➤ నేడే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభం. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నేడు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో వైద్య సేవలు విస్తృతంగా అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రారంభించింది. వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద మరికొన్ని వైద్య చికిత్సలను తీసుకురావడంతో గ్రామాలలో ప్రజలకు తమ గ్రామంలోనే మెరుగైన వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును దశలవారిగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇప్పటివరకు గ్రామాల్లో సరైన వైద్య సేవలు అందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామం, ప్రతి వార్డులో విస్తృత స్థాయిలో వైద్య సేవలు అందించే దృక్పథంతో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ఏప్రిల్ 6న ప్రారంభిస్తుంది.
⦿ జనరల్ అవుట్ పేషెంట్ సేవలు
⦿ బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలో అప్
⦿ గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్ నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు.
⦿ చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు.
⦿ రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు
⦿ ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితం అయిన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం.
⦿ పాలియేటివ్ కేర్
⦿ తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ
⦿ గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్
⦿ హిమోగ్లోబిన్ టెస్ట్
⦿ ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్(షుగర్)
⦿ మలేరియా టెస్ట్
⦿ హెచ్ఐవీ నిర్ధారణ
⦿ డెంగ్యూ టెస్ట్
⦿ మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్)
⦿ అయోడిన్ టెస్ట్
⦿ వాటర్ టెస్టింగ్
⦿ హెపటైటిస్ బి నిర్ధారణ
⦿ ఫైలేరియాసిస్ టెస్ట్
⦿ సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్
⦿ విజువల్ ఇన్స్పెక్షన్
⦿ స్పుటమ్ (ఏఎఫ్బీ)