అక్టోబర్ నుంచి 100 కే సచివాలయాలలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్

అక్టోబర్ నుంచి 100 కే సచివాలయాలలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్

వారసత్వంగా సంక్రమించే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ వెలువరించింది. రెవెన్యూ శాఖకు అందే అర్జీల్లో 70% భూహక్కు సంబంధితమైనవే ఉంటున్నాయని ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. ఇకపై వారసత్వ ఆస్తులను గ్రామ వార్డు సచివాలయాలలో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అక్టోబరు నుంచి అవకాశం కల్పించనుంది.  రూ.10 లక్షల విలువ కలిగిన భూములైతే రూ.100 చొప్పున, అంతకు మించితే రూ.1000 చొప్పున రుసుము తీసుకుని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖలో చేపట్టిన సంస్కరణలు, ఫిర్యాదుల పరిష్కారంపై ఆమె ప్రజంటేషన్ ఇచ్చారు.

అయితే వీరికి మాత్రమే సచివాలయంలో చేస్తారు

ఆస్తి యజమాని మరణించిన విషయంలో వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది.

మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యధావిధిగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలలోనే కొనసాగుతాయి.

ఏకాభిప్రాయం తప్పనిసరి

తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసులు ఏకాభిప్రాయంతో ఆస్తి భాగాలు చేసుకుని వచ్చి గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ సంప్రదిస్తే వీరికి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఇందుకు అందరి ఏకాభిప్రాయం తప్పనిసరి.

రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత?

వారసత్వ ఆస్తులను గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్టర్ చేయాలంటే ఆస్తి విలువ ఒకవేళ 10 లక్షలు మరియు ఆలోపు ఉంటే వంద రూపాయలు స్టాంప్ డ్యూటీ కింద చెల్లించాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ₹1000 చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

Land registration

మ్యుటేషన్ కూడా ఆటోమేటిక్ గా అవుతుందా?

సచివాలయంలో నామమాత్రపు ఫీజు తోటి వారసత్వ భూములు రిజిస్టర్ చేసుకున్న వారికి ల్యాండ్ రికార్డ్స్ అంటే మ్యుటేషన్ లో అన్ని వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. అదేవిధంగా అర్హులైన భూములకు ఈ పాస్ బుక్ కూడా జారి అవుతుంది. లబ్ధిదారుల నుంచి ఈ కేవైసీ కూడా తీసుకోవటం జరుగుతుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఈమెరకు కార్యచరణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ శాఖకు మార్గదర్శకాలతో జీవో జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖ్యమైన ప్రభుత్వ జీవోలను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

5 responses to “అక్టోబర్ నుంచి 100 కే సచివాలయాలలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్”

  1. Murugan Avatar
    Murugan

    సార్ నా పేరు మురుగన్ మా ఊరు అంకిరెడ్డిపల్లి వీళ్లజ్ కుప్పం తాలూకా మా తాత ఆస్థి నా కు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు దానిప్రకారం నేను ల్యాండ్ ని నాపేరుపైన చేసుకున్నాను నాకు మా నాన్న లేడు ఇప్పుడు ఒకడు తమిళనాడు నుంచి వచ్చి కోర్ట్ లో కేసు పెట్టాడు ఎవడోవాడు నాకు తెలియదు నువ్వు ఎవరు అని అడిగేతే విజలాపురం జి శ్రీనివాసులురెడ్డి ని అడగండి అంటున్నారు

  2.  Avatar
    Anonymous

    వారసత్వం రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పినప్పుడు అందరికీ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం కొందరికి చేస్తాం చెపుతున్నారు అలా కాకుండా అందరినీ ఒకేలా చూసి వారసత్వం రిజిస్ట్రేషన్ అందరికీ అందుబాటులోకి చేస్తే బాగుంటుంది అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ను కోరుకుంటున్నాను

    1. SRIKANTAM VENKATA SESHA MURALIDHARA RAO Avatar
      SRIKANTAM VENKATA SESHA MURALIDHARA RAO

      వారసత్వం అంటే చనిపోతేనే అనేది 💯 కరెక్ట్ కాదు, విల్ ను యాక్సెప్ట్ చేస్తేనే లేకపోతే దీనివల్ల ఉపయోగం లేదు.

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page