వితంతు పెన్షన్ కొరకు గ్రామ వార్డు సచివాలయం లో దరఖాస్తు చేయు విధానము

,

వితంతువు పెన్షన్ కి అప్లై చేసుకోవడానికి ముందుగా రైస్ కార్డు లో భర్త పేరును డిలీట్ చేసి, తర్వాత మాత్రమే  వితంతు పెన్షన్ కు కొత్తగా దరఖాస్తు చేయాలి.

ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడానికి 21 రోజులు సమయం పడుతుంది మరియు దరఖాస్తు రుసుము ₹24/- లు

గ్రామ సచివాలయం లో PS Gr-VI (DA) మరియు వార్డు సచివాలయం లో వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ WEDPS వారి లాగిన్ లో “Death Declaration” చేయు విధానం. 

AP SEVA PORTAL —>DA/WEDPS LOGIN–>CONSUMER AFFAIRS,FOOD AND CIVIL SUPLIES —–>CIVIL SUPLIES—>MEMBER DELETION IN RICE CARD.

దరఖాస్తు చేసినపుడు LIVE లో ఉండే వారి ఆధార్ తో అప్లై చేయాలి 

దరఖాస్తు చేసి సబ్మిట్ చేసిన తర్వాత T SERIES  తో నంబర్ GENERATE అవుతుంది.

ఆ నంబర్ తో  AEPDS/GVWV (వాలంటీర్ లాగిన్)యాప్ ద్వారా DEATH DECLARATION పూర్తి చేయాలి.

AEPDS APP లో అయితే  DEATH DECLARATION అనే ఆప్షన్ లో T NUMBER  ఎంటర్ చేసి DEATH అయిన వారి పేరు సెలెక్ట్ చేసి తర్వాత STEP లో LIVE లో ఉన్న వారితో THUMB తీసుకుని సబ్మిట్ చేయాలి.

AEPDS/GVWV APP లో ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఆ దరఖాస్తుదారు/రాలు యొక్క వివరాలు AP SEVA PORTAL WRS/VRO LOGIN లో ENABLE అవుతుంది.

VRO/WRS VERIFICATION తర్వత వాళ్ళ లాగిన్ లో నుండి ఫార్వర్డ్ చేయాలి.తర్వాత MRO గారు వారి లాగిన్ లో అప్రూవల్ చేస్తారు

MRO గారు లాగిన్ లో అప్రూవల్ అయిన తర్వాత  AEPDS APP(వాలంటీర్ లాగిన్) లో ISSUE CARD చేయాలి. తర్వాత రైస్ CARD PRINT తీసుకోవాలి .WRS/VRO LOGIN లో నుండి పై PROCESS అంత చేసిన తర్వాత మాత్రమే భర్త పేరు రైస్ కార్డ్ నుండి DELETE అవుతుంది ఆ తర్వాత మాత్రమే వితంతు పెన్షన్ అప్లై చేయాలి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page