తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో 2023 ను భారత రాష్ట్ర సమితి BRS ప్రకటించింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల ప్రచారంతో దూసుకుపోతున్నటువంటి కాంగ్రెస్ కు దీటుగా బిఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రకటించింది.
BRS MANIFESTO 2023 పూర్తి వివరాలు
- ఆసరా పెన్షన్లు దశల వారీగా ₹5016 కి పెంపు – అయితే తొలి సంవత్సరంలో ₹3016, ప్రతి ఏటా 500 చొప్పున పెంచుకుంటూ ఐదేళ్లలో ₹5016 రూపాయలు ఇవ్వనున్నారు. ఇక కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని సామాజిక వర్గాల వారికి ఒకేసారి 4 వేల రూపాయలకి పెన్షన్ పెంచనున్న విషయం తెలిసిందే.
- దివ్యాంగులకు మాత్రం 6000 వరకు దశలవారీగా పెంచుతూ, తొలి ఏడాది 5వేల రూపాయలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
- సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల 3000 చొప్పున భృతి.
- అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు ₹400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు BRS తెలిపింది.
- ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కేసిఆర్ ఆరోగ్య రక్ష పేరుతో 15 లక్షల వరకు ఆరోగ్య బీమా.
- తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల అందరికీ సన్న బియ్యం.
- రైతుబంధు సహాయాన్ని 16 వేలకు దశల వారీగా పెంచనున్నట్లు, తొలి ఏడాది సహాయాన్ని 12 వేల వరకు పెంచనున్నట్లు బిఆర్ఎస్ ప్రకటించింది.
- కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బీమా తరహాలో ఎల్ఐసి ద్వారా 5 లక్షల జీవిత బీమా వర్తింప చేయనున్నట్లు బిఆర్ఎస్ ప్రకటించింది. దాదాపు 93 లక్షల కుటుంబాలకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది.
- ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంచుతూ నిర్ణయం.
- దళిత బంధు రైతు బీమా కొనసాగింపు ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు.
- లంబాడి తండాలు, గోండుగూడెంలను పంచాయతీలుగా మార్చనున్నట్లు BRS తెలిపింది.
- మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు, అగ్రవర్ణాల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల
- రాష్ట్రంలోని అనాధల కోసం ప్రత్యేక పాలసీ
- ప్రభుత్వ ఉద్యోగుల ఓపిఎస్ కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు BRS తెలిపింది.
BRS MANIFESTO Vs CONGRESS MANIFESTO
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని BRS మేనిఫెస్టో తో పోలిస్తే, కాంగ్రెస్ పార్టీ సామాజిక పెన్షన్లు ఒకేసారి 4000 కు పెంచనుంది. ఇక రైతులకు కూడా ప్రతి ఏడాది ప్రతి ఏకరాకు 15000 ఒకే సారి ఇవ్వనున్నట్లు తెలిపింది. గ్యాస్ సిలిండర్ మాత్రం కాంగ్రెస్ ₹500 అని ప్రకటిస్తే BRS 400 కే ఇస్తామని తెలిపింది. ఇక మహిళలకు కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా విద్యార్థులకు భరోసా కార్డ్ మరియు ఉద్యోగాల భర్తీ సంబంధించి కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బిఆర్ఎస్ నుంచి మాత్రం ఇంకా వీటిపై స్పష్టత లేదు.
Leave a Reply to Sathi Reddy Chilumula Cancel reply