ప్రపంచ సుందరి 2024 క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం

ముంబైలో 9 మార్చి 2024న జరిగిన మిస్ వరల్డ్ 2024 అందాల పోటీలలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన మోడల్ క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszková) టైటిల్ ను గెలుచుకున్నారు.

ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకునే ముందు, ఆమె గతంలో మిస్ చెక్ రిపబ్లిక్ 2022 కిరీటాన్ని పొందింది. ఈ నేపథ్యంలో క్రిస్టినా పిస్కోవా గురించిన బయోగ్రఫీ మరియు ఆసక్తికరమైన అంశాలు మీకోసం.

2024 ప్రపంచ సుందరి కిరీటం  అందుకుంటున్న పిస్కోవా

క్రిస్టినా పిస్జ్కోవా బయోగ్రఫీ [ Krystyna Pyszková Biography ]

పూర్తి పేరుక్రిస్టినా పిస్కోవా
డేట్ ఆఫ్ బర్త్ 19 జనవరి 1999
వృత్తి మోడల్, అందాల పోటీలలో పాల్గొనడం
ప్రసిద్ధి అందాల పోటీ టైటిల్ హోల్డర్, మిస్ వరల్డ్ 2024, మిస్ చెక్ రిపబ్లిక్ 2022
ఎత్తు (సుమారు.) సెంటీమీటర్లు- 181 సెం.మీ
మీటర్లలో- 1.81 మీ
అడుగుల్లో & అంగుళాలు- 5′ 11”
కంటి రంగులేత నీలం-బూడిద
జుట్టు రంగుబ్లాండ్(తెలుపు నలుపు కలయిక)
జాతీయత చెక్ రిపబ్లిక్
పుట్టిన ప్రదేశంTřinec, చెక్ రిపబ్లిక్
కాలేజ్/యూనివర్శిటీ• ప్రేగ్‌లోని చార్లెస్ విశ్వవిద్యాలయం,
• మేనేజ్‌మెంట్ సెంటర్ ఇన్స్బ్రక్
విద్యా అర్హతలు•చార్ల్స్ విశ్వవిద్యాలయంలో లా డిగ్రీ
• ఎంసీఏ కళాశాల లో మేనేజ్మెంట్
మతంక్రైస్తవ మతం

విన్నర్ మరియు రన్నర్ అప్

క్రిస్టినా పిస్జ్కోవా ఇతర ఆసక్తికరమైన విషయాలు [Interesting Facts about Krystyna Pyszková]

  • క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ 2024 టైటిల్ గెలుచుకున్న తర్వాత, ఈ ఘనతను సాధించిన రెండవ చెక్ రిపబ్లిక్‌ మహిళ గా అవతరించింది. 112 దేశాలకు చెందిన మహిళల ను నెట్టి ఈమె ప్రపంచ సుందరి టైటిల్ ను దక్కించుకుంది.

లెబనాన్ సుందరి యాస్మినా జైటౌన్ మిస్ వరల్డ్ 2024 ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆతిథ్య భారత దేశ కంటెస్టెంట్, సినీ శెట్టి 8 వ స్థానంతో సరిపెట్టుకుంది.

  • ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. తను ఎంతో కష్టపడి టైటిల్ ను గెలుచుకున్నట్లు పేర్కొన్నారు. తనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు సమాజానికి కూడా ఉపయోగ పడేలా చూస్తానని అన్నారు. పేద పిల్లల ఉన్నత చదువుకు సంబంధించి పాటుపడతానని ఆమె పేర్కొన్నారు.
  • ఈమె పేద పిల్లల కోసం టాంజానియా లో ఒక పాఠశాల ను నెలకొల్పారు.
  • సొంతంగా ఒక స్వచ్ఛంద సంస్థ క్రిస్టినా పిస్కో ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి సేవ చేస్తున్నారు.

అటు శారీరిక అందంతో పాటు మానసిక అందానికి కూడా ఈ ప్రపంచ సుందరి పెట్టింది పేరు అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!