రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలలో 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు ఆర్ధికంగా అండగా నిలబడేందుకు “వై.యస్.ఆర్ చేయూత” పథకాన్ని ప్రారంభించింది. మధ్య వయస్సు
లోని మహిళలలు తమ కష్టాన్ని నమ్ముకొని, కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నడిపిస్తున్న, వారి చేతుల్లో
డబ్బు పెడితే పూర్తిగా వాళ్ళ కుటుంబం కోసం, ఆర్ధిక స్థితి గతులు మెరుగుపడచడం కొరకు వినియోగిస్తారని నమ్మి
మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘నవరత్నలలో ఒకటిగా “వై.యస్.ఆర్ చేయూత” పధకాన్ని
చేర్చి ఆగష్టు 12, 2020 నుండి అమలు చేయడం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసినదే.
ప్రతి సంవత్సరం రూ.18,750/-లు చొప్పున నాలుగేళ్ల పాటు మొత్తం రూ. 75,000/-లు ఆర్ధిక సహాయం
అందచేయడం జరుగుతుంది. అందులో భాగంగా అర్హత కల్గిన లబ్దిదారులందరికి గడిచిన మూడు సంవత్సరాలలో
మొదటి విడత 24 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ. 18,750/-ల చొప్పున రూ.4500 కోట్లు, రెండవ విడత నందు
24.95 లక్షల మందికి రూ.4679.46 కోట్లు, మూడవ విడత నందు 26.39 లక్షల లబ్దిదారులకు 4949.44 కోట్ల
రూపాయలు DBT పద్ధతి ద్వారా నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగింది. మొత్తం మూడు
విడతల్లో 26.39 లక్షల లబ్దిదారులకు రూ.14,129.11 కోట్లు జమచేయడం జరిగింది.
ఇందులో భాగంగా నాలుగవ విడత “వై.యస్.ఆర్ చేయూత పధకం” క్రింద, గౌరవ ముఖ్యమంత్రివర్యులు
ఫిబ్రవరి 2024, 5 వ తేదిన అర్హులైన లబ్దిదారులందరికి ఆర్ధిక సహాయ మొత్తమును మంజూరు చేయబోతున్నారు.
లబ్దిదారులకు అందబోయే చేయూత మొత్తాన్ని, వారు ఎలా వినియోగించుకుంటారనే విషయంలో ఎలాంటి
షరతులు లేవు . పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది.
చేయూత పొందిన లబ్దిదారులు ప్రభుత్వ ఆర్ధిక సహాయ మొత్తాన్ని పెట్టుబడిగా మార్చుకోవాలని కోరుకునే
వారికి, వ్యాపారం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కొరకు రిలయన్స్, HUL, P&G, ITC, అమూల్
వంటి భారీ వ్యాపార సంస్థలతోనూ, మరియు అజియో టెక్స్టైల్స్, మహీంద్రా కేతి, గ్రామీణ వికాస కేంద్రం, కాల్గుడి,
Heifer, CSC వంటి సంస్థలతో ఒప్పందం చేసుకొని లబ్దిదారులను అనుసంధానం చేయడం ద్వారా వ్యాపార
రంగాలలో సహాయ సహకారాలు అందించడం, నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకే అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగినది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సిబ్బంది అందరూ, ప్రభుత్వం ఇవ్వబోయే నాలుగవ విడత వై.యస్.ఆర్ చేయూత మొత్తమును, అర్హత కల్గిన ప్రతి లబ్దిదారునికి తెలియచేసి, ఆసక్తి ఉన్న లబ్దిదారులకు జీవనోపాధిని ఏర్పాటు చేసుకొనే విధంగా, అవసరమగు సహాయ సహకారాన్ని అందించవలసి ఉంటుంది.
“వై.యస్.ఆర్ చేయూత పధకం ” నాలుగవ విడత కార్యక్రమం నందు చేయవలసిన పనులు :
YSR Cheyutha 4th Phase Timelines – వైయస్సార్ చేయూత విడత టైం లైన్స్
సం | విషయం | భాద్యత | టైమ్ లైన్స్ |
---|---|---|---|
1 | గ్రామ సచివాలయం లో అర్బన్ ఏరియా లో నివసిస్తున్న వారి ఇంటి పన్ను అస్సెస్స్మెంట్ నెం. మరియు విద్యుత్ మీటర్ రీడింగ్ నెం. అప్డేట్ చేయించుకోవడం | జి.యస్.డబ్లు.యస్ | 05.01.2024 |
2 | జిల్లా స్థాయిలో కుల దృవీకరణ లేని ప్రత్యేక కులాలకు చెందిన ( బుడగా జంగం, బెంతు వరియా, ఎనేటి కొండ, వాల్మీకి) లబ్దిదారులకు అర్బన్ ఏరియా లో నివసిస్తున్న వారి ఇంటి పన్ను అస్సెస్స్మెంట్ నెం. మరియు విద్యుత్ మీటర్ రీడింగ్ నెం. అప్డేట్ చేయించుకోవడం | జి.యస్.డబ్లు.యస్/ సెర్చ్ | 05.01.2024 |
3 | అర్హత కల్గిన చేయూత లబ్దిదారులు అప్లికేషన్స్ పూర్తి చేయడం (WEA/WWDs,MPDOs/MCs & EDs of concerned Corporations) | జి.యస్.డబ్లు. యస్ | 06.01.2024 |
4 | అర్హత ఉన్న లబ్ధిదారుల వివరాలను గ్రామ సచివాలయ వారీగా తెలియజేయడం | జి.యస్.డబ్లు. యస్ | 10.01.2024 |
5 | గ్రీవెన్స్ స్వీకరణ (గ్రామ సచివాలయం వారీగా) | జి.యస్.డబ్లు. యస్ | 10.01.2024 To 19.01.2024 |
6 | గ్రీవెన్స్ పరిశీలన మరియు పరిష్కరించడం | జి.యస్.డబ్లు. యస్ | 16.01.2024 To 21.01.2024 |
7 | అంతిమ అర్హులైన జాబితా విడుదల | జి.యస్.డబ్లు. యస్ | 22.01.2024 |
8 | అంతిమంగా అర్హులైన జాబితా ఆధారంగా కలెక్టర్ ల ఆమోద ప్రక్రియ | జి.యస్.డబ్లు. యస్ | 23.01.2024 |
9 | ప్రిన్సిపల్ సెక్రెటరీ వారి నుండి కార్పొరేషన్ వారీగా బడ్జెట్ మంజూరు చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి ఫైల్ పంపించడం | సెర్చ్ | 23.01.2024 |
10 | ప్రత్యేక గ్రామ సంఘ సమావేశాలు ఏర్పాటు చేసి చేయూత పథకం పై లబ్దిదారులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించడం | ఏ.పి.యం/సి.సి | 27.01.2024 To 04.02.2024 |
11 | చేయూత లబ్దిదారులు చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి Best Cases studies / Success Stories తయారు చేయడం మరియు Video Coverage చేయడం ( రిటైల్, టెక్స్టైల్, లైవ్ స్టాక్ మరియు ఇతర జీవనోపాధులు) | ఏ.పి.యం/సి.సి | 27.01.2024 To 04.02.2024 |
12 | నాలుగవ విడత చేయూత ప్రారంభోత్సవ కార్యక్రమం | రాష్ట్ర స్థాయి HODs | 05.02.2024 |
13 | అన్ని జిల్లా / మండల స్థాయిలలో నాలుగవ విడత చేయూత ప్రారంభోత్సవ కార్యక్రమాలు (చెక్కుల పంపిణీ ) | జిల్లా కలెక్టర్స్ /ప్రొజెక్ట్ డైరెక్టర్/ యం.పి.డి.ఓ/ ఏ.పి.యం | 06.02.2024 To 14.02.2024 |
Pre-Launching Activities
కమ్యూనిటీ కో ఆర్డినేటర్ :
- 27.01.2024 వ తేదీ నుండి 04.02. 2024 తేదీ వరకు Pre Launching Activities అన్నీ
గ్రామ సంఘాలలో తప్పక జరిపించాలి. - చేయూత లబ్దిదారుల వివరాలను గ్రామ సచివాలయం వారీగా తీసుకోవాలి.
- గ్రామ సచివాలయ పరిధిలోని లబ్దిదారులందరితో ప్రత్యేక గ్రామ సంఘం సమావేశం ఏర్పాటు
చేయాలి. - చేయూత పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరియు ఆవశ్యకత గురించి తెలియజేయాలి.
- ఫిబ్రవరి, 2024, 05 వ తేదీ నుండి 14, ఫిబ్రవరి, 2024 వరకు జరిగే చేయూత నాలుగవ విడత
కార్యక్రమం గురించి తెలియజేయాలి. - ఏదైనా కారణంతో దరఖాస్తు రిజెక్ట్ అయిన యెడల అందులకు అవసరమగు డాక్యుమెంట్స్ ఏమికావాలో తెలియజేసి, సంబంధిత సచివాలయం లో నమోదు చేసుకోవాలని తెలియజేయాలి.
- గడచిన మూడు సం. రాలలో లబ్ధి పొందిన లబ్దిదారులతో మాట్లాడి, మొబైల్ అప్లికేషన్ నందు నమోదు చేయబడి, వారు చేపట్టిన జీవనోపాధి కార్యక్రమాల గురించి, ఉపయోగించుకొన్న విధానం గురించి, తద్వారా వారి కుటుంబం ఆర్ధికం గా ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని చర్చించాలి.
- గ్రామ సచివాలయ వారీగా ఒకటి లేదా రెండు Best Case Studies / Success Stories తయారు చేయాలి మరియు వారిని Launching కార్యక్రమాలలో మాట్లాడేటట్లు సిద్ధం చేయాలి.
మండల స్థాయిలో APM చేయవలసిన పనులు:
- 27.01.2024 వ తేదీ నుండి 04.02.2024 వ తేదీ వరకు Pre Launching Activities అన్నీ
గ్రామ సంఘాలలో తప్పక కమ్యూనిటీ కో ఆర్డినేటర్ సమక్షంలో జరిపించాలి. - గ్రామ సంఘం లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి, సక్రమంగా
జరిగేలా చూడాలి. - గ్రామ సంఘం వారీగా Best Case Studies / Success Stories సేకరించి, మంచి ఫోటోలతో వాటిని డాక్యుమెంటరీ రూపంలో తయారుచేయాలి.
- అన్ని రకాల జీవనోపాదులపై, కంపెనీల, సంస్థల అనుసంధానం గురించి Case Studies వచ్చే
విధంగా చూసుకోవాలి. - చేయూత రాక ముందు వారి జీవన విధానం, చేయూత లబ్ది పొందిన తరువాత వారు చేపట్టిన
జీవనోపాదుల వల్ల పెంపొందిన ఆర్ధిక సాధికారత గురించి అవగాహన కల్పించాలి.
జిల్లా స్థాయిలో DPM చేయూత వారు చేయవలసిన పనులు:
- Pre Launching Activities జరుగుతున్న సమయంలో కనీసం 1/3 వంతు గ్రామ సంఘాలలో
అయిన మండల ఏ. పి. యం హాజరు అయ్యే విధంగా చూడాలి. - DPM చేయూత వారు ఈ కార్యక్రమం మొత్తాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి.
- నిర్దేశించిన టైం లైన్స్ లోపు కార్యక్రమాలు అన్ని మండలాలలో, అన్ని గ్రామ సచివాలయాల్లో పూర్తి
అగు విధముగా చూసుకోవాలి. - CC/APM_లకు కావలసిన క్లారిటీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తి
చేయవలెను. - Best Case Studies / Success Stories సేకరించి, అట్టి వివరాలను CEO, SERP వారికి
మెయిల్ ద్వారా తెలియజేయాలి.
ప్రాజెక్ట్ డైరెక్టర్ DRDA వారు చేయవలసిన పనులు:
- ప్రతి రోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తూ ప్రగతిని రివ్యూ చేయాలి,
- మండల స్థాయిలో ఆమోదం తెలుపక పెండింగ్ లో ఉన్న లబ్దిదారుల వివరాలను MPDO గారితో
మాట్లాడి Approval ఇప్పించాలి. - ఫీల్డ్ స్థాయిలో ఉన్న సమస్యలను గ్రామ వార్డు/సచివాలయ డిపార్ట్మెంట్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిష్కరించుకోవాలి.
- Time Lines ప్రకారంగా చేపట్టే అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగేటట్లు సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడం.
- DPM చేయూత వారికి pre launch నుండి Post launch కార్యక్రమాలు పూర్తి అయ్యేవరకు
వెహికల్ ప్రొవిజన్ ఇవ్వవలెను
YSR Cheyutha Launching Programme:
ఫిబ్రవరి, 05, 2024 వ తేదీన గౌరవ ముఖ్యమంత్రివర్యులు చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో
వై.యస్.ఆర్ చేయూత పధకం నాలుగవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదే
విధంగా మండలాలలోని RBK కేంద్రాలలో అందరూ చేయూత లబ్దిదారులు ఈ కార్యక్రమాన్ని
వీక్షించడం అవకాశం కల్పించడం జరుగుతుంది.
Post Launching Activities:
జిల్లా స్థాయిలో చేపట్టే కార్యక్రమాలు :
- అన్ని జిల్లాలలో మండలాల వారీగా గౌరవ శాసన సభ్యుల వారి అనుమతితో ముందుగానే తేదీలు
ఖరారు చేసుకొని, ప్రణాళికలు రూపొందించి గౌరవ శాసన సభ్యులు మరియు స్థానిక ప్రజా
ప్రతినిధులు హాజరు అయ్యే విధంగా చూడాలి. - వై.యస్.ఆర్ చేయూత నాలుగవ విడత సంబరాలు 06, ఫిబ్రవరి, 2024 నుండి 14, ఫిబ్రవరి, 2024 వ తేదీ వరకు జరిగే విధంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- చేయూత పధకాన్ని సద్వినియోగం చేసుకొని జీవనోపాధి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని,
ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకున్న లబ్ధిదారులను గుర్తించి, వారితో ఆయా మండలాలో జరిగే
కార్యక్రమాలలో మాట్లాడించాలి. - ఈ కార్యక్రమాలు సక్రమంగా జరిగే విధంగా పధక సంచాలకులు, డి.ఆర్.డి.ఏ మరియు డి.పి.యం
చేయూత వారు పర్యవేక్షించాలి.
మండల స్థాయిలో చేపట్టే కార్యక్రమాలు
- 06, ఫిబ్రవరి, 2024 నుండి 14, ఫిబ్రవరి, 2024 వ తేదీ వరకు గౌరవ శాసన సభ్యుల
ఆధ్వర్యంలో వారు నిర్దేశించిన తేదీలకు అనుగుణంగా మండల స్థాయి ప్రజాప్రతినిధులతో నాలుగవ
విడత వై.యస్.ఆర్ చేయూత కార్యక్రమాలను పండగ వాతావరణంలో లబ్దిదారులు అందరితో
కలిసి నిర్వహించాలి. సంబంధిత ఏరియా కో ఆర్డినేటర్ వారు భాద్యత వహించాలి. - గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సందేశం (HCM లెటర్) చదివి వినిపించాలి మరియు వాలంటీర్ల
సహాకారంతో లబ్దిదారులందరికి అందజేయాలి. - చేయూత పధకం Success Stories సంబందించిన HCM Video Clippings ప్రదర్శించాలి.
చేయూత లబ్దిదారులు ఏర్పాటు చేసిన జీవనోపాధుల ద్వారా “ఏ రకంగా వారి జీవితాలు
మారాయో, ఏ విధంగా ఆర్ధిక పురోగతి సాధించారో” వారి మాటల్లో విజయ గాధలను చెప్పించాలి. - లబ్దిదారులకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న HUL, P&G, ITC, అమూల్ వంటి వ్యాపార
సంస్థలతోనూ, మహీంద్రా కేతి, గ్రామీణ వికాస కేంద్రం, కాల్గుడి, Heifer, CSC వంటి సంస్థలతోనూ మరియు ఇతర ఒప్పంద సంస్థలతో అనుసంధానం కల్పించి వారి కుటుంబఆదాయలను పెంచుకొనే మార్గాలను తెలియజేయాలి. - Best Case Studies / Success Stories సేకరించి, డాక్యుమెంటరీ తయారు చేయాలి.
- జీవనోపాధులు ఏర్పాటుకు ఆసక్తి కనబరచిన లబ్దిదారులను గుర్తించి, వారికి బ్యాంక్ మరియు స్త్రీనిధి, ఉన్నతి పధకాల ద్వారా ఋణ సదుపాయాలు కల్పన మరియు లైన్ డిపార్ట్మెంట్, MoU కంపెనీ లతో జీవనోపాధులు ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలి.
- కార్యక్రమం జరిగే ప్రదేశాలలో SHG సభ్యుల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ మరియు కంపెనీ పార్టనర్స్ తో స్టాల్స్ ఏర్పాటు మరియు గ్రౌండింగ్ చేసిన యూనిట్ల పంపిణీ (Assets Distribution) కార్యక్రమాన్ని చేపట్టాలి.
- లబ్దిదారులందరి నుండి Acknowledgment తీసుకోవడం మరియు ఏ జీవనోపాధి చేపడుతున్నారో అనే విషయాన్ని (Options) సేకరించాలి.
- ప్రతి మండలంలో చేయూత పధకాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. డయాస్, కుర్చీలు, టెంట్స్, సౌండ్ సిస్టమ్, బ్యానర్స్, బొకేలు, శాలువలు, LED స్క్రీన్, SHG ఉత్పత్తులు, కంపెనీ పార్టనర్స్ తో స్టాల్స్ ఏర్పాటు మరియు భోజన సదుపాయాలు మొదలైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.
పైన తెలిపిన కార్యక్రమాలను పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ చేసి, ఫోటో ఆల్బమ్ తయారు చేయాలి. పైన తెలిపిన కార్యక్రమాలు సక్రమంగా, భాద్యతయుతంగా నిర్వహించి నాలుగవ విడత వై.యస్.ఆర్ చేయూత పధకాన్ని విజయవంతం చేపట్టవలసినదిగా అందరు పధక సంచాలకులు డి.ఆర్.డి.ఏ, మరియు అదనపు పధక సంచాలకులు టి.పి.యం.యు వారిని కోరడమైనది.