Electricity Saving: వేసవి కాలం వచ్చేసింది..మీ విద్యుత్  బిల్ ఆదా చేసుకోండిలా..టాప్ 5 టిప్స్

వేసవికాలం వచ్చేసింది..మరి వేసవికాలం వచ్చిందంటే మనకి ముందుగా భయపెట్టేది విద్యుత్ బిల్లులు..అయితే చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన మనం అన్ని కాలాలలో విద్యుత్ బిల్లును చక్కగా తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని టిప్స్ ఇక్కడ మీకోసం ఇవ్వడం జరిగింది. మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఫాలో అవ్వండి.

Tip 1 : ముందుగా మీ ఇంట్లో బల్బులను LED బల్బులుగా మార్చండి.

ఇప్పటికీ చాలామంది మధ్యతరగతి లేదా పేదవారి ఇళ్లల్లో 60 క్యాండిల్ బల్బులు 40 క్యాండిల్ బల్బులు వాడుతుంటారు. మీరు ముందుగా చేయాల్సింది ఎల్ఈడి బల్బులు కు మారడం. ఎల్ఈడి బల్బులు సాధారణంగా విద్యుత్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించేస్తాయి. ఇందులో కూడా ఎనర్జీ ఎఫిషియన్ స్టార్ రేటింగ్ ఉన్న బల్బులు కూడా ఉంటాయి. 4 లేదా 5 స్టార్ ఉన్న బల్బులు చాలా తక్కువ కరెంట్ ను వినియోగిస్తాయి.

Tip 2 : సహజసిద్ధమైన కాంతి, గాలి వినియోగించుకోండి. అవసరం లేనప్పుడు ఫ్యాన్స్ , లైట్స్ ఆఫ్ చేయాలి.

మీరు AC వినియోంచని సమయంలో లేదా ఉదయం 6 నుంచి 10 లోపు ఇంట్లో కిటికీలు గాని డోర్స్ కానీ ఉన్నట్లయితే, వాటిని తెరిచి సహజ సిద్దమైన కాంతి , గాలి ఇంట్లోకి వచ్చేలా చూసుకోండి. ఈ విధంగా కొంతమేర మీరు బల్బుల మీద ఆధారపడటం తగ్గుతుంది.అవసరం లేనప్పుడు లైట్స్ మరియు ఫ్యాన్స్ , ఇతర పరికరాలు స్విచ్ ఆఫ్ చేయండి. సహజమైన గాలి ప్రసరిస్తే వెంటిలేషన్ కూడా పెరుగుతుంది. మీకు ఫ్యాన్ తక్కువ  స్పీడ్ లో పెట్టినా మంచి గాలి వస్తుంది. మీ విద్యుత్ బిల్లు కూడా ఆదా అవుతుంది. అధ్యయనాల ప్రకారం విద్యుత్ బిల్లు లో 12% లైట్స్ వలనే వస్తుంది.

Tip 3 : AC వాడుతున్నారా..అయితే ఇలా చేయండి.

Air Conditioner/ ఏసి లు వాడేటప్పుడు మాత్రం మీ ఏసి ఉన్న గది కిటికీలు , తలుపులు గ్యాప్ లేకుండా మూసి వేయాలి. లేదంటే బయట ఉష్ణోగ్రత మీ గది లో కి ప్రసరిస్తే, గది చల్లబడెందుకు మరింత సమయం పడుతుంది. తద్వారా కరెంట్ ఎక్కువ కాలుతుంది. అంతే కాదు, ఏసి ని 24 నుంచి 28 డిగ్రీల మధ్య వాడితే చల్లదనం తో పాటు బిల్ కూడా ఆదా అవుతుంది. మీరు తగ్గించే ప్రతి 1 డిగ్రీ ఉష్ణోగ్రత కు 6% వరకు విద్యుత్ ఎక్కువ వినియోగించ బడుతుంది. అంతేకాకుండా రాత్రి పూట మీ ఏసీ ని రెండు లేదా మూడు గంటలు ఆన్ చేసి ఆ తర్వాత ఆఫ్ చేసినా మీ బెడ్ రూమ్ అంతా తెల్లారే వరకు చల్లగానే ఉంటుంది.

Tip 4 : ఫ్రిడ్జ్ వాడుతున్నారా ? అయితే ఎలా వాడాలో చూడండి

Fridge లోపల ఉండే cooling మరియు ఫ్రీజర్ లెవెల్స్ ను సీజన్స్ ను బట్టి మార్చుకోవాలి. వేసవి కాలంలో ఎక్కువ ఉంచినా మిగిలిన కాలాలలో తగ్గించుకుంటే బెటర్.

ఇక ఫ్రిడ్జ్ లో మీరు తక్కువ ఐటమ్స్ పెట్టినా పూర్తి సామర్థ్యంతో పని చేస్తుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లో ఎన్ని ఎక్కువ ఐటమ్స్ పెడితే అంత బెటర్.

ఎప్పటికప్పుడు ఐస్ 1/4 ఇంచ్ పెరిగినప్పుడు defrost అంటే తొలగించుకోవడం మంచిది.

Tip 5 : మీరు కొనే అన్నీ ఎలక్ట్రిక్ వస్తువులు BEE 5 స్టార్ రేటింగ్ ఉండేలా చూసుకోండి.

మనం ఉపయోగించే ఫ్రిడ్జ్, AC , వాషింగ్ మిషన్, LED బల్బ్ ఇలా చాలా పరికరాలు ఇటీవలి కాలంలో BEE rating 1 నుంచి 5 స్టార్ తో అమ్ముతున్నారు. 5 స్టార్ రేటింగ్ ఉన్నవి కొనుక్కుంటే మనకి తక్కువ విద్యుత్ తీసుకొని కరెంట్ బిల్ గణనీయంగా తగ్గుతుంది.

వీటితో పాటు చిన్న చిన్న జాగ్రత్తలు తీసకున్నట్లయితే మీ విద్యుత్ ను మరింత ఆదా చేసుకోవడం ఈజీ అవుతుంది. మీ ఇంట్లో ల్యాప్తాప్, కంప్యూటర్ వంటివి ఉంటే, వాటిని అవసరం లేనప్పుడు ఆఫ్ చేస్తే త్వరగా బ్యాటరీ అయిపోదు. అదే విధంగా నైట్ మొత్తం మొబైల్ కి చార్జింగ్ పెట్టడం కంటే అవసరమైనంత సమయం పెట్టుకుంటే బెటర్.

ఈ టిప్స్ అన్నీ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఫాలో అవ్వండి. మీ ఫీడ్ బ్యాక్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!