Vahana Mitra Scheme 2025 – ₹15,000 సాయం కోసం ఇప్పుడే అప్లై చేయండి!
Vahana Mitra Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి వాహనమిత్ర పథకం కింద ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి అర్హత కలిగిన డ్రైవర్‌కు రూ.15,000 సహాయం అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.
Release Date : అక్టోబర్ 4వ తేదీన ఆటో – క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15,000 జమ – మొత్తం 3,10,385 మందిని అర్హులుగా గుర్తింపు. ఫిట్నెస్ మరియు పెండింగ్ చలాన్లు క్లియర్ చేసిన వారికి కూడా అమౌంట్ జమ చేయనున్న ప్రభుత్వం.
మీ మొబైల్ లోనే ఆధార్ ఎంటర్ చేసి కింది విధానంలో మీ స్టేటస్ ఇప్పుడే చెక్ చేసుకోండి
Vahana Mitra Applications 2025 started: సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు గ్రామ వార్డు సచివాలయాలలో కొనసాగుతున్న వాహన మిత్ర కొత్త దరఖాస్తులు. ఇప్పటికే వాహన మిత్ర పాత లబ్ధిదారులుగా ఉన్నవారు ఒకసారి సచివాలయంలో జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. పాత వారికి కొత్తగా దరఖాస్తు అవసరం లేదు.
ఆటోలు
1. ఫిట్‌నెస్ – ఈ సంవత్సరానికి మినహాయింపు, ఒక నెలలోపు పునరుద్ధరణకు లోబడి ఉండాలి. [Fitness certificate ను దరఖాస్తు చేసుకున్న నెలలోపు అందించవచ్చు]
2. వాహన పన్ను – అవసరం లేదు.
3. RC – తప్పనిసరి.క్యాబ్‌లు
1. RC, ఫిట్‌నెస్ & వాహన పన్ను – తప్పనిసరి.
పత్రాలు చెల్లుబాటు అయ్యేవి/అమలులో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి వాటిని తనిఖీ చేయండి (బ్యాకెండ్ ధృవీకరణ కూడా చేయబడుతుంది).
2. భీమా – ఆప్షనల్
వాహన మిత్ర పథకం – VC ముఖ్య సూచనలు
కొత్త దరఖాస్తుల గడువు
- కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ఇప్పటికే ముగిసింది.
eKYC & అర్హతలు
- eKYC జాబితాలో అర్హులు కాని లబ్ధిదారులు ఉంటే, పిండింగ్‌లో పెట్టకండి. వెంటనే eKYC పూర్తి చేసి NBM పోర్టల్‌లో “Ineligible” గా గుర్తించాలి.
- అన్ని రకాల సామాజిక పింఛన్లు, ఆరోగ్య పింఛన్లు మరియు వృత్తి ఆధారిత పింఛనుదారులు ఈ పథకానికి అర్హులు.
- వాహనం యజమాని మాత్రమే దరఖాస్తుదారుగా పరిగణించబడతారు. వాహనం యజమాని మరణిస్తే, వారి కుటుంబం కొత్తగా దరఖాస్తు చేయలేరు.
వాహనం & లైసెన్స్ వివరాలు
- లబ్ధిదారుని పాత వాహనం వివరాలు eKYC లో కనబడితే, “Sold” అని గుర్తించాలి. కొత్త వాహనం కోసం తాజా దరఖాస్తు తీసుకోవాలి.
- వాహనం యజమాని కాకుండా మరెవరు eKYC పూర్తి చేసిన సందర్భాలు ఉంటే, అలాంటి దరఖాస్తులు రద్దు చేయబడతాయి.
- 31.08.2025కి ముందే రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు/డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి మాత్రమే NBM లో కొత్త దరఖాస్తులు అవకాశం ఉంది.
- 31.08.2025 తర్వాత కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు అర్హత పొందవు.
- డ్రైవింగ్ లైసెన్స్ కొత్త నంబర్లు మాత్రమే NBM లో కనిపిస్తాయి. పాత నంబర్లతో ఉన్న వివరాలు ప్రతిఫలించవు.
- పాత యజమాని పేర్ల సమస్య పరిష్కరించబడింది. ఇప్పుడు కొత్త యజమాని పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆటో రిక్షా సంబంధిత నిబంధనలు
- RC validity ముగిసినా ఆటో రిక్షా అప్లికేషన్‌ను స్వీకరించవచ్చు.
- ఎలక్ట్రిక్ ఆటోలు (Electric Autos) అర్హులు.
- E-Rickshaws ఈ పథకానికి అర్హులు కావు.
ఫిర్యాదు (Grievance) ప్రక్రియ
- 36,000 వాహనాల యజమాన్య మార్పులు ఇప్పటికే పూర్తయ్యాయి.
- ఇంకా వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ NBM లో చూపించక pith, పథకం అమలయ్యాక లబ్ధిదారు Grievance మాడ్యూల్‌లో ఫిర్యాదు చేయాలి.
Important Links
Vahana Mitra Application form 2025 pdf copy and Vahana Mitra Fitness certificate pdf copy can be downloaded below.
AP Vahana Mitra Scheme ముఖ్యాంశాలు [Vahana Mitra 2025 Key Guidelines]
- ఆర్థిక సహాయం: ₹15,000 ప్రతి సంవత్సరం
- ఉద్దేశ్యం: బీమా, ఫిట్నెస్, మరమ్మతులు, ఇతర అవసరాలు
- నిధుల జమ: అక్టోబర్ 4న
- దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 17
- దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 19
Andhra Pradesh Vahana Mitra Scheme 2025 ప్రయోజనాలు [Vahana Mitra scheme Benefits and amount]
- ప్రతి సంవత్సరం ₹15,000 ఆర్థిక సాయం
- వాహన ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రిపేర్లు వంటి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు
- ప్రతి కుటుంబానికి ఒకే వాహనం మాత్రమే అర్హత
- 2025-26 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది
- మొదటి చెల్లింపు 4 అక్టోబర్ 2025న అందుతుంది
Vahana Mitra Scheme Eligibility Criteria – అర్హతలు
- పథకానికి అర్హత ప్రమాణాలు
- అభ్యర్థి తప్పనిసరిగా ఆటో రిక్షా / మోటర్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్‌ను స్వంతంగా కలిగి ఉండి, నడపాలి.
- ప్రస్తుతానికి నడుస్తున్న వాహనాల యజమానులు మరియు డ్రైవర్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- అభ్యర్థి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- వాహనం (ఆటో రిక్షా / మోటర్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్) తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి మరియు చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు (RC, ఫిట్‌నెస్, ట్యాక్స్) ఉండాలి.
- ఆటో రిక్షా డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి మాత్రమే ఒకసారిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మినహాయింపు ఇవ్వబడింది. అయితే, ఒక నెలలోపు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి.
- ఈ పథకం కేవలం ప్రయాణికుల ఆటో రిక్షా / మోటర్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది.
- లైట్ గూడ్స్ వాహనాల యజమానులు ఈ పథకానికి అర్హులు కారు.
- అభ్యర్థి వద్ద ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
- అభ్యర్థి వద్ద బీపీఎల్/వైట్ రేషన్ కార్డు ఉండాలి.
- ప్రతి కుటుంబం ఒక వాహనానికి (ఆటో రిక్షా / మోటర్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్) మాత్రమే ప్రయోజనం పొందగలదు.
- ఒకే కుటుంబంలో వాహనం యాజమాన్యం ఒకరి పేరులో, డ్రైవింగ్ లైసెన్స్ మరొకరి పేరులో ఉండవచ్చు.
- వాహనం అభ్యర్థి/యజమాని స్వాధీనంలో ఉండాలి.
- అర్హత కలిగిన ఆటో రిక్షా / మోటర్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, GSWS శాఖ అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థి మరే ఇతర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వృత్తి సంబంధిత పథకంలో లబ్ధిదారుగా ఉండరాదు.
- అభ్యర్థి/కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి / పెన్షనర్ కాకూడదు.
- అయితే, సానిటరీ వర్కర్ల కుటుంబాలు మినహాయింపు.
- అభ్యర్థి/కుటుంబ సభ్యులు ఇంకమ్ ట్యాక్స్ అసెసీలు కాకూడదు.
- కుటుంబం గత 12 నెలల సగటు విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి.
- కుటుంబం వద్ద ఉన్న భూమి:
- తడి భూమి 3 ఎకరాల లోపు
- పొడి భూమి 10 ఎకరాల లోపు
- తడి+పొడి కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి.
- పట్టణ ప్రాంతాల్లో కుటుంబం వద్ద 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస/వాణిజ్య ఆస్తి ఉండరాదు.
- లీజ్/రెంటు పై ఉన్న వాహనాలు (ప్రభుత్వ సంస్థలు సహా) ఈ పథకానికి అర్హం కావు.
- వాహనంపై ఎటువంటి బకాయి డ్యూస్/చలాన్లు పెండింగ్‌లో ఉండరాదు.
Vahana Mitra Scheme Application Process 2025 – దరఖాస్తు ప్రక్రియ
కొత్త దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో స్వీకరిస్తారు.
- సెప్టెంబర్ 17: దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- సెప్టెంబర్ 19: దరఖాస్తుల చివరి తేదీ
- సెప్టెంబర్ 22: క్షేత్ర పరిశీలన పూర్తి
- సెప్టెంబర్ 24: తుది జాబితా సిద్ధం (final list)
- అక్టోబర్ 4: నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ
How to Apply Vahana Mitra Scheme 2025 – ఎక్కడ అప్లై చేయాలి?
దరఖాస్తులు కేవలం గ్రామ / వార్డు సచివాలయాల ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. (Vahana Mitra applications can only be submitted through grama ward sachivalayam)
Vahana Mitra Scheme Required Documents – అవసరమైన డాక్యుమెంట్స్
- రేషన్ కార్డ్
- ఆధార్ కార్డ్
- డ్రైవింగ్ లైసెన్స్
- వాహన RC
- బ్యాంక్ పాస్‌బుక్
- మొబైల్ నంబర్
- అప్లికేషన్ ఫారం
Vahana Mitra Apply Online – ఎలా అప్లై చేయాలి?
- మీ గ్రామ / వార్డు సచివాలయానికి వెళ్లాలి
- అప్లికేషన్ ఫారం పొందాలి
- అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి సమర్పించాలి
- అధికారుల ధృవీకరణ తరువాత అర్హుల జాబితాలో చేర్చబడతారు
- మొదటి చెల్లింపు అక్టోబర్ 1, 2025న మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వస్తుంది
Vahana Mitra Scheme Timeline 2025 టైమ్ లైన్‌లు
స్టెప్ – 1:
GSWS శాఖ, 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల (స్వంత ఆటో రిక్షా / మోటర్ క్యాబ్ / మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు) డేటాను గ్రామ/వార్డు సచివాలయాలకు 13-09-2025లోపు పంపుతుంది. దీనివల్ల ఫీల్డ్ వెరిఫికేషన్ జరగుతుంది.
స్టెప్ – 2:
ట్రాన్స్‌పోర్ట్ శాఖ, GSWS శాఖకు క్రింది వివరాలతో కూడిన ఆటో రిక్షాలు, మోటర్ క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌ల జాబితాను 15-09-2025లోపు పంపుతుంది:
- వాహన రిజిస్ట్రేషన్ నంబర్
- వాహన తరగతి (Class of Vehicle)
- యజమాని పేరు, పూర్తి చిరునామా, సంప్రదింపు నంబర్
- వాహన రిజిస్ట్రేషన్ తేది
స్టెప్ – 3:
GSWS శాఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం ద్వారా దరఖాస్తులు సమర్పించే అవకాశం 17-09-2025 నుండి అందిస్తుంది.
స్టెప్ – 4:
కొత్త లబ్ధిదారుల దరఖాస్తుల రిజిస్ట్రేషన్ 19-09-2025 వరకు అనుమతించబడుతుంది.
స్టెప్ – 5:
గ్రామ/వార్డు, మండల, జిల్లా స్థాయిలో ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ 22-09-2025 లోపు పూర్తవ్వాలి.
స్టెప్ – 6:
ఫైనల్ లిస్ట్ రూపొందించడం 24-09-2025 లోపు పూర్తి చేయాలి.
స్టెప్ – 7:
GSWS శాఖ, కార్పొరేషన్ వారీగా అర్హులైన లబ్ధిదారుల జాబితా మరియు ఆర్థిక సహాయం వివరాలను ట్రాన్స్‌పోర్ట్ శాఖకు 24-09-2025 నాటికి పంపుతుంది.
స్టెప్ – 8:
గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 04-10-2025 న ఆర్థిక సహాయం పంపిణీ చేస్తారు.
Vahana Mitra Verification Process వెరిఫికేషన్ & శాంక్షన్ ప్రక్రియ
- దరఖాస్తులను గ్రామ/వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్లు పరిశీలిస్తారు.
- పరిశీలించిన దరఖాస్తులు:
- గ్రామీణ ప్రాంతాల్లో MPDOలకు
- నగర ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు
పంపబడతాయి.
- అనంతరం ప్రాసెస్ చేసిన దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆమోదం / తిరస్కరణ కోసం వెళ్తాయి.
- జిల్లా కలెక్టర్లు మార్గదర్శకాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు శాంక్షన్ మంజూరు చేస్తారు.
FAQs – వాహన మిత్ర పథకం 2025 (AP Vahana Mitra Scheme 2025)
Q1: వాహనమిత్ర పథకం 2025లో ఎన్ని రూపాయలు లభిస్తాయి?
A1: ప్రతి అర్హత కలిగిన డ్రైవర్‌కు ₹15,000 ఆర్థిక సహాయం అందుతుంది.
Q2: ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
A2: ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు (సొంత వాహనం కలిగి, దానిని నడిపేవారు) దరఖాస్తు చేసుకోవచ్చు.
Q3: దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
A3: కొత్త దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 17న ప్రారంభమవుతుంది.
Q4: నిధులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయి?
A4: నిధులు అక్టోబర్ 4న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.
Q5: ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని ఆటో డ్రైవర్లు అర్హులేనా?
A5: అవును, కానీ ఒక నెలలోపు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి.
Q6: దరఖాస్తు ఎక్కడ చేయాలి?
A6: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో దరఖాస్తు చేయాలి.
Q7: వాహన మిత్ర పథకం కింద ఎవరు అర్హులు?
Ans: ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు అర్హులు. ప్రతి కుటుంబానికి ఒక వాహనం మాత్రమే అర్హత.
Q8: ఎంత సాయం అందుతుంది?
Ans: ప్రతి సంవత్సరం ₹15,000 ఆర్థిక సాయం అందుతుంది.
Q9: ఎక్కడ అప్లై చేయాలి?
Ans: గ్రామ / వార్డు సచివాలయాల ద్వారా మాత్రమే దరఖాస్తులు చేయాలి.
Q10: Vahana Mitra Payment Date 2025 ఎప్పుడు?
Ans: 04 అక్టోబర్ 2025న మొదటి చెల్లింపు అందుతుంది.
Q11 – Where can drivers apply for Vahana Mitra fitness certificate? వాహన మిత్ర ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఎక్కడ అప్లై చేయాలి.
Ans: మీ ఆర్టీవో కార్యాలయంలో సంప్రదించి సంబంధిత ఏటిఎస్ Automated Testing Station (ATS) దగ్గర fitness certificate పొందవచ్చు.
Q12: వాహన మిత్ర పథకం సంబంధించి 2023 లో వాహనం కలిగి వాహన మిత్ర పథకం ద్వారా ₹10,000 పొంది, ఇప్పుడు ఆ వాహనం అమ్మేసిన వారు అర్హులా?
ఈ సంవత్సరం పథకానికి అనర్హలు.

📌 మరిన్ని అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్ & వాట్సాప్ ఛానెల్ ను ఫాలో అవ్వండి.

Conclusion
AP వాహన మిత్ర పథకం 2025 డ్రైవర్లకు ఎంతో ఉపయోగకరమైన పథకం. ఆలస్యం చేయకుండా, అవసరమైన డాక్యుమెంట్స్‌తో కలిసి గ్రామ / వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి. మీ కుటుంబానికి సంవత్సరానికి ₹15,000 ఆర్థిక సాయం అందుతుంది.
Leave a Reply to schemesstudybizz Cancel reply