గ్రామ సచివాలయం నిర్వహణ పై సమీక్ష
2024-25 రెండవ త్రైమాసికం జమలు, ఖర్చులు చదివి వినిపించుట .
గత గ్రామసభ తర్వాత పంచాయతీ పరిపాలన యెక్క అన్నీ విషయాలు అజండాలో చేర్చి చదివి వినిపించి గ్రామ సభ ఆమోదం కొరకు
సాధారణ నిధులు, MGNREGS నిధులు, 15 వ ఆర్దికసంఘము నిధుల పనుల ప్రగతిపై సమీక్ష మరియు ఆమోదం
2023-24 పన్నులు, పీజులు , బకాయిదారుల పేర్లు చదివి వినిపించుట, ఆదాయ వనరుల వసూలు ప్రగతిపై సమీక్ష
2023-24 పన్నులు, పీజులు లో ఐదు శాతం పెంపుదల చేసి 2024-25 డిమాండ్ చదివి వినిపించుట మరియు ఆమోదం.
2024-25 సవరణ , 2025-26 సంవత్సరం సాదారణ గ్రామ ప౦చాయితీ అంచనా బడ్జెట్ చదివి వినిపించుట మరియు ఆమోదం.
GPDP ( గ్రామ ప౦చాయితి అభివృధ్ధి ప్రణాళిక) పై చర్చి౦చి , తీసుకున్న నిర్ణయాలను గ్రామసభ లో ఆమోది౦చు.
గ్రామ ప౦చాయితీలో చేపడుచున్న పారిశుధ్య పనులు, మౌలిక వసతుల కల్పన పై చర్చ మరియు వివరించుట.
SWPC / జీరో వేష్టు పై తీసుకోవలసిన చర్యలను ప్రజలకు వివరించుట.
స్వర్ణాంద్ర- 2047 కొరకు తయారు చేసిన ప్రణాళిక ను గ్రామసభ లో చదివి వినిపించి గ్రామసభ ఆమోదము.
గ్రామ ప౦చాయితీలో వివిధరకాల సంక్షేమ పధకములకు అర్హులైన లబ్దిదారులు గుర్తించుట.
కమిషనర్ పంచాయితీరాజ్ వారి సర్క్యులర్ నెంబరు :1242345/CPR&RD /EGS//PM(SP)/2020,DT26-9-24ని అనుసరించి 2025-26 ఆర్ధిక సంవత్సరమునకు MGNREGS నుండి పనులు గుర్తింపు మరియు లేబర్ బడ్జెట్ తయారు చేసి గ్రామసభ ఆమోదము కోరుటకు.
73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలకు అప్పగించిన 29 అంశాలు పై సమీక్షలు మరియు ప్రగతి నివేదికలు చదివి వినిపించట.
1) వ్యవసాయం విస్తరణ
2) భూమి అభివృద్ధి పనులు మరియు భూసార పరిరక్షణ
3) మైనర్ ఇరిగేషన్ మరియు వాటర్ షెడ్
4) పాడిపశువుల అభివృద్ధి
5) మత్స్య పరిశ్రమ అభివృద్ధి
6) సామాజిక అడవుల సంరక్షణ
7) చిన్నతరహా అటవీ ఉత్పత్తులు
8) చిన్నతరహా పరిశ్రమలు
9) ఖాదీ బండార్ పరిశ్రమలు
10) గృహ నిర్మాణం
11) త్రాగునీరు
12) ఇంధనం మరియు పశుగ్రాసం
13) రోడ్లు మరియు రహదారులు
14) గ్రామీణ విధ్యుదీకరణ
15) సంప్రదాయేతర ఇంధన వనరులు
16) పేదరిక నిర్మూలన కార్యక్రమాలు
17) ప్రాధమిక మరియు మాధ్యమిక విద్యా
18) సాంకేతిక శిక్షణ మరియు వృత్తివిద్య
19) వయోజన విద్య
20) గ్రంధాలయాలు
21) సాంస్కృతిక కార్యక్రమాలు
22) మార్కెట్లు మరియు సంతలు
23) ఆరోగ్యం మరియు పారిశుధ్యం
24) కుటుంబ సంక్షేమం
25) స్త్రీ శిశు సంక్షేమం
26) సాంఘిక సంక్షేమం మరియు హస్తకళలు
27) పౌర సరఫరాలు
28) సామాజిక వనరుల పరిస్థితి
29) వెనుకబడిన తరగతుల సంక్షేమం శాఖలకు సంబందించి క్షేత్ర స్తాయిలో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా సదరు శాఖల ప్రగతిపై సమీక్ష.