Countries without Night : భూమి పై సూర్యుడు అస్తమించని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా? ఈ ప్రాంతాల్లో రాత్రి అనేదే ఉండదు

అనంత విశ్వం లో మన భూమి ఒక్కటే మనకు తెలిసి జీవం ఉన్న ఏకైక గ్రహం, ఈ భూమి మనం ఊహించని ఎన్నో వింతలు విశేషాలకు నెలవు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఈ భూమి నిరంతరం సూర్యుని చుట్టూ అదే విధంగా తన చుట్టూ తాను భ్రమిస్తూ ఉంటుంది. దీని వలనే మనకు పగలు రేయి ఏర్పడతాయి. ఇది భూమి పై సహజంగా ఉండే దినచర్య.

అయితే చీకటి ఎరుగని ప్రాంతాలు కూడా ఈ భూమి పై ఉన్నాయి అంటే నమ్ముతారా? వినడానికి విచిత్రంగా ఉన్నా నమ్మి తీరాలి.

చీకటి ఎరుగని ప్రాంతాలు, దేశాలు ఇవే

భూమి పై వైవిధ్య భౌగోళిక స్థితి మరియు అవి ఉన్న ప్రదేశాల ఆధారంగా పలు దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు సూర్యుడు అస్తమించడు..అంటే ఆ ప్రాంతాల్లో చీకటి పడదు. మరి అటువంటి ప్రాంతాలు మన భూమి పైన ఎక్కడ ఉన్నాయి ఏ దేశాల్లో ఉన్నాయో ఒక సారి చూసేద్దాం.

నార్వే: ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉన్న ఓ దేశం నార్వే, దీనినే ల్యాండ్ ఆఫ్ ది మిడ్‌నైట్ సన్ అంటారు. అంటే అర్థరాత్రి సూర్యుడు ప్రకాశించే నెల అని అర్థం. మరి పేరుకు తగ్గట్టే ఈ దేశంలో మే నుండి జూలై చివరి వరకు అనగా సుమారు 76 రోజుల పాటు ఇక్కడ సూర్యుడు అస్తమించడు. ఈ ప్రాంతం మొత్తం సాధారణంగా నే సూర్యుడు రోజులో 20 గంటలు ప్రకాశిస్తాడు.. నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో అనే ప్రాంతంలో అయితే, ఏప్రిల్ 10 నుండి ఆగస్టు 23 వరకు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తునే ఉండటం మరో అద్భుతం. రాత్రి లేని రోజులను గడపాలనుకుంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.


ఐస్‌ల్యాండ్: మరొక దేశం ఐస్లాండ్. గ్రేట్ బ్రిటన్ తర్వాత యూరప్‌లో అతిపెద్ద ద్వీప దేశమే ఈ ఐస్లాండ్.
ఐస్లాండ్ లో అయితే, మే 10 నుండి జూలై వరకు నిరంతర సూర్యరశ్మి ని పొందవచ్చు. ఇక్కడ సూర్యుడు అన్ని వేళల్లో పొద్దు పొడిచే రేఖ వద్దే కనిపిస్తాడు (horizon).


కెనడా: ప్రపంచంలోని రెండవ అతిపెద్ద దేశం, కెనడాలోని అనేక ప్రాంతాలు ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇనువిక్ మరియు వాయువ్య భూభాగాలలో, వేసవిలో సుమారు 50 రోజుల పాటు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తాడు.

అలాస్కా: లిస్ట్ లో తర్వాత చెప్పుకోవాల్సిన ప్రాంతం అలాస్కా, ఈ దేశంలో మే చివరి నుంచి జూలై చివరి వరకు సూర్యుడు అస్తమించడు. అందమైన హిమానీనదాలు మరియు మంచుతో కప్పబడిన పర్వతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి; తెల్లవారుజామున 2 గంటలకు ఆ అందమైన పర్వతాలు మంచుతో మెరిసిపోతుండటం మీరు ఇక్కడ చూడవచ్చు.

స్వీడన్: పైన పేర్కొన్న ఇతర దేశాలతో పోలిస్తే సాధారణంగా ఈ దేశం వేడిగా ఉంటుంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులు నెల నెల కు భారీగా మారిపోతుంటాయి. స్వీడన్‌లో సాధారణంగా మే ప్రారంభం నుండి ఆగస్టు చివరి వరకు సూర్యుడు అర్ధరాత్రి అస్తమించి, ఉదయం 4:30 గంటలకు మళ్లీ ఉదయిస్తాడు.అంటే రోజులో చాలా వరకు సూర్య కాంతి ఉంటుంది. జనవరలో అయితే చాలా వరకు చీకటే ఉంటుంది. స్వీడన్ కి మీరు జూన్ లో వెళ్ళినట్లైతే ఆ సమయంలో నిరంతరం సూర్య కాంతి ఉంటుంది.

ఫిన్లాండ్: వేల సరస్సులు మరియు ద్వీపాల భూమి, ఫిన్లాండ్‌. ఈ దేశం లోని చాలా ప్రాంతాలు వేసవిలో 73 రోజుల పాటు చీకటిని చూడవు. ఉత్తర ధృవ జ్యోతుల కాంతులు ఈ దేశంలో మనకు ప్రత్యేకంగా దర్శనమిస్తాయి.

ఇవే కాకుండా రష్యా వంటి కొన్ని దేశాల్లో కూడా ఈ విధంగా అర్థరాత్రి సూర్యుడు కనిపించే ప్రాంతాలు ఉన్నాయి. ఏది ఏమైనా మనం నివసిస్తున్న భూమి పై మన ఊహకి అందని అద్భుతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి..మరిన్ని ఇలాంటి GK Facts , తదుపరి ఆర్టికల్స్ లో తెలుసుకుందాం.


GK Facts by studybizz.com ద్వారా పబ్లిష్ చేయబడిన ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లతే కింద కామెంట్ రూపంలో feedback తెలియజేయగలరు.

This article is written and presented by studybizz.com

One thought on “Countries without Night : భూమి పై సూర్యుడు అస్తమించని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా? ఈ ప్రాంతాల్లో రాత్రి అనేదే ఉండదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!