తెలంగాణలో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రక్రియను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టును ప్రభుత్వం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎంపిక చేయబడిన గ్రామాల్లో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలను నిర్ధారించుకుంటారు.
పైలెట్ ప్రాజెక్టు కింద తొలిసారిగా ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు(Family Digital card) సంబంధించి ముఖ్యమంత్రి కింది విధంగా అన్నారు.
“సంక్షేమ పథకాల కోసం
ఇక పై ఏ పేదవాడు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ
తిరగాల్సిన అవసరం లేదు.
ఈ రోజు ప్రతిష్ఠాత్మక
ఫ్యామిలీ డిజిటల్ కార్డు
పైలెట్ పథకాన్ని ప్రారంభించాం.
వన్ స్టేట్ – వన్ కార్డ్ పేరుతో
ఈ పథకాన్ని అమలు చేస్తాం.
రేషన్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఇంబర్స్ మెంట్ సహా ప్రతి సంక్షేమానికి డిజిటల్ కార్డ్ గ్యారెంటీ ఇస్తుంది.
ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ కూడా
ఇదే కార్డులో పొందుపరుస్తాం.
మొత్తం 30 శాఖల ద్వారా జరిగే
సమస్త సంక్షేమ సమాచారం
ఈ కార్డులో నిక్షిప్తం చేస్తున్నాం. ”
ఈ పైలెట్ ప్రాజెక్టును అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 7 వరకు చేపట్టినన్నారు. ఓకే రాష్ట్రం ఓకే కార్డు విధానాన్ని ఈ కార్డు ద్వారా ప్రభుత్వం తీసుకువస్తుంది.
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక నెంబర్ తో ఈ కార్డు ఇవ్వరున్నారు. రేషన్ కార్డ్, రైతుబంధు, పింఛను తదితర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబ సభ్యుల వివరాలు గుర్తించారు.
కింది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ డేటాను నిర్ధారిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో ఇంటింటి పరిశీలన కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.
పూర్తి గ్రామీణ ప్రాంతాలు ఉన్న నియోజకవర్గంలో రెండు గ్రామాలు, పూర్తిగా పట్టణ నగర ప్రాంతాల్లో రెండు వార్డులు లేదా డివిజన్లో పైలెట్ ప్రాజెక్టు చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అధికార బృందాలు కుటుంబాలను స్వయంగా నిర్ధారించి మరణించిన వారి పేర్లను తొలగిస్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కుటుంబంలోని మహిళలు యజమానిగా పేర్కొనడం జరుగుతుంది. కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలను కార్డు వెనుక ప్రచురించనున్నారు. కుటుంబ సభ్యులంతా అంగీకరిస్తేనే కుటుంబ ఫోటో తీయాలని అది కూడా ఆప్షనల్ మాత్రమే ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. బ్యాంకు ఖాతాలు పాన్ కార్డు వంటి వివరాలు అడగవద్దని తెలిపారు.
పైలెట్ ప్రాజెక్టు డేటా అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది.