YSR Cheyutha 2023 : ప్రారంభమైన వైయస్సార్ చేయూత అప్లికేషన్స్, ఇవి తప్పనిసరి

,
YSR Cheyutha

YSR Cheyutha 2023 – వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించిన ఈ ఏడాది అమౌంటును సెప్టెంబర్ లో విడుదల చేయనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి కొత్త అప్లికేషన్స్ స్వీకరణ సచివాలయాల ద్వారా ప్రారంభమైంది.

ఇది చదవండి: వైయస్సార్ చేయూత టైం లైన్స్ విడుదల

Table of Contents

ప్రారంభమైన వైయస్సార్ చేయూత న్యూ అప్లికేషన్స్ [YSR Cheyutha 2023 Applications started]

వైయస్సార్ చేయూత 2023 24 సంవత్సరానికి సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్నటువంటి అర్హులైన ఎస్సీ, ఎస్టీ బీసీ మరియు మైనారిటీ కులాలకు చెందినటువంటి మహిళల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హులైన వారు అన్ని ధ్రువీకరణ పత్రాల తోటి మీ వాలంటీర్ ను లేదా సచివాలయంలో సంప్రదించవచ్చు.

అదేవిధంగా గత ఏడాది లబ్ధిదారుల వెరిఫికేషన్ కూడా ఈ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

అర్హులైన వారు వెంటనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆదాయం, కుల దృవీకరణ పత్రాలు అప్లై చేసుకుని సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం వెల్లడించింది. అయితే పాత లబ్ధిదారులకు గతంలో సచివాలయాల ద్వారా జారీ చేయబడినటువంటి సర్టిఫికెట్లు ఉంటే సరిపోతుంది లేదా రీ ఇష్యూచేయబడిన సర్టిఫికెట్లు కూడా సరిపోతాయి. కొత్తగా ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్లను ఒకసారి మీ వాలంటీర్ కి చూపించి వెరిఫై చేయించుకోండి.

YSR Cheyutha Release Date 2023 : In September 2023

Read This – ఇది చదవండి వైయస్సార్ చేయూత 2023 ముఖ్యమైన సూచనలు

వైయస్సార్ చేయూత పథకం గురించి షార్ట్ గా మీకోసం

45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి  ఆర్ధిక వెసులుబాటు కలిగించే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu).

ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికీ 18,750 రూపాయలు అందించడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద అర్హులైన వారికి మొత్తంగా రూ.75 వేల ఆర్థిక సాయం లభించనుంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకండా ప్రతి ఏటా ఒకసారి విడతల వారీగా లబ్ధిదారులకు చేరుతాయి. 

ఇప్పటికే మూడు విడతల డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే ఇంకో విడత డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

YSR Cheyutha 2023

వైయస్సార్ చేయూత పథకం అర్హతలు (YSR Cheyutha 2023 Eligibility In Telugu )

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయ్యి ఉండాలి 
  • SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి వయస్సు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. వైఎస్ఆర్ చేయూత 2023 -2024 గాను 13.08.1963 నుండి 12.08.1978 మధ్య జన్మించిన వారు మాత్రమే వర్తిస్తుంది.
  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి రైస్ కార్డు / తెల్ల రేషన్ కార్డు ఉండాలి 
  • బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి 
  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు 
  • మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి  మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు 
  • కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు 
  • కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది  సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి 
  • పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు 
  • కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు

వైయస్సార్ చేయూత పథకం అనర్హతలు (YSR Cheyutha 2023 Ineligibility) 

  • గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు 
  • ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
  • ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రానికి చెందినవారు అనర్హులు. తాత్కాలిక వలసలో ఉంటే అర్హులు.
  • ఓపెన్ క్యాటగిరీకి (OC)  చెందినవారు అనర్హులు.
  • ఆధార్ కార్డు లేని వారు అనర్హులు.
  • రైస్ కార్డు లేని వారు అనర్హులు.
  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10000 పట్టణ ప్రాంతాల్లో 12 వేలకు మించి ఉన్నవారు అనర్హులు.
  • కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం గానీ పెన్షన్ గాని ఉన్నట్టయితే వారు అనర్హులు.
  • గడిచిన ఆరు నెలల్లో కరెంటు బిల్లు 300 యూనిట్లు కన్నా ఎక్కువ ఉన్న వారు అనర్హులు..
  • ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి కుటుంబంలో ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలో చెందినవారు అనర్హులు
  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు అనర్హులు.

వైయస్సార్ చేయూత పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా? (How To Apply For YSR Cheyutha Scheme)

వైఎస్ఆర్ చేయూత పథకానికి(YSR Cheyutha Scheme In Telugu) మీ  గ్రామా లేదా వార్డు సచివాలయం లో మాత్రమే దరఖాస్తు చెయ్యవచ్చు .  దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది 

  • వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు  వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు. 
  • వైఎస్ఆర్ చేయూత పధకానికి  అర్హులైన వారి లిస్టు జాబితా సచివాలయం నోటీసు బోర్డు లో పెట్టడం జరుగుతుంది
  • అర్హులైన వారికి 18,750 రూపాయలు మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 

వైయస్సార్ చేయూత పథకానికి(YSR Cheyutha Scheme In Telugu) దరఖాస్తు చేసుకునే విధానం 

  • అర్హత కలిగిన వారు రైస్  కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • Eligibility Criteria ను ఆన్ లైన్ లొ చెక్ చేసి అర్హులు అయితే సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయడం జరుగుతుంది. అనర్హులైన వారికి కారణాలు తెలియజేయడం జరుగుతుంది.
  • దరఖాస్తుదారునికి (యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది.
  • దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను వెరిఫై చేసి 18,750/-  రూపాయలును వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది

వైయస్సార్ చేయూత పథకం పత్రాలు (YSR Cheyutha Scheme Documents) 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పత్రాలు (YSR Cheyutha Scheme Documents) 

  1. Application Form 
  2. Aadhaar Update History ( ఆధార్ అప్డేట్ హిస్టరీ) (AP Seva)
  3. Caste Certificate (AP Seva)
  4. Income Certificate (AP Seva)
  5. Bank Passbook ( ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్)
  6. Biometric eKYC / IRIS eKYC / OTP Authentication 
  7. Rice Card 
  8. ఎలక్ట్రిసిటీ బిల్లు
  9. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్

వైయస్సార్ చేయూత పథకం ప్రయోజనాలు (YSR Cheyutha Scheme Benefits) 

వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళలకు జీవనోపాధి కల్పిస్తారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వారికి  కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల యూనిట్లు  కూడా ఏర్పాటు చేయిస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌, రిలయన్స్‌, పీఅండ్‌జీ, ఐటీసీ వంటి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని. ఆసక్తి కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది.

వైయస్సార్ చేయూత పథకం చెల్లించే  మొత్తం (YSR Cheyutha Amount) 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) చెల్లించే మొత్తం (YSR Cheyutha Amount) 

  • వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) కింద  SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి  వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద అర్హులైన వారికి మొత్తంగా రూ.75 వేల ఆర్థిక సాయం లభించనుంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకండా ప్రతి ఏటా ఒకసారి విడతల వారీగా లబ్ధిదారులకు చేరుతాయి. 
  • ఇప్పటికే మూడు విడతల డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకో విడత అమౌంట్ మహిళల బ్యాంక్ ఖాతాల్లో సెప్టెంబర్ లో విడుదల కానుంది.

వైయస్సార్ చేయూత పథకం చెల్లింపు తేది 2023 (YSR Cheyutha Scheme Payment Date 2023)

వైఎస్ఆర్ చేయూత పథకం సంవత్సరానికి గాను 18,750 రూపాయలు సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. విడుదల తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు

వైయస్సార్ చేయూత పథకం అప్లికేషన్ స్టేటస్ (YSR Cheyutha Application Status) 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ ను తెలుసుకోవటం కోసం కింద లింక్ పై క్లిక్ చెయ్యండి 

వైయస్సార్ చేయూత పథకం మంజూరు జాబితా (YSR Cheyutha Sanction List) 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది  . వైఎస్ఆర్ చేయూత పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు.

వైయస్సార్ చేయూత పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Cheyutha Official website) 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) అధికారిక వెబ్సైట్( YSR Cheyutha Official website) – చేయూత పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ ను మీరు కింది లింక్ ద్వారా చెక్ చేయండి.

వైయస్సార్ చేయూత పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Cheyutha Helpline Number) 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ ( YSR Cheyutha Helpline Number) – 1902

వైఎస్సార్ చేయూత 2023 పథకానికి సంబంధించి రెగ్యులర్ గా అప్డేట్స్ పొందడానికి కింది లింక్ ఫాలో అవ్వండి లేదా Google లో studybizz cheyutha అని టైపు చేయండి

Click here to Share

3 responses to “YSR Cheyutha 2023 : ప్రారంభమైన వైయస్సార్ చేయూత అప్లికేషన్స్, ఇవి తప్పనిసరి”

  1. YSR Cheyutha 2023 – వైయస్సార్ చేయూత లేటెస్ట్ అప్డేట్ – STUDYBIZZ

    […] here for all details about YSR Cheyutha 2024 Scheme YSR Cheyutha 2023 detailed Information Click here to […]

  2. Nakka ravibabu Avatar
    Nakka ravibabu

    New application online last date eppudu sir

  3. Pediredla laxmi Avatar
    Pediredla laxmi

    2023- Cheyutha scheme verification list lo name ledhu but eligible ani documents tesukunnaru next process enti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page