APSSDC Work Process for Volunteers – వాలంటీర్లు APSSDC పని చేయు విధానం

GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.1.0 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అప్డేట్ చేసుకొని వారు కింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోండి. కొత్తగా “APSSDC SKILL HUBS APPS” అనే ఆప్షన్ ఇవ్వడం జరిగినది. మీ పరిధిలో  చదువుకున్న /చదువుకోని నిరుద్యోగులకు/ ఇంట్రెస్ట్ వారికి ఉచితంగా నైపుణ్య అభివృద్ధి ట్రైనింగ్ మరియు తదితర వివరాలు కొరకు రిజిస్ట్రేషన్ చేయవచ్చు.

APSSDC లో రిజిస్ట్రేషన్ చేయు విధానం :

GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తరువాత Home Page  లో “సేవల అభ్యర్థన” పై క్లిక్ చేయాలి. తరువాత “APSSDC SKILL HUBS APPS” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వెంటనే “APSSDC app not Installed, Please install to Continue” అని చూపిస్తుంది. INSTALL పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ లింక్ కింద ఇవ్వటం జరిగింది లింకు పై క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి Register Type వద్ద GSWS అని సెలెక్ట్ చేసుకోవాలి. Enter Sachivalayam Code వద్ద 8 అంకెల మీ గ్రామ లేదు వార్డు సచివాలయం కోడ్ ఎంటర్ చేయాలి. మీ సచివాలయం కోడ్ మర్చిపోతే కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

సచివాలయం పరిధిలోని అందరి వాలంటీర్ల పేర్లు, వారి ఆధార నెంబర్లు, ఊరు పేరు చూపిస్తాయి. రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యక్తి ఏ వాలంటీర్ పరిధిలోకి వస్తారో వారిని సెలెక్ట్ చేసుకొని, “REGISTER A CANDIDATE” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేషన్ చేస్తున్న  వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ ను Enter Aadhar Number వద్ద ఎంటర్ చేయాలి. Next పై క్లిక్ చేయాలి. ఆధార్ కార్డుకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది దానిని ఎంటర్ చేసి Verify Aadhar పై క్లిక్ చేయాలి.

User Details వస్తాయి. అందులో Aadhar (ఆధార్ నెంబరు), Full Name (పూర్తి పేరు),Father’s Name (తండ్రి పేరు), Gender (లింగము) వస్తాయి. తర్వాత Mobile Number (మొబైల్ నెంబరు), E-mail ID, Caste (కులం), PWD (దివ్యంగులు) ఎంటర్ చేయాలి. DOB (పుట్టిన తేదీ), వయసు (Age) వివరాలు అవే వస్తాయి. తరువాత Next పై క్లిక్ చేయాలి.

Address Communication వివరాలు అడుగుతుంది. లబ్ధిదారుని జిల్లా నియోజకవర్గ మునిసిపాలిటీ లేదా మండలం, గ్రామం మరియు పిన్ కోడ్ వివరాలు నమోదు చేసి Next పై క్లిక్ చేయాలి.

Education & Experience వివరాలు అడుగుతుంది. మొదట చదువు కోని వారు అయితే Education ఆప్షన్ దగ్గర NO అని టిక్ చేయాలి. ఏదైనా పని చేస్తున్నట్లయితే ఆ పనిలో అనుభవం (Professional Experience) ఉందా లేదా అని అడుగుతుంది.పనిలో అనుభవం ఉంటే YES టిక్ చేసి (Name Of Organisation) దగ్గర పని చేస్తున్న కంపెనీ పేరు ఎంటర్ చేసి ఎప్పటినుంచి ఎప్పటి వరకు పనిచేశారో, మొత్తం అనుభవం సంవత్సరాలలో ఎంటర్ చేయాలి. పనిలో అనుభవం లేకపోతే No అని సెలెక్ట్ చేసి Are You Interested In Self Employment? అంటే సొంతంగా ఏదైనా పని చేసుకోగలరా అని అడుగుతుంది. చెయ్యగలిగితే Yes అని క్లిక్ చేసి Interested Self Employment Details దగ్గర వచ్చిన పని వివరాలు నమోదు చేయాలి. సొంతంగా పనిచేసుకోలేకపోతే NO అని టిక్ చేయాలి. తరువాత Next పై క్లిక్ చేయాలి.

చదువుకున్న వారు అయితే Education ఆప్షన్ దగ్గర YES అని టిక్ చేయాలి.Qualification దగ్గర వారు ఎంత వరకు చదువుకున్నారో ( School / Research/ Diploma & Others/ Intermediate/ Postgraduate/ Undergraduate) లో ఒకటి సెలెక్ట్ చేయాలి. Branch దగ్గర వారు చదివిన బ్రాంచ్ నమోదు చేయాలి. Specialisation దగ్గర వారు చదువుకున్న స్ట్రీమ్ ఎంచుకోవాలి.

ఉదాహరణ 1 : ఒక అభ్యర్థి B.Tech లో EEE చదివినట్టు అయితే

  • Qualification – Undergraduate
  • Branch – B.Tech
  • Specialisation – Electrical And Electronics Engineering

ఉదాహరణ 2 : ఒక అభ్యర్థి 5th క్లాస్ వరకు చదివినట్టు అయితే

  • Qualification – School 
  • Branch – 5th Class
  • Specialisation – 5th Class 

ఏదైనా పని చేస్తున్నట్లయితే ఆ పనిలో అనుభవం (Professional Experience) ఉందా లేదా అని అడుగుతుంది.పనిలో అనుభవం ఉంటే YES టిక్ చేసి (Name Of Organisation) దగ్గర పని చేస్తున్న కంపెనీ పేరు ఎంటర్ చేసి ఎప్పటినుంచి ఎప్పటి వరకు పనిచేశారో, మొత్తం అనుభవం సంవత్సరాలలో ఎంటర్ చేయాలి. పనిలో అనుభవం లేకపోతే No అని సెలెక్ట్ చేసి Are You Interested In Self Employment? అంటే సొంతంగా ఏదైనా పని చేసుకోగలరా అని అడుగుతుంది. చెయ్యగలిగితే Yes అని క్లిక్ చేసి Interested Self Employment Details దగ్గర వచ్చిన పని వివరాలు నమోదు చేయాలి. సొంతంగా పనిచేసుకోలేకపోతే NO అని టిక్ చేయాలి. తరువాత Next పై క్లిక్ చేయాలి.

Course Details చూపిస్తుంది. లబ్ధిదారుల Qualification, Experience ప్రకారం వారికి కొన్ని కోర్సుల వివరాలు వస్తాయి. Select Your Course లో నచ్చిన ఒక కోర్స్ ను ఎంచుకొని, Training Centre ఎంచుకొని, Course Duration అంటే ఆ మొత్తం కోర్సు ఎంతకాలం ఉంటుంది అని అర్థం, Residential అంటే ఆ Course ఇంటి వద్ద నుంచి నేర్చుకోవచ్చు, Non- Residential అంటే ఆ కోర్స్ ఇంటి వద్ద కాకుండా ట్రైనింగ్ సెంటర్ లో ఉంటుంది. Call Centre నెంబర్ Note చేసుకొని కోర్స్ పూర్తి సమాచారం కోసం కాల్ చెయ్యచ్చు. తరువాత SUBMIT పై క్లిక్ చేసిన వెంటనే Registration Number వస్తుంది. దానిని లబ్ధిదారుడు Note చేసుకోవాలి. ఇంతటితో వాలంటీర్ పని పూర్తి అయినట్టే. వారి క్లస్టర్ పరిధిలో ఉండే వారందరికీ ఈ విధం గా చేయాలి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page