New Voter Registration – కొత్తగా ఓటర్ కార్డు కు ఇలా దరఖాస్తు చేసుకొండి

కొత్త ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోటానికి ఇప్పుడు అందరికి అవకాశం ఉంది మరియు దీనికి ఎటువంటి ఛార్జ్ ఉండదు.దరఖాస్తు ను ఆఫ్లైన్ లేదా మొబైల్ లొ ఆన్లైన్ లో సులభంగా చేసుకోవచ్చు.

ఓటర్ నమోదు చేసిన తరువాత సంబందించిన BLO వారు ఆమోదం చేస్తే ఎలక్షన్ కమీషన్ నుంచి ఓటర్ కార్డు ప్రింట్ అయి వస్తుంది. e-ఓటర్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవటాయిని ఎటువంటి అప్లికేషన్ ఫారం అవసరం లేదు. కొత్తగా అప్లికేషన్ చేసుకోటానికి కేవలం ఆధార్ కార్డు, ఫోటో ఉంటే సరిపోతుంది.

ఆఫ్లైన్ పద్దతి లో ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు

ఆఫ్లైన్ లో అప్లై చేసుకోడానికి కింద ఇవ్వబడిన ఏదో ఒక పద్ధతిని పాటించండి.

1. బూత్ స్థాయి అధికారి (బీఎల్వో)కి నేరుగా ఫారం-6 దరఖాస్తు సమర్పించవచ్చు.

2. ప్రతి నియోజకవర్గానికీ డివిజన్ స్థాయి అధికారిని ఎలక్టోరల్
రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో)గా, ప్రతి మండలంలోనూ తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ను అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్వో)గా ఎన్నికల సంఘం నియమించింది. వారి కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించొచ్చు. వాటిపై విచారణ జరిపి, ఓటు హక్కు కల్పిస్తారు.

ఆన్లైన్ పద్దతిలో ఇలా దరఖాస్తు చేసుకోండి

  • కొత్తగా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే ముందుగా NVSP అనే వెబ్ సైట్ లొ అకౌంట్ ఉండాలి. ఈ అకౌంట్ కు ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఈ అకౌంట్ ను 2 నిముషాల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క సారి అకౌంట్ క్రియేట్ చేస్తే ఆ అకౌంట్ లాగిన్ అయ్యి ఎంత మందివి అయిన ఓటర్ కార్డుల కోసం దరఖాస్తు చెయ్యవచ్చు, మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. 

NVSP లొ అకౌంట్ చేసుకునే విధానం :

  • ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చెయ్యాలి.
  • లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Don’t Have Account, Register as a New User పై క్లిక్ చేయాలి.
  • ముందు ఓటర్ గా నమోదు అయిన వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. 6 అంకెల OTP ఎంటర్ చేసి Verify OTP పై క్లిక్ చేయాలి.
  • ఓటర్ కార్డు నెంబర్ ఉంటే I Have EPIC Number, లేకపోతే I Don’t Have EPIC Number పై క్లిక్ చేయాలి. I Don’t Have EPIC Number పై క్లిక్ చేస్తే First Name, Last Name, Email, Password, Confirm Password డేటా ఇవ్వాలి. I Have EPIC Number పై క్లిక్ చేస్తే EPIC Number, Email, Password, Confirm Password వివరాలు ఇవ్వాలి. Registration Done Successfully అని వస్తే అయినట్టు.

కొత్తగా ఓటర్ రిజిస్ట్రేషన్ చేయు విధానము :

  • లాగిన్ పేజీ లొ Username వద్ద Email ID మరియు Password వద్ద ముందుగా ఇచ్చిన Password ఎంటర్ చేసి Captcha Code ఎంటర్ చేసి Login అవ్వాలి.
  • Home Page లొ ఎడమ వైపు ఉన్న Register as a Elector / Voter పై క్లిక్ చేయాలి.
  • Form 6 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.తరువాత అప్లికేషన్ లొ డేటా ఓపెన్ అవుతుంది. అందులో
  1. State (రాష్ట్రము)
  2. District (జిల్లా)
  3. Assembly (నియోజకవర్గం)
  4. First Name (మొదటి పేరు )
  5. Surname (పుట్టినపేరు)
  6. Relative Name ( తాలూకా పేరు ) [ తండ్రి / భర్త / తల్లి..]
  7. Relative Surname Name ( తాలూకా ఇంటి పేరు )
  8. Type Of Relation ( బంధుత్వం )
  9. Mobile No ( మొబైల్ నెంబర్ ) [ లేదా బంధువులది ] [ ఉంటే ఇవ్వాలి లేకపోతే లేదు ]
  10. Email ID (ఇమెయిల్ ఐడి) [ లేదా బంధువులది ] [ ఉంటే ఇవ్వాలి లేకపోతే లేదు ]
  11. Aadhaar Number (ఆధార్ నెంబర్)
  12. Gender Of Applicant (లింగము)
  13. Date of Birth (పుట్టిన రోజు)
  14. Age Proof (వయసు ధ్రువీకరణ) [ ఆధార్ xerox లొ సెల్ఫ్ సంతకం చేసి ]
  15. House / Building / Apartment No (ఇంటి నెంబర్ )
  16. Street / Area / Locality / Mohalla / Road (వీధి)
  17. Town / Village (గ్రామం)
  18. Post Office (పోస్ట్ ఆఫీస్)
  19. Tehsil / Taluqa / Mandal (మండలం)
  20. PIN Code (పిన్ కోడ్)
  21. District (జిల్లా)
  22. State (రాష్ట్రము)
  23. Address Proof [ Self Attested Aadar Card Xerox ]
  24. Passport Size Photo [ JPG / JPEG Format, 4.5×3.5 CM ] (చిరునామా ప్రూఫ్ గా ఆధార్ కాపీ పై సంతకం చేసి అప్లోడ్ చేయాలి)
  25. Category Of Disability if Any (దివ్యంగులు ఉంటే వివరాలు )
  26. Already Enrolled Family Member Details If Available(ఇంట్లో ముందుగా ఓటర్ కార్డు కలిగిన వారు ఉంటే )
  27. Name (పేరు)
  28. Relationship (సంబంధం)
  29. EPIC Number (ఓటర్ కార్డు నెంబర్)
  30. Declaration 

చివరగా Preview & Submit పై క్లిక్ చేసి Submit చేయాలి. Reference Number వస్తుంది Note చేసుకోవాలి. తరువాత  BLO వారికీ అప్లికేషన్ ఫార్వర్డ్  అవుతుంది. APPROVAL  అయ్యిన తరువాత e-VOTER డౌన్లోడ్  చేసుకోవచ్చు . తరువాత వారి BLO ద్వారా ఇవ్వటం జరుగుతుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page