సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGBలు) అనేవి బంగారం లో పెట్టుబడి పెట్టే వారికి ప్రభుత్వం జారీ చేసేటటువంటి సెక్యూరిటీస్. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) పథకాన్ని మొదటిసారిగా భారత ప్రభుత్వం (GOI) అక్టోబర్ 30, 2015న ప్రారంభించింది. ఈ బాండ్స్ ను 2023-24 ఏడాదికి గాను సీరీస్ 4 లో భాగంగా కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఫిబ్రవరి 12 నుంచి కొనుగోలు కి అనుమతి
ప్రతి ఆర్థిక సంవత్సరం మాదిరి గానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా నాలుగు విడతల లో ఈ బాండ్ల కొనుగోలు కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ తెరుస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం చివరి వడత అనగా ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు నాలుగో విడత లో కొనుగోలు కు అవకాశం కల్పించడం జరిగింది.
బాండ్‌లను 1 గ్రాము ప్రాథమిక యూనిట్‌తో కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం ఫిబ్రవరి 12 నాటికి గ్రాము బంగారం ధర రూ.6263/- ను ఇష్యూ ధారగా ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది. ఆన్లైన్లో బాండ్లు కొనుగోలు చేసే వారికి గ్రాము పై రూ.50 రాయితీ ఇస్తారు. అంటే ఇష్యూ ధర రూ.6213 తో ఒక గ్రాము బంగారం ధర వర్తిస్తుంది.
సావరిన్ గోల్డ్ బాండ్ పథకం అంటే ఏమిటి? లక్షణాలు
మనం సాధారణంగా గోల్డ్ కొంటూ ఉంటాము అయితే భౌతికంగా ఉండే గోల్డ్ కంటే కూడా ఈ సావరిన్ గోల్డ్ మరింత సేఫ్ మరియు భద్రం.
సావరిన్ గోల్డ్ బాండ్ల పైన 2.5% వడ్డీ ని రిజర్వ్ బ్యాంక్ చెల్లిస్తుంది. ఏడాదికి 2 సార్లు ఈ వడ్డీ ను అకౌంట్ లో జమ చేస్తారు.
8 యేళ్లు ఈ బాండ్స్ కి గడువు ఉంటుంది. అంటే 8 ఏళ్లకు మెచ్యూర్ అవుతాయి.
డిమ్యాట్ పద్దతిలో ఓపెన్ చేస్తే ఎపుడైనా షేర్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు. అదే నాన్ డిమ్యాట్ పద్దతిలో అయితే 5 ఏళ్ల తర్వాత నుంచి ముందస్తు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
సావరిన్ గోల్డ్ బాండ్‌లను రుణాలకు తాకట్టుగా కూడా పెట్టుకోవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్‌లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) నుండి రుణాల కోసం పూచీకత్తుగా ఉపయోగించడానికి అర్హులు.
ఆర్‌బిఐ ఎప్పటికప్పుడు నిర్దేశించిన సాధారణ గోల్డ్ లోన్‌లకు కూడా లోన్ టు వాల్యూ రేషియో వర్తిస్తుంది. అయితే, SGBలపై రుణం మంజూరు చేయడం అనేది నిర్ణయానికి లోబడి ఉంటుంది.
SGBలపై పన్ను ప్రభావం
ఆదాయపు పన్ను చట్టం, 1961 (43 ఆఫ్ 1961) ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్‌లపై వడ్డీ పన్ను విధించబడుతుంది. విముక్తిపై, ఒక వ్యక్తికి మూలధన లాభాల పన్ను మినహాయించబడింది. బాండ్ బదిలీపై ఏదైనా వ్యక్తికి వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు అందించబడతాయి.
SGB లను ఎలా పొందవచ్చు?
ఈ బాండ్లను జాతీయ బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైవేట్ బ్యాంకులు, షెడ్యూల్డ్ విదేశీ బ్యాంకులు, నియమించబడిన పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL) మరియు అధీకృత స్టాక్ ఎక్స్ఛేంజీల కార్యాలయాలు లేదా శాఖల ద్వారా నేరుగా లేదా వారి ఏజెంట్ల ద్వారా పొందవచ్చు.