ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు వరాలను కురిపించారు. మైనారిటీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన కీలక ప్రకటనలు చేశారు.
మైనారిటీలకు సంబంధించి హజ్ యాత్ర చేసేవారికి ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణకు ఆర్థిక సహాయం, నూర్ భాషా లేదా దూదేకుల కు ప్రత్యేక కార్పొరేషన్ వంటి కీలక నిర్ణయాలు వెల్లడించారు. పూర్తి డీటెయిల్స్ మీకోసం.
మైనారిటీలకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన కీలక ప్రకటనలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మైనారిటీలకు సంబంధించి కింద ఇవ్వబడిన కీలక ప్రకటనలు చేయడం జరిగింది.
- ఆంధ్ర ప్రదేశ్ లో హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికులకు లక్ష రూపాయలు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు హజ్ వెళ్లాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
- నూర్ భాషా లేదా దూదేకుల సంఘం వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
- 2014-2019 మధ్య గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన మైనార్టీ సంక్షేమ పథకాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని ఆదేశాలు.
- మసీదుల నిర్వహణకు 5000 రూపాయలు.
- కడపలో మూసివేసిన హౌస్ హౌస్ లో తిరిగి ప్రారంభం.
- విజయవాడలో కొత్త హజ్ హౌస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇప్పటికే ఇమామ్ లకు ప్రతినెలా ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తున్న విషయం తెలిసిందే. ముస్లిం వధూవరులకు పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇవే కాకుండా పైన పేర్కొన్నటువంటి పథకాలతో పాటు సబ్సిడీ పై పలు రుణాలను అందించే పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.