Citizen Outreach Program – January 2023

,

జనవరి నెల 2023 సంవత్సరానికి సంబంధించి సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం (COP) జనవరి 30 & 31న నిర్వహించబడును.

ఈ నెలకు సంబంధించి సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం లో ముఖ్యంగా కింద తెలుపబడిన విషయాలను పరిగణించవలెను

  •  కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు పొందుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి సంవత్సరాల వారీగా వివరములు చూపించడం జరుగుతున్నది వాటిని లబ్ధిదారులకు తెలియజేస్తూ లబ్ధిదారుని ఫోటో తీయవలసి ఉంటుంది . ఫోటో తీయు సమయంలో లొకేషన్ ఆన్ చేసుకొని ఫోటో తీయవలెను.

సంక్షేమ పథకాలు :

a. YSR Aasara

b. YSR Cheyutha

c. YSR EBC Nestham

d. YSR Kapu Nestham.

e. Jagananna Ammavodi

f. YSR Sunna Vaddi SHIG

పై పథకముల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కొరకు, జీవన ప్రమాణాలను పెంపొందించుట కొరకు, ఆదాయ పెంపుదల, ఆదాయం సంబంధించి మార్గముల విషయాలు మరియు జీవన ప్రమాణాల పెంపుదల గురించి వివరించవలెను.

ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి వాలంటీర్లతో ఒక టీం గా ఏర్పడి ఈ ప్రోగ్రాంను పూర్తి చేయవలసి ఉంటుంది.

సర్వే చేయు విధానం :

  • సిటిజన్ ఔట్రీస్ ప్రోగ్రాం ను COP అనగా Citizen Outreach అనే మొబైల్ అప్లికేషన్ లొ చేయవలెను. ప్రతీ ఉద్యిగి పాత GSWS యూసర్ నేమ్ తో లాగిన్ అవ్వాలి.User ID వద్ద సచివాలయం కోడ్ – హోదా ను ఎంటర్ చేయాలి   ఉదా. సచివాలయం కోడ్ 10180302, ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి అయితే వారు 10180302-PS ఎంటర్ చేయాలి.

Download Latest COP APP 

  • లాగిన్ లొ Biometric / Irish / Face అనే మూడు ఆప్షన్ లొ ఎదో ఒక ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. Face ద్వారా లాగిన్ అవ్వాలి అంటే Aadar Face RD అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలెను.
  • Home Page లొ Survey By Cluster మరియు Survey By Aadhar అనే రెండు ఆప్షన్ లు ఉంటాయి. క్లస్టర్ వారీగా చేయాలి అనుకుంటే Survey By Cluster అని సిటిజెన్ ఆధార్ ద్వారా చేయాలి Survey By Aadhar అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. 
  • Survey By Cluster ఎంచుకుంటే క్లస్టర్ ఏనుకొని అందులో లబ్ధిదారునిని Search ఆప్షన్ ద్వారా ఎన్నికోవాలి. పేరు పై క్లిక్ చేసాక ఆ కుటుంబం లొ House Hold మాపింగ్ ప్రకారం అందరి పేర్లు సంవత్సరాల వారీగా వారికి వివిధ పథకాల ద్వారా అందిన లబ్ధి వివరాలు చూపించును. అవి లబ్దిదారులకు వివరించాలి.
  • గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు జీవనోపాధి అవకాశాలు,ఆదాయం పెంపొందించడం,సంపద సృష్టించడం మరియు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుటకు ప్రభుత్వం ఏటా ఈ పై పథకాలను అమలు చేయచున్నది.
  • SC,ST,BC మహిళల కొరకు వైఎస్సార్ చేయూత,కాపు మహిళల కొరుకు వైఎస్సార్ కాపు నేస్తం,ఈబీసి మహిళల కొరకు వైఎస్సార్ ఈబీసి నేస్తం.
  • అన్నీ వర్గాల మహిళల కొరకు వైఎస్సార్ ఆసరా,వైఎస్సార్ సున్నా వడ్డీ(SHGs),మరియు జగనన్న అమ్మఒడి.   మీ కుటుంబానికి పై పథకాల ద్వారా అందిన లబ్ధి వివరాలు సంవత్సరాల వారీగా పైన ఇవ్వబడినవి.
  • Capture వద్ద లబ్ధిదారుని ఫోటో తీసి , Location ON చేసి Lat, Long వివరాలు కాప్చర్ చేసి Submit చేస్తే Data Saved Successfully అని వస్తే ఆ కుటుంబానికి సర్వే పూర్తి చేసినట్టు.
Click here to Share

One response to “Citizen Outreach Program – January 2023”

  1. S.Nagaraju Avatar
    S.Nagaraju

    Good programme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page