AP Work From Home Survey 2025 : Process, FAQ’s and Reports

AP Work From Home Survey 2025 : Process, FAQ’s and Reports

AP Work From Home Survey 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Swarna Andhra Vision 2047 కింద రాష్ట్రాన్ని టెక్నాలజీ, ఉద్యోగ రంగాల్లో ప్రపంచస్థాయి మోడల్ గా మార్చే లక్ష్యంతో కొత్త చర్యలు ప్రారంభించింది. ఫిబ్రవరి 24, 2025న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, Work from Home (WFH), కో-వర్కింగ్ స్పేసెస్ (CWS), మరియు Neighbourhood Workspaces (NWS) గుర్తించడానికి రాష్ట్రవ్యాప్త సర్వేని నిర్వహిస్తుంది. ఈ ప్రయత్నం ప్రధానంగా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు సాధికారత మరియు సమతుల్య జీవనాన్ని ప్రోత్సహిస్తుంది.

Swarna Andhra Vision 2047: ప్రధాన లక్ష్యాలు

  • ప్రతి నగరం, మండలం, గ్రామంలో IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి.
  • స్థానిక ఉద్యోగాల సృష్టి మరియు మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం.
  • టెక్నాలజీ ద్వారా భౌగోళిక, సామాజిక అడ్డంకులను తొలగించడం.

Work from Home సర్వే 2025: వివరాలు

  1. సర్వే ఉద్దేశ్యం:
    • ప్రతి గ్రామ, వార్డ్ సచివాలయం స్థాయిలో WFH, CWS, మరియు NWS సౌకర్యాలను మ్యాప్ చేయడం.
    • మహిళలు సురక్షితంగా పనిచేయడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడం.
  2. సర్వే ప్రక్రియ:
    • ప్రత్యేక WFH ఆప్ మరియు యూజర్ మాన్యువల్ ద్వారా డేటా సేకరణ.
    • జిల్లా కలెక్టర్లు మరియు గ్రామ/వార్డ్ సచివాలయాల సహకారంతో మార్చ్ 10, 2025కు ముందు పూర్తి చేయాలి.
  3. ప్రయోజనాలు:
    • మహిళలకు అనుకూలత: STEM రంగంలో స్త్రీల ఉద్యోగావకాశాలు 40% పెరుగుతాయి (అంచనా).
    • స్థానిక అభివృద్ధి: IT ఆఫీసులు ప్రతి మండలంలోనూ స్థాపించబడతాయి.
    • సామర్థ్యం: కార్యాలయ సమయ ఫ్లెక్సిబిలిటీ ద్వారా ఉత్పాదకతలో 30% వృద్ధి.

WFH Survey – మహిళా శక్తి మరియు STEM రంగం

ఈ సర్వే ప్రత్యేకంగా మహిళలను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్లో STEM రంగంలో మహిళల భాగస్వామ్యం 22% మాత్రమే. కొత్త విధానం ద్వారా ఈ సంఖ్యను 50%కి పెంచే లక్ష్యం ఉంది. “WFH సౌకర్యాలు మహిళలకు కుటుంబ బాధ్యతలతో పాటు ప్రొఫెషనల్ కెరీర్ ను కలపడానికి వీలు కల్పిస్తాయి” అని ప్రభుత్వ సెక్రటరీ శ్రీ భాస్కర్ కాటమనేని పేర్కొన్నారు.

ఎలా పాల్గొనాలి?

  • గ్రామ/వార్డ్ సచివాలయంతో సంప్రదించి WFH సర్వేలో నమోదు చేసుకోండి.
  • WFH యాప్ డౌన్లోడ్ చేసుకొని సర్వే ఫారమ్ పూరించండి.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Work from Home సర్వే 2025 ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీ మరియు ఉద్యోగ రంగాల్లో ప్రపంచస్థాయి మోడల్గా మార్చేందుకు ఘనమైన అడుగు వేసింది. ఈ ప్రయత్నం ప్రత్యేకంగా మహిళలకు సాధికారత, సమతుల్య జీవనం మరియు ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. Swarna Andhra Vision 2047 లక్ష్యాలను సాధించడానికి ఈ విధానం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి పౌరుడు ఈ సర్వేలో పాల్గొనడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడగలరు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక మార్గదర్శక రాష్ట్రంగా నిలవాలన్నది ఈ ప్రయత్నం యొక్క అంతిమ లక్ష్యం.

కీలక అంశాలు:

  • మహిళలకు సాధికారత మరియు సమాన అవకాశాలు.
  • స్థానిక ఉద్యోగాల సృష్టి మరియు IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి.
  • ప్రతి పౌరుడి సహకారం ద్వారా Swarna Andhra Vision 2047 లక్ష్యాలను సాధించడం.

కాల్ టు యాక్షన్:

మీరు కూడా ఈ సర్వేలో పాల్గొని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడండి. మరిన్ని వివరాల కోసం మీ గ్రామ/వార్డ్ సచివాలయాన్ని సంప్రదించండి లేదా AP ప్రభుత్వ వెబ్ సైటునుని సందర్శించండి.

Work from Home సర్వే APP

Work from Home సర్వే User Manual / SOP

Work from Home సర్వే Dashboard / Report

Work From Home సర్వే నోట్స్ :

  • వర్క్ ఫ్రం హోం  [ Work From Home ] సర్వే ఆప్షన్ను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మొబైల్ GSWS Employees Mobile App వెర్షన్ 6.2 లొ ఇవ్వటం జరిగింది.
  • ఇంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి 18 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరి పేరు సర్వేకు వచ్చాయి. అందరికీ సర్వే చేయాలి.
  • సర్వే ఇష్టం లేకపోయినా, పనిచేయుటకు లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్ హాజరు అవ్వటానికి ఇష్టం లేకపోయినా వారి వివరాలు సబ్మిట్ చేయుటకు ఆప్షన్ కలదు.
  • సర్వేను సబ్మిట్ చేయుటకు తప్పనిసరిగా సిటిజన్ యొక్క బయోమెట్రిక్ లేదా ఫేసు లేదా ఐరిస్ లేదా OTP అవసరం.

Work From Home Surveyలో అడిగే ప్రశ్నలు

1. విద్యార్హత ఏమిటి ?

2. ప్రస్తుతం పని చేస్తున్నారా లేదా?

3. ప్రస్తుతం పని చేస్తున్నట్లయితే వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలోపనిచేస్తున్నారు. ?

4. వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారా ? ఆఫీస్ వద్ద నుండిపనిచేస్తున్నారా ? లేదా హైబ్రిడ్మోడల్ లో కొంతకాలం ఇంటి వద్ద కొంతకాలం ఆఫీస్ లోపనిచేస్తున్నారా ?

5. ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్టయితే మీ ఇంటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉన్నదా ?

6. వర్క్ ఫ్రొం హోమ్ అవకాశం ఉన్నట్టయితే మీ ఇంటిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవకాశం ఉందా ?

7. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్ తో ఇంటర్నెట్ సదుపాయం ఉంది ?

8. మీ ఇంట్లో వర్క్ ఫ్రం హోం కింద మీ స్నేహితులకు లేదా మీ కొలీగ్ / మీ తోటి ఉద్యోగులకువర్క్ ఫ్రం హోం సదుపాయం కొరకు ఇంట్లో ప్లేస్ లేదా సపరేట్గా రూమ్ ఉన్నదా ?

9. ఉంటే ఆ రూమ్ యొక్క కొలత ?

10. ఎంతమంది వరకు వర్క్ ఫ్రం హోం కింద ఆ రూమ్ లో పనిచేయటం అవకాశంఉంటుంది ?

11. ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్ లో పనిచేయుటకు ఇష్టం ఉన్నదా ?

12. పనిచేయటం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హాజరు అవుతారా ?

Work From Home Survey Process in GSWS Employees Login

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో Work From Home Survey సర్వే ఏ విధంగా చేస్తారో కింద ఇవ్వటం జరిగినది .

ముందుగా కొత్తగా అప్డేట్ అయిన GSWS Employees Mobile App ను డౌన్లోడ్ చేసుకోవాలి.

తరువాత ఉద్యోగుల లాగిన్ ఐడి ఎంటర్ చేసి బయోమెట్రిక్ లేదా ఫేసు లేదా  లాగిన్ అవ్వాలి అయిన వెంటనే కింద చూపిన విధంగా హోం పేజీ ఓపెన్ అవుతుంది . Work From Home Survey అనే ఆప్షన్ ఎంచుకోవాలి

 గ్రామా /  వార్డు సచివాలయంలో క్లస్టర్ వారీగా లేదా ఆధార్ నెంబరు ప్రాప్తికి ఎవరికైతే సర్వే చేయాలో వారి పేరును ఎంచుకోవచ్చు .

 క్లస్టర్ల వారీగా అయితే కింద చూపించినట్టుగా సచివాలయ పరిధిలో ఉన్న అన్ని క్లస్టర్ల వివరాలు చూపిస్తుంది .

 సర్వే ఎవరికైతే స్టార్ట్ చేయాలో వారు ఏ క్లాస్ పరిధిలోకి వస్తే ఆ నష్టాన్ని ఎంచుకొని ఆ క్లస్టర్ లో వారి యొక్క పేరును చర్చి ద్వారా లేదా స్క్రోల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి . 

 కింద చూపించిన వాటిలో సర్వే చేస్తున్న వారి విద్యా అర్హతను పెంచుకోవాల్సి ఉంటుంది .

 ప్రస్తుతం ఎటువంటి పనిచేయకుండా భవిష్యత్తులో ఎటువంటి పనిని చేయుటకు ఇష్టం లేని వారికి కింద చూపిన ఆప్షను సెలెక్ట్ చేసి సర్వేను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసినప్పుడు ఎవరికైతే సర్వే చేస్తున్నారో వారి యొక్క బయోమెట్రిక్ లేదా ఫేసు లేదా ఐరిస్ లేదా ఓటీపీ ద్వారా ధ్రువీకరించి ఆ యొక్క వ్యక్తికి సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది

 ప్రస్తుతం ఎటువంటి పనిచేయకుండా, భవిష్యత్తులో ఇంటి వద్ద నుండి ప్రభుత్వం ఎటువంటి పనిని కల్పించిన చేయుటకు ఇష్టంగా ఉంటూ, ప్రభుత్వం కల్పించే ఏదైనా ట్రైనింగ్ కు హాజరు అవ్వటానికి ఇష్టంగా ఉంటూ, ఇంటి వద్ద నుండి పనిచేయుటకు ఇంటిలో అన్ని వసతులు ఉంటూ,  ఇంట్లో వైఫై ఫెసిలిటీ ఉంటూ , ఇంట్లో మీతో పాటుగా మిగిలిన వారికి అకామిడేషన్ అనగా మీ ఇంట్లోనే లేదా వర్క్ చేయుటకు ఏదైతే రూము ఉంటుందో ఆ రూములో మీతో పాటుగా ఎక్కువ మందిని ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేయుటకు అవకాశం ఉన్నట్టు ఉన్నట్టయితే వారు కింద చూపించినట్టుగా అన్ని వివరాలు ఇచ్చి చివరగా ధ్రువీకరించి సర్వే వారికి పూర్తి చేయాల్సి ఉంటుంది .

 ప్రస్తుతం ఇంటి వద్ద కాకుండా బయట వర్క్ ఫ్రం ఆఫీస్ పని చేస్తున్న వారికి కింద చూపించినట్టుగా సర్వేను ఆప్షన్లు సెలెక్ట్ చేసుకుని ఓటిపి ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది .

 ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం ద్వారా ఇంటి వద్ద పనిచేస్తున్న వారికి కింద తెలిపిన విధముగా ఆప్షను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తారు .

 కొన్ని రోజులు ఇంటి వద్ద నుండి మరికొన్ని రోజులు ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్న వారికి కింద చూపించిన విధముగా ఆప్షన్లు సెలెక్ట్ చేసి వారికి సర్వేను సబ్మిట్ చేస్తారు .

Work From Home Survey Report Link 

వర్క్ ఫ్రం హోం సర్వే ఏ సచివాలయంలో ఎంతమందికి జరిగిందో కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి ఫోటోలో చూపిస్తున్నట్టుగా లింక్ పై క్లిక్ చేసినట్లయితే నేరుగా అధికారిక వెబ్సైట్కు మీకు రీ డైరెక్ట్ అవుతుంది అక్కడ మీరు రిపోర్ట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు .

Work From Home Survey Tips to GSWS Employees

  • ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు పూర్తయి 50 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ ఈ GSWS Work From Home Survey చేయాలి కావున ఒక్కొక్కరికి బయోమెట్రిక్ లేదా ఓటీపీ లేదా ఫేసు లేదా ఐరిస్ ద్వారా సర్వే చేయాల్సి ఉంటుంది కావున ముందుగా ఎవరికైతే వర్క్ ఫ్రొం హోమ్ ద్వారా ఉద్యోగం లేదా పని చేయనివారు ఉంటారో వారికి ముందుగా పూర్తి చేయండి.
  • సర్వే ప్రారంభానికి ముందే ముందుగా సచివాలయ ఉద్యోగులు వారి క్లస్టర్లో ఉన్న వారందరి మొబైల్ నెంబర్లు రాసుకొని ఉంటే ఆ లిస్టు ద్వారా ఓటిపి ఆప్షన్ ద్వారా సర్వే త్వరగా పూర్తి చేయవచ్చు. 
  • మొబైల్ నెంబర్లు రాసుకొని వారు ఎవరైనా ఉంటే వారు సర్వే ప్రారంభానికి ముందే మీ యొక్క క్లస్టర్లో లేదా మీ గ్రామంలో అందరి వివరాలు తెలిసిన వారి వద్దకు వెళ్లి ఎవరు ఎక్కడ ఉన్నారు? వారి మొబైల్ నెంబర్లు ,అన్నీ తెలుసుకోండి. తద్వారా సర్వే చేసే సమయంలో ఓటిపి ద్వారా వేగంగా చేసే అవకాశం ఉంటుంది.
  • సర్వే ప్రారంభానికి ముందు మీ క్లస్టర్లో వారి అందరి పేర్లు పేపర్ పై రాసుకున్నట్టయితే ఎన్ని అవుతున్నాయి ? ఎన్ని అవటం లేదు ? ఒక కుటుంబానికి ఎన్ని అవుతున్నాయి ? అనే ఒక క్లారిటీ ఉంటుంది . లేకపోతే ఒకే కుటుంబానికి చెందిన వారికి పదే పదే ఒకే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.
  • సర్వే చేస్తున్నప్పుడే ఇంట్లో ఉన్న వారి పేర్లు ఒక్కొక్కరిగా అడగండి. 18 సంవత్సరాల లోపు ఉన్న వారి పేర్లు కాకుండా పెన్షన్లు తీసుకుంటున్న వారి పేర్లు కాకుండా అంటే 50 సంవత్సరాలు పైబడిన వారి పేర్లు కాకుండా మిగిలిన వారు ఎవరెవరున్నారో అడిగి ఒక పేపర్ పై రాసుకొని, వెంటనే మొబైల్ యాప్ లో సెర్చ్ లో కూడా వారి పేర్లు Search చేసినట్లయితే వారి పేర్లను పేపర్ పై రాసుకొని వారికి ముందుగా సర్వే చేసినట్లయితే ఇంటింటికీ సర్వే అనేది పూర్తవుతుంది . ఆ ఇంట్లో ఉన్న వారందరి పేర్లు కూడా ఈ సర్వేలో కవర్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కువ % GSWS Work From Home Survey ను తక్కువ సమయంలో చేసే అవకాశం ఉంటుంది.
  • ఈ సర్వే గ్రామ లేదా వార్డు సచివాల సిబ్బంది క్లస్టర్ Tag చేసినప్పటికీ మీకు తెలిసిన ఉద్యోగి లేదా మీ సహా ఉద్యోగి ఆయా వీధిలోకి లేదా ఆ క్లస్టర్లోకి ఏదైనా పని పై వెళ్ళినప్పుడు మీకు సహాయం చేయమని చెప్పండి. అవకాశం ఉంటే సచివాలయం కు వచ్చిన లేదా రోడ్డుపై కనిపించిన లేదా దగ్గరలో ఎక్కడ కనిపించినా అందరూ వారి యొక్క క్లస్టర్ కనుక్కొని వారి యొక్క సర్వేను అక్కడే పూర్తి చేయవచ్చు ఎందుకంటే మొబైల్ తీసుకువస్తే ఓటిపి ద్వారా మొబైల్ తీసుకురాకపోతే ఫేస్ ద్వారా స్కానర్ అందుబాటులో ఉంటే బయోమెట్ల ద్వారా సర్వేలు పూర్తి చేయవచ్చు .
  • శాశ్వత వలస ఉన్న వారి, చనిపోయిన వారి, సర్వే ఇష్టం లేని  వారి వివరాలన్నీ ఒక పేపర్ పై నోట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకున్నట్లయితే భవిష్యత్తులో అధికారులు అడిగినట్లయితే ఉపయోగపడుతుంది.
  •  మీ క్లస్టర్ పరిధిలో పెండింగ్లో ఉన్న వారికి మరియు సర్వే చేస్తున్న వారికి కింద చూపించిన విధంగా రిమార్కులను రాసుకున్నట్లయితే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా లేదా పై అధికారులు రిపోర్ట్ అడిగిన చూపించడానికి లేదా పంపించడానికి సులువుగా ఉంటుంది
Click here to Share

7 responses to “AP Work From Home Survey 2025 : Process, FAQ’s and Reports”

  1. VEERABRAMHAM DHULIPALLA Avatar
    VEERABRAMHAM DHULIPALLA

    Good

  2. E prathyusha Avatar
    E prathyusha

    Nice and iam intresting to join job work from home

  3. Susanthu Avatar
    Susanthu

    Iam. Ok

  4. Boddeti Makara jyothi Avatar
    Boddeti Makara jyothi

    I want a work from home
    I am currently pursuing degree final year

  5. Mohammed Rayan Avatar
    Mohammed Rayan

    Yes am interested to do work

  6. DEVARAPU JAYA LAKSHMI Avatar
    DEVARAPU JAYA LAKSHMI

    YES AM INTERESTED TO DO WORK

  7. DEVARAPU JAYA LAKSHMI Avatar
    DEVARAPU JAYA LAKSHMI

    ok am interested to work from home

Leave a Reply to E prathyusha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page