 
 |   | 
| Latest Update ఏపి లో ఒంటి పూట బడుల నేపథ్యంలో రాష్ట్రంలో రాగి జావ బదులు తిరిగి చిక్కి ఇవ్వనున్న ప్రభుత్వం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తిరిగి రాగి జావ ప్రారంభం. | 
Jagananna Goru Mudda Mid day Meals scheme
	జగనన్న గోరుముద్ద పథకం అంటే ఏమిటి?
జగనన్న గోరుముద్ద పథకం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం. 
ఇదివరకే ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎపి జగన్నన్న గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టింది. 
 గోరుముద్ద పథకాన్ని 2020 జనవరి 21 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. 
ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంతో, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందుబాటులో ఉన్న మధ్యాహ్నం భోజన మెనూలోనూ మార్పులు చేయబడ్డాయి. 
ఈ పథకం ద్వారా, వారమంతా ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ఆహారంలో పోషక దృక్పథాన్ని మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుంది.
| Monday | హాట్ పొంగల్ , బాయిల్డ్ ఎగ్ ,వెజ్ పులావ్ , గుడ్డు కర్రీ, చిక్కి | 
| Tuesday | చింతపండు పులిహోర, దొండకాయ చట్నీ,ఉడికించిన గుడ్డు ,రాగి జావ | 
| Wednesday | వెజిటేబుల్ రైస్, బంగాళదుంప కుర్మా, గ్రుడ్డు, చిక్కి | 
| Thursday | సాంబార్ అన్నం, నిమ్మకాయ పులిహోర, టొమాటో చట్నీ,గుడ్డు, రాగి జావ | 
| Friday | అన్నం, ఆకు కూర, కోడిగుడ్డు, చిక్కి | 
| Saturday | అన్నం, సాంబార్, పాయసం లేదా స్వీట్ పొంగల్, రాగి జావ | 
 
  
 


