శ్రీ విజయ పురం భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని నగరం. దీని పాత పేరు పోర్ట్ బ్లెయిర్. శ్రీ విజయ పురం నగరం బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ద్వీపం యొక్క తూర్పు తీరంలో నెలకొని ఉంది.
శ్రీ విజయ పురం పేరు విశిష్టత
“శ్రీ విజయ పురం” అనే పధం సంస్కృతం నుంచి ఆవిర్భవించింది. సంస్కృతం లేదా తెలుగు భాషలో శ్రీ విజయ పురం అంటే విజయానికి చిహ్నంగా చెప్పవచ్చు. వలసవాద వారసత్వాన్ని ముగింపుగా మరియు మన స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీకగా దీని పేరు మార్చబడింది.
చారిత్రాత్మకంగా శ్రీ విజయ పురం వివిధ రాజ్యాలకు నావికా స్థావరంగా పనిచేసింది. అంతేకాకుండా స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఈ ప్రాంతం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటిసారిగా మన జాతీయ పతాకాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. వీర్ సావర్కర్ మరియు ఇతర స్వాతంత్ర్య సమరయోధులు స్వతంత్ర దేశం కోసం పోరాడిన సెల్యులార్ జైలు కూడా ఇక్కడే నెలకొంది.
శ్రీ విజయ పురం సిటీ ఏరియా
శ్రీ విజయ పురం నగరం మొత్తం వైశాల్యం 49 చదరపు కిలోమీటర్లు (18.9 చదరపు మైళ్ళు).
శ్రీ విజయ పురం నగర జనాభా
2024లో పోర్ట్ బ్లెయిర్ నగరం యొక్క ప్రస్తుత అంచనా జనాభా 152,000. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 140,572. అండమాన్ నికోబార్ దీవుల జనాభా దాదాపు 4.4 లక్షలు. అంటే జనాభాలో మూడింట ఒక వంతు మంది శ్రీ విజయ పురంలో నివసిస్తున్నారు అని చెప్పవచ్చు.
శ్రీ విజయ పురం వాతావరణం
శ్రీ విజయ పురం యొక్క వాతావరణం ఉష్ణమండల రుతుపవనాల కిందకు వస్తుంది, భారీ రుతుపవనాలు లేదా శీతాకాలం లేని పొడి కాలం ఉంటుంది.
శ్రీ విజయ పురం నగరంలో మాట్లాడే భాషలు
శ్రీ విజయ పురం నగరం వివిధ భాషలు మాట్లాడే ప్రజలకు నెలవు.శ్రీ విజయ పురంలో మాట్లాడే భాషలు ప్రధానంగా బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళం.