Greenland: ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్ గురించి విన్నారా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం

గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఇది. ఈ ద్వీపం ఆర్కిటిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య నెలకొని ఉంది. ఇది డెన్మార్క్ రాజ్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన దేశం.

గ్రీన్ ల్యాండ్ విస్తీర్ణం : 836,000 చదరపు మైళ్లు (2.1 మిలియన్ చదరపు కిలోమీటర్లు)

జనాభా : 56000 మంది మాత్రమే ఈ ద్వీపం లో ఉంటారు

రాజధాని : న్యూక్

మీకు తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశమైన గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అత్యల్ప జనసాంద్రత కలిగిన దేశంగా కూడా గుర్తింపు పొందింది.

ఈ ద్వీపంలో దాదాపు 80 శాతం కంటే ఎక్కువ భూమి నిరంతరం మంచుతో మరియు అందమైన హిమాని నదాలతో కప్పి ఉంటుంది.

గ్రీన్లాండ్ అధికారిక భాష గ్రీన్లాండిక్, కానీ డానిష్ భాష కూడా ఇక్కడ చెల్లుతుంది. గ్రీన్‌ల్యాండ్ దేశం డెన్మార్క్ రాజ్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన భూభాగం. అయినా దీనికి స్వంత ప్రభుత్వం మరియు పార్లమెంటు కూడా ఉంది.

Greenland Parliament

అంటార్కిటికా తర్వాత ఒకేచోట అత్యదిక మంచు తో కప్పబడి ఉన్న ప్రాంతం గ్రీన్ ల్యాండ్. అయినప్పటికీ ఇది ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది.

గ్రీన్‌ల్యాండ్ దేశంలో ఉత్తర ధృవ జ్యోతులు పర్యాటకుల ను కనువిందు చేస్తుంటాయి. భారీ తిమింగలాలు, ఇతర సముద్ర జీవులను చూడటానికి ఇది ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. అందమైన హిమానినాదాలు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ

Northern lights in Greenland

గ్రీన్లాండ్ రాజధాని న్యూక్, ఇదే గ్రీన్లాండ్ దేశంలో అతిపెద్ద నగరం. ఈ నగరంలో సుమారు 17,000 మంది జనాభా నివసిస్తుంటారు. ప్రభుత్వం కూడా ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తుంది.

Nuuk streets

కేవలం 56,000 మంది జనాభా ఉన్నటువంటి ఇక్కడ 21 విమానాశ్రయాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. వీటిలో 5 ముఖ్యమైన విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో కాంగర్లుసువాక్ విమానాశ్రయం (SFJ) – ఇది గ్రీన్‌ల్యాండ్‌లోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం. Nuuk విమానాశ్రయం (GOH) – ఇది రాజధాని నగరం న్యూక్ లో ఉంది.

Kangerlussuaq Airport

గ్రీన్ ల్యాండ్ దేశం యొక్క నైసర్గిక స్వరూపం మరియు అది నెలకొని ఉన్న ప్రదేశం కారణంగా అక్కడ పగలు రాత్రులలో చాలా వ్యత్యాసం ఉంటుంది. మనదేశంలో లాగా అక్కడ ప్రతిరోజు సూర్యాస్తమయం మరియు సూర్యుడు ఉదయించడం ఉండదు. అక్కడ కొన్ని నెలలు అసలు సూర్యుడే కనపడుడు అంటే అతిశయోక్తి కాదు.

ఇది ఫ్రెండ్స్ గ్రీన్లాండ్ దేశానికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్.. మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి.


ఇది చదవండి: సూర్యుడు అసలు అస్తమించని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!