పెన్షన్ పంపిణికి సంబంధించి వాలంటీర్లకు సూచనలు

, ,

YSR Pension Kanuka వైస్సార్ పెన్షన్ కానుక లో భాగంగా ప్రతీ నెల గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గా పెన్షన్ పంపిణి జరుగుతున్నది. పెన్షన్ పంపిణి కు సంబందించిన ముఖ్యమయిన సమాచారం ఈ పేజీ లో ఎప్పటికి అప్పుడు పోస్ట్ చేస్తూ అప్డేట్ చెయ్యటం జరుగుతుంది.

  • పెన్షన్ ను పెన్షన్ దారులు ప్రతీ నెల 5 వ తారీకు లోపు తీసుకోవాలి. లేకపోతే ఆ నెలకు సంబందించి పెన్షన్ తీసుకునే సదుపాయం ఎవరి స్థాయిలో ఉండదు.ప్రభుత్వ సెలవులు కానీ, ఇతర సెలవులతో సంబంధం ఉండదు. 
  • ఏ నెలకు సంబందించిన పెన్షన్ ను ఆ నెల మాత్రమే తీసుకోవాలి. ఒకప్పటిలా 3 నెలల వరకు పెన్షన్ ను ఒకే సారి తీసుకునే అవకాశం లేదు.
  • 3 నెలలకు మించి పెన్షన్ తీసుకోక పోతే పెన్షన్ తాత్కాలిక నిలుపుదల అవుతుంది. అప్పుడు సంబందించిన MC / MPDO వారికి లబ్ధిదారుడు అర్జీ పెటరుకొని పెన్షన్ పునః ప్రారంభించుకోవాలి.
  • పెన్షన్ పంపిణి అయిన వెంటనే రెండు రోజుల లోపు పంచగా మిగిలిన నగదును వాలంటీర్ వారు సచివాలయం కు అందించవలెను. రెండు రోజులు దాటినచో రోజుకు 100/- చొప్పున జరిమాన పడుతుంది.
  • పెన్షన్ పంపిణి చేయు సమయం లో లబ్ధిదారుని బయోమెట్రిక్ వేసిన తరువాత కొన్ని సార్లు Successful అవ్వక పోయిన ఆ పేరు లిస్ట్ లో కనిపించదు అలాంటప్పుడు ముందుగా మీ WEA  వారిని కాంటాక్ట్ అయ్యి, Payment విజయవంతం అయితేనే నగదు ఇవ్వండి. లేకపోతే చివరలో ఆ పేరు Un Paid కిందనే ఉండి వారికి నగదు ఇచ్చే సందర్భం రావొచ్చు.
  • పెన్షన్ కు సంబందించి దరఖాస్తు దారులు అప్లికేషన్ చేసుకున్న తరువాత ఇప్పడు సంవత్సరం లో రెండు సార్లు Sanction అవుతున్న విషయం గుర్తించాలి. అంటే డిసెంబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం మే 31 లోపు దరఖాస్తు చేసుకునే వారికి జూన్ నెలలో పెన్షన్ అందుతుంది. అదే జూన్ 1 నుంచి నవంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకునే వారికి డిసెంబర్ నెల లో ఫైనల్ అయ్యింది Next Year జనవరి నుంచి పెన్షన్ అందుతుంది.
  • పెన్షన్ పంపిణి రిపోర్ట్ తెలుసుకోటానికి అందరికి అందుబాటులో కేవలం జిల్లాల వారీగా మాత్రమే ఉంటుంది. అదే సచివాలయ పరిధిలో లబ్ధిదారుల వారీగా తెలుసుకోవాలి అంటే SS Pension WEA  వారి లాగిన్ లో Others >>Reports >>Disbursement Report For Secretariat.
  • పెన్షన్ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోటానికి కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి Service Request Status Check వద్ద PNS తో మొదలు అయ్యే పెన్షన్ దరఖాస్తు నెంబర్ ఎంటర్ చేస్తే దరఖాస్తు స్టేటస్ తెలుస్తుంది.

  • ముందునుంచి రన్నింగ్ లో ఉన్న పెన్షన్ దారుని ప్రస్తుత స్టేటస్ తెలుసుకోటానికి కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి Pension ID ను ఎంచుకొని Pension ID / Ration Card No / Sadarem Number ఎంటర్ చేసి జిల్లా,మండలం, పంచాయతీ, హాబిటేషన్ ను ఎంచికొని Submit చేస్తే స్టేటస్ ఓపెన్ అవుతుంది.
  • పెన్షన్ పంపిణి సమయం లో ఐరిష్ ద్వారా పెన్షన్ పంపిణి చేయుటకు Integral RD Service మాత్రమే వాడాలి. Irish RD Service ను Uninstall చేయాలి. 
  • YSR Pension kanuka లో భాగం గా పెన్షన్ పంపిణి చేయిటకు అవసరం అయ్యే అప్లికేషన్ లు   
  1. YSRPK Payment Online
  2. RBIS
  3. APCL FM220 RD
  4. Mantra RD Service
  5. Integra Irish RD

అన్ని అప్లికేషన్లు కొత్తగా వెర్షన్ లు కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page