Citizen Outreach Survey Dashboard, App, SOP and User Manuals

#

Citizen Outreach Survey Dashboard,Latest App, SOP and User Manuals








ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల ఆఖరి శుక్ర, శనివారం నాడు సర్వే ఉంటుంది. సచివాలయ సిబ్బంది తమ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలతో సంభాషించి ఈ కార్యక్రమం పూర్తి చేయాలి. 10-12 హౌస్ హోల్డ్ లను సర్వే చేసిన తరువాత సిబ్బంది బయోమెట్రిక్ తప్పనిసరి.వెల్ఫేర్ సంక్షేమ క్యాలండర్, కాంటాక్ట్ నెంబర్ లను సంబంధిత మండల / మునిసిపల్ ఆఫీస్ కు పంపడం జరుగుతుంది.

ఈ నెల సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం ముఖ్యమైన పాయింట్లు :

పౌరులతో మాట్లాడవలసిన అంశములు (Talking Points)

1. VSWS బృందం కేటాయించిన ప్రజలందరికీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ & వాలంటీర్ల వ్యవస్థల స్థాపన యొక్క ప్రాముఖ్యతను వివరించాలి. ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసిన ఉద్దేశాలను అందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలి. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ & వాలంటీర్ల వ్యవస్థలు ప్రవేశపెట్టక ముందు ఉన్న పాలనా పరమైన స్థితిగతులను వివరిస్తూ నేటి వ్యవస్థల పనితీరును వివరించాలి.
2. ప్రజలందరూ తప్పనిసరిగా వారి ప్రాంతంలోని సచివాలయం గురించి తెలుసుకోగలగాలి. VSWS బృందం వారి పరిధిలోని ప్రతి ఒక్కరినీ సచివాలయ వ్యవస్థ గురించి తెలుసా? లేదా? అని అడగాలి
3. VSWS బృందం ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన 4 పథకాల (పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం)గురించి ప్రజలకు వివరించాలి. ప్రజలందరూ సంతృప్తి చెందేలా సచివాలయం అందించే అన్ని సంక్షేమ పథకాలు/సేవల యొక్క అమలు విధానం మరియు SLA వ్యవధిని గురించి తెలియజేయాలి.
4. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతున్నదా? ఉదా: కుటుంబంలోని సభ్యులలో పిల్లలకు అయితే జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి... వృద్ధులు ఉన్నట్లైతే పింఛను, వ్యవసాయదారులైతే రైతుభరోసా తదితర పథకాలు అందుతున్నాయో, లేదో అడిగి రాసుకోవాలి.
5. కుటుంబంలోని సభ్యులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ఎంత మేరకు అవగాహన ఉన్నదో అడిగి తెలుసుకోవాలి. అర్హతలున్నప్పటికీ ఏదైనా పథకం యొక్క ప్రయోజనాలను పొందలేకపోతున్నారా? లాంటి వివరాలను పరస్పరం తనిఖీ చేయాలి.
6. అర్హతలున్నప్పటికీ ఏదైనా పథకం యొక్క ప్రయోజనాలను పొందని లబ్ధిదారులను గుర్తించి, వారితో సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా మాట్లాడవలెను.
7. ఫిర్యాదుల పరిష్కారానికై ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 1902 మరియు స్పందన వ్యవస్థల గురించి ప్రజలందరికీ VsWS బృందం అవగాహన కల్పించాలి. ప్రభుత్వ పథకాలు, పౌర సౌకర్యాలకు సంబంధించిన గ్రీవెన్స్ గురించి ఫిర్యాదులను ఎలా నమోదు చేయాలి, VSWSతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎప్పుడు సంప్రదించాలి అనే విషయాల పట్ల అవగాహన కల్పించాలి.
8. ప్రజలకు తమ సచివాలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియాలి.
9. CSC ద్వారా సచివాలయం అందించే అన్ని సేవల గురించి ప్రజలందరికీ వివరించాలి. ఉదాహరణకు విద్యుత్ బిల్లులు, ఆధార్ సేవలు (భవిష్యత్తులో) మొదలైనవి.
10. 1902, 100, 104, 108 వంటి ముఖ్యమైన సంప్రదించవలసిన నంబర్ గురించి మరియు అవి దేనికి ఉపయోగించబడుతున్నాయనే దాని గురించి తప్పనిసరిగా వివరించాలి.
11. దిశా యాప్ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలి. మరియు యాప్ లోని ప్రతి ఫీచర్, దానిని ఎలా ఉపయోగించాలి మరియు అత్యవసర పరిస్థితుల్లో ఇది ఎలా ఉపయోగపడుతుందో అర్థమయ్యేలా వివరించాలి.
12. హౌస్ హో కేటాయించిన వాలంటీర్ మరియు వారి సెక్రటేరియట్ సిబ్బంది పనితీరు గురించి ప్రజల నుండి తప్పనిసరిగా అభిప్రాయాలను సేకరించాలి.

గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించవలసిన బాధ్యతలు

1. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ లో భాగంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారి పరిధి లోని కుటుంబాలను సంబంధిత గ్రామ! వార్డు వాలంటీర్ తో పాటుగా సందర్శించవలెను. క్యాంపెయిన్ నిర్వాహకుని గా ప్రజలకు పరిచయం చేసుకోవలెను.
2. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహణలో పాల్గొనే సిబ్బంది వారి మరియు సంబంధిత ఇతర కార్యదర్శులు నిర్వర్తించవలసిన విధులు మరియు బాధ్యతలను వివరించవలెను.
3. ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ గురించి ప్రజలకు వివరించవలెను.
4. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి, గ్రామ వార్డు సచివాలయం లో లభించే విభిన్న ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవలసినదిగా ప్రజలకు మార్గనిర్దేశకత్వం చేయవలెను.
5. ప్రభుత్వ సంక్షేమ పధకాల క్యాలెండర్ మరియు సచివాలయ సిబ్బంది యొక్క వివరాలతో కూడిన కరపత్రాన్ని ప్రజలందరికీ అందజేయవలెను.
6. గ్రామ/వార్డు వాలంటీర్ల పనితీరు పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవలెను.
7. యాప్ లోని ప్రశ్నావళిని గ్రామ! వార్డు సచివాలయ సిబ్బంది పూర్తి చేయవలెను.
8. ప్రభుత్వ పథకాలు మరియు సేవల దరఖాస్తు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలను వివరంగా సేకరించవలెను.
9. ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిరభ్యంతరంగా సచివాలయాన్ని సందర్శించమని కోరాలి. వారి సమస్యల పరిస్కారం కోసం తాము ఉన్నాము అనే భరోసా కల్పించాలి .
10. పౌరుల ఫోటోని క్యాప్చర్ చేసి, తమ విలువైన సమయాన్ని కేటాయించి 'ఔట్ రీచ్ కాంపెయిన్' లో పాల్గొని సహకరించినందుకు అభినందిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపవలెను.

#

JOIN Our Govt Schemes Telegram Group

#

JOIN Our STUDYBIZZ Telegram Group

  • #
  • #
  • #
  • #