Bima Sakhi Yojana Scheme Full Details – Andhra Pradesh Women Bima Sakhi Rs 7k Monthly బీమా సఖి యోజన 2025 – ఏపీలో మహిళలకు నెలకు ₹7,000 వేతనం

Bima Sakhi Yojana Scheme Full Details – Andhra Pradesh Women Bima Sakhi Rs 7k Monthly బీమా సఖి యోజన 2025 – ఏపీలో మహిళలకు నెలకు ₹7,000 వేతనం

Bima Sakhi Yojana : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన బీమా సఖి యోజన(Bima Sakhi Yojana) 2025 ద్వారా గ్రామీణ ప్రాంతాల డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఎంపికైన మహిళలకు శిక్షణ ఇచ్చి ధృవపత్రాలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన Bima Sakhi Yojana పథకాన్ని డ్వాక్రాకు అనుసంధానం చేస్తూ వారికి ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Bima Sakhi Yojana in Telugu – అసలు బీమా సఖి యోజన అంటే ఏంటి?

కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి భాగస్వామ్యంతో ప్రారంభించిన సరికొత్త పథకమే బీమా సఖి పథకం. దీనిని రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అనుసంధానం చేసింది. బీమా సఖి యోజన పథకం ద్వారా ఎంపికైన మహిళలు తమ ప్రాంతంలో ఎల్ఐసి బీమా సదుపాయాల గురించి వివరించడం, అవగాహన కల్పించడం, కొత్తవారిని బీమా లో చేర్పించుకోవడం, ప్రీమియంలు వసూలు చేయడం వంటి పనులు చేయడం జరుగుతుంది.

ఈ పని కాలవ్యవధి మూడు సంవత్సరాలు ఉంటుంది.

ప్రశ్న: బీమా సఖి యోజన ఏ పని చేస్తారు?

సమాధానం: బీమా సఖి యోజన కింద ఎంపికైన డ్వాక్రా మహిళలు తమ ప్రాంతాల్లో ఎల్ఐసి వారి బీమా సదుపాయాలను మరియు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారు. వాటి మీద అవగాహన కల్పించడం, ఆసక్తి ఉన్నవారి నుంచి ప్రీమియంలు సేకరించి ఎల్ఐసికి సమర్పించడం వంటి పనులు చేస్తారు.

Bima Sakhi Yojana Stipend – బీమా సఖి యోజన వేతన వివరాలు

బీమా సఖి యోజన పథకం ద్వారా ఎంపికైన మహిళలకు స్టైఫండ్ రూపంలో అమౌంట్ అందించడం జరుగుతుంది. వీటితో పాటు అదనంగా బోనస్ లు మరియు కమిషన్లు పొందవచ్చు.

  • మొదటి సంవత్సరం – నెలకు ₹7,000 + బోనస్ మరియు కమిషన్లు
  • రెండవ సంవత్సరం – నెలకు ₹6,000 + బోనస్ మరియు కమిషన్లు
  • మూడో సంవత్సరం నుండి – నెలకు ₹5,000 + బోనస్ మరియు కమిషన్లు
  • అదనంగా బోనస్ మరియు కమిషన్లు మాత్రం కొత్తవారిని జాయిన్ చేస్తే ఇవ్వడం జరుగుతుంది.
Stipend per month details

ఈ పథకాన్ని ప్రధానమంత్రి ఎల్ఐసి తో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర మహిళల కోసం అనుగుణంగా అమలు చేస్తున్నాయి.

Bima Sakhi Yojana Eligibility – బీమా సఖి యోజన అర్హతలు

  • వయసు 18–70 సంవత్సరాల మధ్య ఉండాలి
  • కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత కావాలి
  • డ్వాక్రా గ్రూప్ మహిళలు మాత్రమే అర్హులు
  • ఎల్ఐసి ఏజెంట్లు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు అర్హులు కారరు
  • ప్రభుత్వ ఉద్యోగం పొందని వారు మాత్రమే అర్హులు

Bima Sakhi Yojana Application Process – దరఖాస్తు విధానం

ఈ పథకానికి దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి.

🔗 ఇక్కడ క్లిక్ చేసి Apply చేయండి

ఆసక్తి ఉన్నవారు పైన ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.

LIC Bima Sakhi Scheme Objective – బీమా సఖి యోజన లక్ష్యాలు

  • గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం
  • బీమా పై అవగాహన పెంపొందించడం
  • మహిళలకు ఆర్థిక స్థిరత్వం కల్పించడం
  • మహిళల సాధికారతను పెంపొందించడం

Bima Sakhi Yojana Overview – బీమా సఖి యోజన 2025 – పూర్తి వివరాలు

అంశంవివరాలు
పథకం పేరుబీమా సఖి యోజన 2025 [LIC Bima Sakhi Scheme]
అమలు రాష్ట్రంఆంధ్రప్రదేశ్
అర్హులుడ్వాక్రా గ్రూప్ మహిళలు
వయసు పరిమితి18–70 సంవత్సరాలు
కనీస విద్య10వ తరగతి ఉత్తీర్ణత
1వ సంవత్సరం వేతనం₹7,000
2వ సంవత్సరం వేతనం₹6,000
3వ సంవత్సరం నుండి వేతనం₹5,000
అదనపు ప్రయోజనాలుబోనస్, కమిషన్లు
దరఖాస్తు విధానంఆన్లైన్ అప్లికేషన్
అధికారిక లింక్Apply Online

Bima Yojana Frequently Asked Questions – బీమా సఖి యోజన FAQs

Q1: బీమా సఖి యోజన అంటే ఏమిటి?

A1: గ్రామీణ మహిళలకు బీమా అవగాహన కల్పిస్తూ, ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది.

Q2: బీమా సఖి యోజన లో వేతనం ఎంత? (Bima Sakhi Yojana salary)

A2: 1వ సంవత్సరం – నెలకు ₹7,000, 2వ సంవత్సరం – నెలకు ₹6,000, 3వ సంవత్సరం నుండి నెలకు – ₹5,000. అదనంగా బోనస్, కమిషన్లు ఉంటాయి. Stiphend రూపంలో ఈ జీతం ఇవ్వడం జరుగుతుంది.

Q3: ఈ పథకానికి ఎవరు అర్హులు?

A3: వయసు 18–70 సంవత్సరాల మధ్య, 10వ తరగతి ఉత్తీర్ణత, డ్వాక్రా మహిళలు మాత్రమే అర్హులు.

Q4: దరఖాస్తు ఎలా చేయాలి?

A4: ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి Apply చేయండి.

Q5: బీమా సఖి యోజన (Bima Sakhi Yojana) ప్రయోజనాలు ఏమిటి?

A5: ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం, బీమా అవగాహన, మహిళల సాధికారత.


🔔 ముగింపు

బీమా సఖి యోజన 2025 ద్వారా మహిళలకు ఉద్యోగం, ఆదాయం, గౌరవం లభిస్తాయి. డ్వాక్రా మహిళలు తప్పకుండా అప్లై చేయాలి.

3 responses to “Bima Sakhi Yojana Scheme Full Details – Andhra Pradesh Women Bima Sakhi Rs 7k Monthly బీమా సఖి యోజన 2025 – ఏపీలో మహిళలకు నెలకు ₹7,000 వేతనం”

  1. G.jyothi Avatar
    G.jyothi

    A.p prakasham direct
    Cumbum mandal
    Aurangabad village

  2. Madri Suvarnalatha Avatar
    Madri Suvarnalatha

    Good

  3. రామ లక్ష్మీ Avatar
    రామ లక్ష్మీ

    పురుషులకు కూడా అవకాశం కల్పించాలి

Leave a Reply to రామ లక్ష్మీ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page