చేదోడు లేబర్ సర్టిఫికేట్ లేదా shop establishment సర్టిఫికేట్ ఇలా పొందండి

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న చేదోడు పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని వెల్లడించింది.

జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఇప్పటికే షాప్ ఉండి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయినటువంటి వారు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నటువంటి వారు లేబర్ సర్టిఫికెట్ లేదా షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు నాయి బ్రాహ్మణులు మరియు ట్రైలర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.

Shop establishment certificate పొందేటటువంటి ప్రాసెస్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల ద్వారా షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ లేదా లేబర్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు.

మీ షాప్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సంబంధిత చార్జీలు చెల్లించినట్లయితే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ అనేది ఇస్తారు.

ఇందుకోసం సదరు లబ్ధిదారుడు అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీ సమీప సచివాలయంలో సంప్రదించి సేవా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.

షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ కి కావలసిన వివరాలు

For fresh certificate:
1. Employer photo with signature
2. Aadhar card
3. Proof of address of the establishment (Electricity bill/rental agreement)
4. Authorization certificate given by employer/self-authorization


For renewal of certificate:
1. Old certificate

షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ ఎన్ని సంవత్సరాల గడువు ఉంటుంది?

కొత్త మరియు రెన్యువల్ చేసినటువంటి సర్టిఫికెట్లను మూడు సంవత్సరాల వాలిడిటీతో జారీ చేస్తున్నారు.

అంటే ప్రస్తుతం 2023లో ఎవరైతే కొత్త సర్టిఫికెట్ కానీ లేదా పాత సర్టిఫికేట్ renewal చేయించుకున్నట్లయితే వారికి 2026 వరకు ఇవ్వడం జరుగుతుంది.

Shop establishment సర్టిఫికేట్ చార్జీల వివరాలు

రిజిస్ట్రేషన్ చార్జీలు ఎస్టాబ్లిష్మెంట్ లో ఉండేటటువంటి ఎంప్లాయిస్ సంఖ్యని బట్టి పెరుగుతుంది.

ఇక సర్వీస్ చార్జీలు అయితే కనీసం 40 రూపాయలు గా వసూలు చేస్తున్నారు. ఎంప్లాయిస్ సంఖ్యని బట్టి రిజిస్ట్రేషన్ చార్జి ఇందులో కలపడం జరుగుతుంది.

చేదోడు Shop Establishment Certificate సర్వీస్ ఛార్జ్ (Minimal Charge) :

న్యూ అప్లికేషన్ – ₹ 140/-
రెన్యువల్ – ₹ 340/-

Shop Establishment Certificate  రెన్యూయల్ మొత్తం 3 సంవత్సరాలకు ఇస్తున్నందున ఛార్జ్ మొత్తానికి కలిపి ₹ 340/- గా నిర్ణయించారు.

జగనన్న చేదోడు పథకానికి సంబంధించినటువంటి లేబర్ సర్టిఫికెట్ మరియు యూజర్ మాన్యువల్ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page