 
 ➤ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నాలుగో విడత అమౌంట్ విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,05,13,365 మంది మహిళలు కట్టవలసిన ₹1,353.78 కోట్ల వడ్డీని బటన్ నొక్కి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం
Uninstall old version and clear cache
స్వయం సహాయక సంఘాలు లేదా DWCRA సంఘాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం. వైఎస్ఆర్ హయాంలో పావలా వడ్డీ రుణాలతో ప్రారంభించ బడిన ఈ పథకం తరువాత సున్నా వడ్డీ పథకం గా అమలు అవుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు తీసుకున్నటువంటి రుణాలకు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఒక ఏడాదిలో సకాలంలో చెల్లించిన రుణాలకు వడ్డీ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం ఖాతాలో జమ చేస్తుంది. ఈ ఏడాది 1.02 కోట్ల మంది డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ జమ చేసింది.
| పేరు | DWCRA మహిళా సంఘాల కోసం వైయస్ఆర్ జీరో వడ్డీ పథకం | 
| ప్రారంభించబడింది | వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి | 
| లబ్ధిదారులు | స్వయం సహాయక బృందాలు మరియు DWCRA మహిళా సంఘాలు | 
| లక్ష్యం | ద్రవ్య సహాయం అందించడం | 
| అధికారిక వెబ్సైట్ | – | 
⦿ పొదుపు సంఘాల మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించడం 
⦿ జీవనోపాధి కోసం తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించలేని పొదుపు సంఘాలకు ఆర్థిక భరోసా ఇవ్వడం.  
⦿ పొదుపు సంఘాల చెల్లించలేని మొత్తం వడ్డీని ప్రభుత్వమే భరించడం 
COVID ని పరిష్కరించడం ప్రాధాన్యత అని, అయితే సంక్షేమ పథకాలు కూడా చాలా ముఖ్యమని ఆర్థిక మంత్రి అన్నారు. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలకు సహాయం చేయడానికి వైఎస్ఆర్ జీరో వడ్డీ రుణ పథకానికి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో రూ .1,365.08 కోట్లు కేటాయించింది.
⦿ ఈ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు నుంచి తీసుకున్న  రుణాలపై వడ్డీ భారం అంతటినీ ప్రభుత్వమే భరిస్తుంది 
⦿ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండే పొదుపు సంఘాలకు నేరుగా వారి సంఘం యొక్క బ్యాంకు ఖాతాలో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడత లో డబ్బులు జమ చేస్తారు 
⦿ బ్యాంకుల నుంచి గరిష్టంగా ఐదు లక్షల రుణం తీసుకున్న కాదు సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది 
⦿ రుణం తీసుకున్న నాటి నుంచి సకాలంలో వాయిదాల చెల్లించిన పొదుపు సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది 
⦿ లబ్ధిదారుల గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలు డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఉండాలి 
⦿ సకాలంలో వాయిదాలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన సంఘాలు అనర్హులు 
⦿ ఐదు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారు అనర్హులు 
⦿ ద్వాక్రా గ్రూప్ కలిగిన బ్యాంకు ఖాతా పుస్తకం 
⦿ ఆధార్ కార్డు 
⦿ పొదుపు సంఘం రిజిస్టర్ 
⦿ వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారు సంబంధిత గ్రామ వార్డు సచివాలయం ప్రదర్శించబడిన అర్హుల జాబితాను వివరంగా పరిశీలించాలి. 
⦿ ఒకవేళ జాబితాలో పేర్లు నమోదు కానట్లయితే మీ సమీప గ్రామ సచివాలయం కానీ వాలంటీర్లకు కానీ  మీ వివరాలు అందించగలరు 
⦿ అలా కాకపోతే 155251 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది 
 
 


