ఏపి లో మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో అమలు కానున్న ప్రభుత్వ పథకాల జాబితా ను ప్రభుత్వం ప్రకటించింది. Mlc ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం పథకాల లిస్ట్ ను విడుదల చేసింది.
మార్చు మరియు ఏప్రిల్ నెలలో అమలు కానున్న పథకాలు ఇవే
- మార్చి 10నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ప్రారంభం.
- మార్చి 18 సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం… జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ.
- మార్చి 22న ఉగాదిరోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన. వీరికి ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు.
- మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం.
- మార్చి 25 నుంచి వైయస్సార్ ఆసరా. ఏప్రిల్ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం.
- మార్చి 31న జగనన్న వసతి దీవెన.
- ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు.
- ఏప్రిల్ 10న వాలంటీర్లకు సన్మానం.
- ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం.
Leave a Reply