రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్ సున్నా వడ్డీ పథకం [ YSR Sunna Vaddi 2023 ] కింద వడ్డీ అమౌంట్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
కోనసీమ జిల్లా అమలాపురం నుంచి నిధులు విడుదల
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నుంచి ముఖ్యమంత్రి వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్ సున్నా వడ్డీ నిధులను మహిళల ఖాతాలో జమ చేశారు.
మొత్తం 9.48 లక్షల డ్వాక్రా గ్రూపులలోని 1,05,13,365 మంది డ్వాక్రా మహిళలకు 1353.76 కోట్ల రూపాయలను మహిళల ఖాతాలో విడుదల చేయడం జరిగింది.
సున్నా వడ్డీ పథకం పేమెంట్ స్టేటస్ – YSR Sunna Vaddi 2023 Status
కింది లింకు ద్వారా మీరు సున్నా వడ్డీ పథకానికి మీ గ్రూపు కి సంబంధించి ఏ రుణాలు అర్హత ఉన్నాయో ఎంత అమౌంట్ ఉన్నాయని వివరాలను చెక్ చేయవచ్చు.
పై లింక్ లో మీ జిల్లా, మునిసిపాలిటీ, తర్వాత మీ వీధి ఎంచుకొని మీ గ్రూపు వివరాలు చెక్ చేయవచ్చు.
వైయస్సార్ సున్నా వడ్డీ పథకం గురించి షార్ట్ గా మీకోసం [ YSR Sunna Vaddi 2023 Dwakra ]
స్వయం సహాయక సంఘాలు లేదా DWCRA సంఘాలను
బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
ప్రారంభించిన పథకం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం.
వైఎస్ఆర్ హయాంలో పావలా వడ్డీ రుణాలతో ప్రారంభించ బడిన ఈ పథకం తరువాత సున్నా వడ్డీ పథకం గా అమలు అవుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు తీసుకున్నటువంటి రుణాలకు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఒక ఏడాది కాలంలో సకాలంలో చెల్లించిన రుణాలకు వడ్డీ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం ఖాతాలో జమ చేస్తుంది.
గమనించగలరు : 3 లక్షల లోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి రుణాలు కానీ లేదా కొత్త రుణాలు కానీ తీసుకొని మీరు ఒక సంవత్సరంలో చెల్లించినటువంటి వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం పూర్తయిన వెంటనే మరుసటి ఏడాది వడ్డీ మొత్తాన్ని పొదుపు ఖాతాలో జమ చేస్తుంది.

వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం కింది లింక్ ని ఫాలో అవ్వండి
Leave a Reply to GADDE Saraswathi Cancel reply