రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ మహిళలకు అందించేటటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 2023 అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి.
కొత్త అప్లికేషన్స్ తో పాటు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ కూడా సచివాలయాల స్థాయిలో ప్రారంభమైంది.
వైయస్సార్ చేయూత 2023 ముఖ్యమైన సూచనలు [YSR Cheyutha 2023 Important Instructions]
సెప్టెంబర్ లో విడుదల కానున్న ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరియు సచివాలయ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఆదాయం మరియు కుల దృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం లబ్ధిదారులు ఇప్పటినుంచి ఏపీ సేవ అనగా సచివాలయంలో ఉన్నటువంటి ఏపీ సేవా పోర్టల్ ద్వారా ఈ సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అదేవిధంగా పాత లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసింది. పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ కోసం గతంలో సచివాలయం ఏపీ సేవా పోర్టల్ ద్వారా జారీ చేయబడినటువంటి సర్టిఫికెట్లు ఉంటే సరిపోతుంది. లేదా సచివాలయాల ద్వారా రి ఇష్యూ చేయబడినటువంటి సర్టిఫికెట్లు ఉన్న సరిపోతుందని వెల్లడించింది. ఇందుకోసం లబ్ధిదారులు కొత్తగా మరల ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నటువంటి వారు మాత్రం వీటిని దరఖాస్తు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించిన సమగ్ర సమాచారం
వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించినటువంటి అర్హతలు, అప్లికేషన్ విధానం, కావలసిన డాక్యుమెంట్స్ మరియు శాంపిల్ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా కింది లింక్స్ ద్వారా పొందవచ్చు
అదేవిధంగా మీ అప్లికేషన్ స్టేటస్ ని కూడా చెక్ చేయవచ్చు