► ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేసే ప్రక్రియ ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభం.
Step 1. NVSP ఓటర్ పోర్టల్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
Step 2. పైన లింక్ క్లిక్ చేసిన తరువాత ఈ క్రింది విదంగా లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది
Step 3: తరువాత మొబైల్ నెంబర్ / ఇమెయిల్ ఐడి / ఓటర్ ఐడి , పాస్వర్డ్ మరియు captcha ఎంటర్ చేసి లాగిన్ బటన్ పైన క్లిక్ చెయ్యండి. ఒక వేల పాస్వర్డ్ మర్చిపోతే స్టెప్ 4 చుడండి. అకౌంట్ లేక పోతే create అకౌంట్ బటన్ పైన క్లిక్ చెయ్యండి
Step 4: forgot password క్లిక్ చేసిన తరువాత రిజిస్టర్ అయిన ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోండి.
Step 5: create account క్లిక్ బటన్ క్లిక్ చేసిన తరువాత ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి send otp క్లిక్ చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తరువాత అకౌంట్ create అవుతుంది. పేరు, స్టేట్, జెండర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి
Step 6: లాగిన్ అయ్యాక కింది విదంగా హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ లింకేజీ బటన్ పైన క్లిక్ చెయ్యండి
Step 7: తరువాత let's start button పైన క్లిక్ చెయ్యండి
Step 8: తరువాత కింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. బేసిక్ డీటెయిల్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చెయ్యాలి. మీ వద్ద ఓటర్ కార్డు నెంబర్ ఉంటె Search by Voter ఇది పైన క్లిక్ చేసి ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చెయ్యండి
Step 9: క్లిక్ చేసిన కింది విధంగా రెండు ఆప్షన్లు చూపిస్తాయి. ఓటర్ కార్డు నెంబర్ ఉంటె "Yes I have Voter ID" నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
Step 10: తరువాత ఓటర్ ID ఎంటర్ చేసి ఫిచ్ డీటెయిల్స్ పైన క్లిక్ చెయ్యండి
Step 11: డీటెయిల్స్ ఫెట్చ్ అయిన తరువాత proceed బటన్ పైన క్లిక్ చెయ్యాలి.
Step 12: మీ ఓటర్ కార్డు డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సరి చూసుకొని Save and Continue పైన క్లిక్ చెయ్యాలి
Step 13: Save and Continue పైన క్లిక్ చేసిన తరువాత రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి
Step 14: మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చెయ్యండి
Step 15: మీ డీటెయిల్స్ తో ఫారం 6b పేజీ ఓపెన్ అవుతుంది. తరువాత Yes I have Aadhar Number ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి
Step 16: ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చెయ్యడానికి ఆప్షన్ వస్తుంది
Step 17: ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి Save and Continue మీద క్లిక్ చెయ్యండి
Step 17: క్లిక్ చేసిన తరువాత జనరల్ డిక్లరేషన్ పేజీ ఓపెన్ అవుతుంది
Step 18: మీ ప్లేస్ ఎంటర్ చేసి Save and Continue మీద క్లిక్ చెయ్యండి
Step 19: మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి, సరి చూసుకొని సబ్మిట్ బటన్ పైన క్లిక్ చెయ్యండి
Step 20: సబ్మిట్ చేసిన తరువాత అప్లికేషన్ రిఫరెన్స్ ID చూపిస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ కూడా వస్తుంది.
బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కి ఆధార్ కార్డ్ మరియు ఓటర్ ID కార్డ్‌ని ఆఫ్‌లైన్ మోడ్‌లో లింక్ చేసే అధికారం ఉంది. అభ్యర్థులు బూత్ లెవల్ అధికారికి ఓటర్ ఐడీకి లింక్ ఆధార్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. BLO వివరాలను ధృవీకరించి, ఓటర్ ID కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేస్తారు.
అభ్యర్థులు
అభ్యర్థులు కస్టమర్ కేర్ నంబర్ (1950)కి కాల్ చేయడం ద్వారా ఓటర్ ఐడితో ఆధార్‌ను లింక్ చేయవచ్చు. అభ్యర్థులు 1950కి డయల్ చేసి, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ సూచనలను అనుసరించాలి, లింక్ ప్రాసెస్ కోసం మీ ఓటర్ ఐడి కార్డ్ నంబర్ మరియు ఆధార్ నంబర్‌ను టైప్ చేయాలి.