జాతీయ ఉపాధి హామీ పథకం (Mahatma Gandhi National Rural Employment Act MGNREGA) లేదా నరేగా /కరువు పథకం అని కూడా దీనిని పిలుస్తారు.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 100 దినాలు పని కల్పించడం తప్పనిసరి. అదే విధంగా ఈ పథకం ద్వారా పని చేసే వర్కర్స్ కి కనీస వేతనం కూడా చెల్లించాలి.
ప్రతి ఏటా రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని నిర్ణయిస్తుంది.
ఈ ఏడాది అనగా 2023 కి సంబంధించి రాష్ట్రాల వారీగా ఎంత కనీస వేతనం ఉందొ కింది లిస్ట్ లో చుడండి.
NREGA Minimum Wage 2023
Source: MGNREGA wage rate data is from Ministry of Rural Development notification
State Name | Minimum Wage FY 2022-2023 |
Karnataka | 309 |
Kerala | 311 |
Jammu & Kashmir | 227 |
Bihar | 210 |
Jharkhand | 210 |
Chhattisgarh | 204 |
Madhya Pradesh | 204 |
Haryana | 331 |
Andhra Pradesh ఆంధ్ర ప్రదేశ్ | 257 |
Telangana తెలంగాణ | 257 |
Punjab | 282 |
“Himachal Pradesh: | |
Non-Scheduled Areas” | 266 |
West Bengal | 223 |
Rajasthan | 231 |
“Himachal Pradesh: | |
Scheduled Areas” | 212 |
Uttar Pradesh | 213 |
Uttarakhand | 213 |
Gujarat | 239 |
Odisha | 222 |
ఈ లిస్ట్ ప్రకారం ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణ సంబంధించి 257 రూపాయలను కనీస రోజు వారి వేతనంగా చెల్లించాలి . అయితే ఇప్పటికి పలు ప్రాంతాల్లో రోజు వారి కూలి 240 రూపాయలు మించడం లేదు. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఎవరికీ పిర్యాదు చేయవచ్చు ?
MGNREGA సంబంధించి నేరుగా కాల్ ద్వారా పిర్యాదు చేయడం కష్టం. సంబంధిత వెబ్సైటు లో కూడా కేవలం MIS కాంటాక్ట్ నుంబర్స్ ఇచ్చారు కానీ కంప్లైంట్ నుంబర్లు ఇవ్వలేదు.
అయితే కింది విధంగా నేరుగా వెబ్సైటు లో నే కంప్లైంట్ సమర్పించవచ్చు. అయితే కొన్ని సార్లు మాత్రమే ఈ కింది లింక్ పని చేస్తుంది
ఫిర్యాదు చేసే ప్రాసెస్
MNREGS సంబంధిత ఫిర్యాదును ఆన్‌లైన్‌లో సమర్పించడానికి, దయచేసి ఈ steps ను అనుసరించండి:
Step 1: మీ MNREGS సంబంధిత ఫిర్యాదును సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Step 2: మీ రాష్ట్రం పేరును ఎంచుకోండి
స్టెప్-3: ఒక అప్లికేషన్ ఫారం కనిపిస్తుంది
స్టెప్-4: ముందుగా మీ గుర్తింపును ఎంచుకోండి, మీరు- వర్కర్ లేదా సిటిజన్ లేదా NGOలు లేదా మీడియా లేదా VIP
స్టెప్ -5: MNREGSలో అవకతవకలకు సంబంధించి మీరు సమాచారాన్ని పొందిన మూలాన్ని ఎంచుకోండి
స్టెప్-6: ఇచ్చిన పెట్టెలో అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి, “సబ్మిట్ కంప్లైంట్” బటన్‌పై క్లిక్ చేయండి
నమోదిత ఫిర్యాదు యొక్క స్థితి తనిఖీ
మీ ఫిర్యాదును సమర్పించిన తర్వాత, మీ ఫిర్యాదు పరిష్కరించబడిందా లేదా అనే దాని స్థితిని కూడా మీరు తనిఖీ చేయవచ్చు.
ఒకవేళ పై లింక్ పనిచేయని పక్షంలో, నేరుగా పై అధికారులకు కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు.
సంబంధిత జిల్లా ఆఫీసులో కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ మీరు కంప్లైంట్ చేయవచ్చు.
లేదా మీ ప్రాంతంలో ఆడిట్ కోసం dwma లేదా pd అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు వారికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు
Leave a Reply