- ఐ.టి.చట్టంలోని సెక్షన్ -10 కింద ఖాతాలో సంపాదించిన వడ్డీ కి ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వబడుతుంది.
- ఒక కుటుంబంలో గరిష్టాంగా ఇద్దరు ఆడ పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది
సుకన్య సమృద్ధి యోజన పథకానికి కావలసిన డాకుమెంట్స్ ఏంటి?
⦿ SSY ఖాతా తెరిచేందుకు అప్లికేషన్ ఫార్మ్.
⦿ ఆడపిల్ల యొక్క జనన ధృవీకరణ పత్రం, దానిపై ఆడపిల్ల పేరు ఉండాలి.
⦿ ఆడపిల్లల తల్లి/తండ్రి/చట్టపరమైన సంరక్షకుల ఫోటో
⦿ తల్లిదండ్రులు/సంరక్షకుల KYC పత్రాలు (గుర్తింపు & చిరునామా రుజువు)..
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ మరియు ఇతర బెనిఫిట్స్
⦿ ఈ పథకం ద్వారా ప్రస్తుతం 7.6% వడ్డీ ని ప్రభుత్వం చెల్లిస్తుంది
⦿ ఈ పథకం కోసం డిపాజిట్ చేసే అమౌంట్ కి I.T. చట్టంలోని సెక్షన్.80-C కింద ని ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు
⦿ ఆడపిల్లల తల్లి/తండ్రి/చట్టపరమైన సంరక్షకుల ఫోటో
⦿ ఈ పథకం పై జమ అయ్యే వడ్డీ పై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు