నాటు నాటు పాట అభిమానులకు ఇక పండగే.. అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది.
తొలిసారిగా ఒక భారతీయ చిత్రానికి మరియు తెలుగు సినిమాకి ఈ ఖ్యాతి దక్కింది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి లో నాటు నాటు కి ఈ అవార్డు దక్కింది. ఇందులో పోటీ పడిన ‘అప్లాజ్’ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్ మావెరిక్) పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటు..’ ఆస్కార్ దక్కించుకుంది.
ఆస్కార్ స్టేజ్ పై ఆర్ఆర్ఆర్ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అవార్డును అందుకున్నారు. తద్వారా ఆస్కార్ గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్, తొలి భారతీయ గీతంగా ‘నాటు నాటు’ చరిత్ర సృష్టించాయి. భారతీయ చలనచిత్ర రంగంలో తొలిసారిగా ఒక తెలుగు పాటతో ఆస్కార్ అందుకోవటం తెలుగు వారందరికీ గర్వకారణం.