రాష్ట్రంలో కుల, మత, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. జనవరి మరియు ఫిబ్రవరి అమలు కానున్న పథకాలను ముఖ్యమంత్రి ప్రకటించారు.
ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
- జనవరి 1 నుంచి 8 వరకు పెన్షన్ల పెంపు కార్యక్రమం
- జనవరి 5న ద్వైవార్షిక చెల్లింపులు.
- జనవరి 23 నుంచి 31 వరకు వైయస్ఆర్ ఆసరా
- ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైయస్ఆర్ చేయూత
- ఫిబ్రవరి 15 & 16 తేదీల్లో ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సేవ మిత్ర, రత్న, వజ్ర అవార్డులు.
పెన్షన్ల పెంపు కార్యక్రమం
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అదనంగా ఒక రోజు పొడిగించింది. సాధారణంగా ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 8 వరకు పొడిగించింది. ప్రతి నెల ఇస్తున్న రూ. 2,750 పింఛనును జనవరి నుంచి రూ .3,000 కు పెంచింది.
వృద్ధులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, మత్యకారులు, చర్మకారులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు అందిస్తోంది. 2023 జనవరిలో రూ. 2,750 చేసింది. ఇప్పుడు తాజాగా మరోసారి రూ. 250 పెంచి రూ. 3,000 చేసింది. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో పింఛనుదారులందరికీ రూ. 3,000 పింఛను అందుతుంది. రాష్ట్రంలో పింఛను తీసుకునే లబ్ధిదారులు 62 లక్షల మందికిపైగా ఉన్నారు.
ద్వైవార్షిక చెల్లింపులు
అర్హులందరికీ ఆర్థిక తోడ్పాటు అందజేయాలనే లక్ష్యంతో వివిధ సంక్షేమ పథకాలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా సంక్షేమ క్యాలెండర్ ని విడుదల చేసి , అందులో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ప్రతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే నవరత్నాలలో ఆయా పథకాలకు సంబంధించి వివిధ కారణాల వలన షెడ్యూల్ ప్రకారం అమౌంట్ అందని వారికి లేదా నిర్దిష్ట గడువు దాటిన తర్వాత గ్రీవెన్స్ క్లియర్ అయ్యి అర్హత ఉన్న వారికి ప్రభుత్వం ఏటా రెండు సార్లు ద్వైవార్షిక చెల్లింపులు చేసి అమౌంట్ జమ చేస్తుంది.
కింది పథకాల లబ్ధిదారులకు అమౌంట్ విడుదల
➠ EBC Nestham ఈబీసీ నేస్తం
➠ Jagananna chedodu జగనన్న చేదోడు
➠ YSR Matsyakara Bharosa వైఎస్ఆర్ మత్స్యకార భరోసా
➠ Input subsidy to farmers (November-Floods) రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ
➠ Jagananna Vidya Deevena జగనన్న విద్యా దీవెన
➠ Jagananna Vasati Deevena జగనన్న వసతి దీవెన
➠ YSR Zero Vaddi (SHGS) Urban వైఎస్ఆర్ సున్నా వడ్డీ
➠ YSR Cheyutha వైఎస్ఆర్ చేయూత
➠ YSR Kapu Nestham వైఎస్ఆర్ కాపు నేస్తం
➠ YSR Netanna Nestham వైఎస్ఆర్ నేతన్న నేస్తం
➠ YSR Vahana Mitra వైఎస్ఆర్ వాహన మిత్ర
➠ YSR Zero Vaddi Khariff వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఖరీఫ్
➠ YSR Zero Vaddi Rabi వైఎస్ఆర్ సున్నా వడ్డీ రబీ
వైయస్ఆర్ ఆసరా
‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగో విడత సాయాన్ని జనవరి 23 విడుదల చేయనుంది. 10 రోజుల పాటు ఏపీలో ఆసరా పంపిణీ ఉత్సవాలు జరగనున్నాయి.
వైయస్ఆర్ చేయూత
ఈ పథకం ద్వారా ఎస్సీ / ఎస్టీ / ఓబిసి / మైనారిటీ కులాల మహిళలకు ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నాలుగేళ్ల వ్యవధిలో 75000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది..ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైయస్ఆర్ చేయూత కార్యక్రమం జరగనుంది.
వాలంటీర్లకు అవార్డులు
ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు అందించనున్నారు. నియోజకవర్గానికి ఐదుగురికి సేవా వజ్ర కింద రూ.30వేలు.. మండలానికి ఐదుగురు, మున్సిపాలిటీలో 10మంది వాలంటీర్లను ఎంపిక చేసి వారికి సేవా రత్న కింద రూ.20వేలు ఇస్తారు. సేవా మిత్ర కింద రూ.10వేలు ఇస్తారు. వాలంటీర్ల హాజరు, పింఛన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు.