వైస్సార్ బీమా సర్వే 2023-24 సమాచారం | YSR Bima Survey 2023-24 Information

వైస్సార్ బీమా సర్వే 2023-24 సమాచారం | YSR Bima Survey 2023-24 Information

ఏపీ ప్రభుత్వం పేదల కోసం, అసంఘటిత రంగ కార్మికుల కోసం వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఉచితంగానే బీమా పొందొచ్చు. 18 నుంచి 70 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఇందులో చేరొచ్చు. కుటుంబ పెద్ద సహజ మరణం పొందినా లేదంటే ప్రమాదవశాత్తు మరణించినా బీమా పరిహారం అందేలా వైఎస్సార్ బీమా పథకాన్ని తీర్చిదిద్దారు. ఈ పథకానికి సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగాగ్రామ వార్డు సచివాలయ శాఖ అమలుపరిచే ఏజెన్సీగా పని చేస్తాయి. 

  • సహజంగా మరణించిన వారికి 30.06.2023 న, ప్రమాదవశాత్తు మరణించిన వారికి 15-07-2023 నాటి వరకు ఈ పథకం అమలు కానుంది. 
  • సాధారణ మరణము ద్వారా మరణించిన వారికి జులై 1 2023 నుండి ప్రమాదవశాత్తు మరణించిన వారికి జులై 16 2023 నుండి ఈ పథకం మరల ప్రారంభం అవుతుంది.

వైఎస్ఆర్ భీమా పథకం 2023-24 సంవత్సరానికి గాను కొన్ని నిబంధనలు ఇవ్వడం జరిగింది.

  1. 18 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండి సహజంగా మరణిస్తే, ఆ వ్యక్తి యొక్క నామినీకి లక్ష రూపాయలు నగదును డైరెక్ట్ గా ప్రభుత్వం నుండి అందిస్తుంది.
  2. 18 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండి ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత వికలాంగులుగా మారిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా పేమెంటు అందించడం జరుగుతుంది. ప్రజల తరపున ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు లేబర్ డిపార్ట్మెంట్ వారు సంవత్సరపు ప్రీమియంను కట్టడం జరుగుతుంది.

ముందుగా జరిగిన సర్వేలో ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిని తప్పుగా నమోదు చేసిన వారు మార్చుకోవడానికి , 15.07.23 నాటి వరకు అవకాశం కలదు. వయసు రిత్యా వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి ప్రమాదవశాత్తు మరణించిన వారి ఇన్సూరెన్స్ కు అనర్హులైన వారిని మార్చుకునేందుకు , BPL కుటుంబాలలో ప్రాథమిక సంపాదించే వారిని జోడించడం లేదా అప్డేట్ చేయడం,eKYC చెయ్యటం కోసం మరలా డోర్ టు డోర్ సర్వే చేయవలసి ఉంటుంది.

Table of Contents

Latest Updates

వైఎస్ఆర్ బీమా సర్వే 2023-24 కి సంబంధించి ఇంకా 3.5 లక్షల రెన్యువల్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్న కారణంగాఎన్రోల్మెంట్ గడువును 18వ తేదీ వరకు పొడిగించడం జరిగింది.

17/06/2023

వైఎస్ఆర్ భీమా (renewal/new enroll) నమోదుకు 13-06-2023 తేదీ వరకు పొడిగింపు.ప్రతీ రోజు నైట్ మరియు మధ్యాహ్నం 1.00 గం నుండి 2.30 వరకు dashboard updation చేయడం జరుగుతుంది. వలసలు / వేరే ప్రదేశాలలో వున్న వారికి మరియు OTP రానీ వారికి ఈ నెల 13వ తేదిన WEA యొక్క authentication ద్వారా అటువంటి వారికి బీమా నమోదు చేసే విధంగా option provide చేయడం జరుగుతుంది. కావున,, ఈ నెల 13 వ తేది లోపు భీమా నమోదు 100% పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోగలరు.

Update on – 10/6/2023

BOP App & Bima Renewal app కి సంబందించి GSWS DataBase లో వున్న వాలంటీర్స్ అందరికి BOP & Bima apps నందు login update చేయడం జరిగింది.

02/06/2023

వైఎస్ఆర్ భీమా 2023-24 పథకానికి సంబంధించి రెన్యూవల్ మరియు కొత్త అప్లికేషన్ నమోదు చెయ్యడానికి వాలంటీర్లకు YSR Bima App లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సర్వే పూర్తి చెయ్యడానికి జూన్ 7వ తేదీ వరకు అవకాశం.

వైఎస్సార్ భీమా 2023-24 వాలంటీర్ సర్వే చేయు విధానం

Step 1 : ముందుగా గ్రామ వార్డు వాలంటీర్లు YSR BIMA RENEWAL APP డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ కింద ఇవ్వడం జరిగింది. మొబైల్ అప్లికేషన్ ఎప్పటికీ అప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కావున కింద లింక్ ఉపయోగించి అప్డేట్ అయినటువంటి మొబైల్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Note : అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసే సమయంలో “This APK file might contain unsafe content. Make sure you trust the sender before you open and install it” అని వస్తే అప్పుడు Open పై క్లిక్ చేయాలి. Do you want to install this app? అని వస్తే అప్పుడు Install పై క్లిక్ చేయాలి. Unsafe app blocked అని వస్తే అప్పుడు More Details పై క్లిక్ చేయాలి. తరువాత Install anyway అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత అన్ని పర్మిషన్లు ఇవ్వాలి. 

Step 2 : మొబైల్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ పేజీలో వాలంటీర్ వారి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి టిక్ చేసి Biometric / Irish / FACE ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వాలి.

Note : వాలంటీర్లు అందుబాటులో లేకపోతే సచివాలయ ఉద్యోగి తన యొక్క ఆధార్ నెంబర్ తో అప్లికేషన్లో లాగిన్ అయ్యే అవకాశం ఉంది.

Step 3 : లాగిన్ అయిన తరువాత Home పేజీలో Renewal పై క్లిక్ చేయాలి. అప్పుడు పాలసీదారుని పేరు, రైస్ కార్డు నెంబరు వివరాలు చూపిస్తాయి.

Step 4 : Renewal List లొ రైస్ కార్డు నెంబర్ పై క్లిక్ చేసిన తరువాత “ఎంచుకున్నా పాలసీదారుని వివరాలు” చూపిస్తుంది. అందులో ఉండే వివరాలు

  • రైస్ కార్డు నెంబరు
  • పాలసీదారుని ఆధార్ నెంబరు
  • పాలసీదారిని పేరు
  • పాలసీదారిని స్టేటస్

whether policy holder is a bread Earner or not ? అంటే పైన చూపిస్తున్న పాలసీదారుడు వారి కుటుంబంలో ప్రధాన సంపాదన వ్యక్తా కాదా అని అర్థం. ఆ కుటుంబం వారిపై ఆధారపడి బ్రతుకుతుందా లేదా అని అర్థం వస్తుంది. తరువాత పాలసీదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Consent పై టిక్ చేసి eKYC తీసుకోవాలి. eKYC ను బయోమెట్రిక్ / ఐరిష్ / Face / OTP ద్వారా చేయువచ్చు.

Step 5 : eKYC పూర్తి అయిన తరువాత మిగిలిన వివరాలు చూపిస్తుంది అనగా

  • రైస్ కార్డు నెంబరు
  • పాలసీదారుని ఆధార్ నెంబరు
  • పాలసీదారుని పేరు
  • పాలసీదారుని తండ్రి లేదా భర్త పేరు
  • పాలసీదారుని Date Of Birth (DD/MM/YYYY)
  • పాలసీదారుని లింగము
  • పాలసీదారుని కులము
  • పాలసీదారిని ఉపకులము
  • పాలసీదారుని వృత్తి
  • పాలసీదారిని వృత్తి రకము
  • జిల్లా
  • మండలము
  • గ్రామ సచివాలయం

పాలసీదారుని వివరాములలో పాలుసీదారును వృత్తి Building And Other Construction Workers అని సెలెక్ట్ చేసుకుంటే Whether Enrolled In Building And Other Construction Workers Board? అనే ప్రశ్న చూపిస్తుంది. అంటే సంపాదించే వ్యక్తి బిల్డింగు మరియు ఇతర సముదాయాల మేస్త్రి / వర్కర్ అయితే వారు లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని అర్థము. రిజిస్ట్రేషన్ చేసుకుంటే YES అని చేసుకోకపోతే NO అని సెలెక్ట్ చేయాలి.

పై వివరాలు అన్నీ కూడా సరి అయినవి అయితే అవును అని సెలెక్ట్ చేయాలి సరిగా లేకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. సరి అయినవి అయితే అవును సెలెక్ట్ చేసి Continue పై క్లిక్ చేయాలి. సరి అయినవి కాకపోతే కాదు అని సెలెక్ట్ చేసి వివరాలను మార్చుకునే అవకాశం ఉంటుంది. తరువాత Continue పై క్లిక్ చేయాలి.

Step 7 : తరువాతి సెక్షన్లో నామిని యొక్క వివరాలు చూపిస్తాయి. అనగా

  • నామిని ఆధార
  • నామిని పేరు
  • నామిని Date Of Birth (DD/MM/YYYY)
  • నామిని లింగము
  • నామిని సంబంధం
  • నామిని మొబైల్ నెంబర్
  • నామిని కులము
  • నామిని ఉపకులము
  • నామిని వృత్తి
  • నామిని వృత్తి రకము

నామిని వివరాములలో వృత్తి Building And Other Construction Workers అని సెలెక్ట్ చేసుకుంటే Whether Enrolled In Building And Other Construction Workers Board? అనే ప్రశ్న చూపిస్తుంది. అంటే సంపాదించే వ్యక్తి బిల్డింగు మరియు ఇతర సముదాయాల మేస్త్రి / వర్కర్ అయితే వారు లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని అర్థము. రిజిస్ట్రేషన్ చేసుకుంటే YES అని చేసుకోకపోతే NO అని సెలెక్ట్ చేయాలి.

తరువాత నామిని బ్యాంకు వివరాలు చూపిస్తాయి. అనగా

  • బ్యాంకు పేరు
  • బ్యాంకు బ్రాంచ్
  • బ్యాంకు IFSC కోడ్
  • అకౌంట్ నెంబరు

నామిని వివరాలు మార్చాలి అనుకుంటే “నామిని యొక్క డీటెయిల్స్ ని మార్చుకోవాలి అనుకుంటున్నారా?” అనే ప్రశ్నలో అవును సెలెక్ట్ చేసి మార్పులు చేయాలి. లేకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. పై వివరాలు అన్నీ కూడా సరి అయినవి అయితే నామినీకు సంబంధించి eKYC ను తీసుకోవాలి. eKYC కొరకు బయోమెట్రిక్ / ఐరిష్ / Face / OTP లొ ఏ ఒక్కటి ఉన్నా eKYC పూర్తి అవుతుంది. తరువాత Continue పై క్లిక్ చేయాలి.

Step 8 : వివరాలు అన్నీ సబ్మిట్ చేసిన తరువాత చివరగా వాలంటీర్ వారి Authentication అడిగగుతుంది. వాలంటీర్ వారు బయోమెట్రిక్ వేసిన తరువాత Data Saved Successfully అనే సందేశం వస్తుంది. 

Step 9 : పాలసీదారని వివరములలో “పాలసీదారునికి సంబంధించి పై వివరాలన్నీ సరి అయినవవా ?” లొ అవును / కాదు అనే ఆప్షన్లు ఉంటాయి. కాదు అని సెలెక్ట్ చేస్తే ” పై వివరాలు అన్నీ సరైనవి కాదు కాబట్టి మరలా సర్వే చేయాలనుకుంటున్నారా ?” అని చూపిస్తుంది. అక్కడ కాదు అని సెలెక్ట్ చేస్తే తరువాత స్క్రీన్ కు తీసుకువెళ్తుంది. అదే అవును అని సెలెక్ట్ చేస్తే మరలా కుటుంబంలోని వ్యక్తుల అందరి పేర్లు రైస్ కార్డు ప్రాప్తికి చూపిస్తుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తిలో ఎవరైతే కుటుంబ పెద్దగా ఉండాలి అనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేసి eKYC తీసుకోవాలి. మరలా ముందు వచ్చిన వివరాలు అన్నీ కూడా చూపిస్తాయి సరి అయినవి అయితే అవును అని కాకపోతే కాదు అని సెలెక్ట్ చేసి మార్చుకొని మరల సబ్మిట్ చేయాలి.

Step 10 : “నామిని అందుబాటులో ఉన్నారా?” అనే ప్రశ్నలో అవును అని ఆప్షన్ క్లిక్ చేస్తే నామిని ఆధార నెంబర్ ఎంటర్ చేసి నామిని సంబంధం ఎంచుకొని నామిని eKYC చేయాలి. eKYC పూర్తి అయిన తర్వాత పైన తెలిపిన వివరాలన్నీ కూడా చూపిస్తాయి సరి అయినవి అయితే అవును అని కాకపోతే కాదు అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి తరువాత వాలంటీర్ వారి బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేయాలి. అదే “నామిని అందుబాటులో ఉన్నారా?” కు కాదు అని సెలెక్ట్ చేస్తే నామిని వివరాలు మరియు నామిని బ్యాంకు వివరాలు వస్తాయి. అన్నీ సరి చూసుకున్న తరువాత వాలంటీర్ బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేయాలి.

Step 11 : పాలసీదారుని స్టేటస్ లో ఎలిజిబుల్ అంటే అర్హులు అయితే Wheather policy holder is Bread Earner or not ? అనే ప్రశ్నలో అవును లేదా కాదు ఆప్షన్లు కనిపిస్తాయి, కాదు అయితే వారికి న్యూ ఎన్రోల్మెంట్ అంటే కొత్తగా నమోదు చేయవలసి ఉంటుంది. దాని కొరకు హోం పేజీలో Enrolment అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. నమోదు పూర్తి చేయాలి. 

వైస్సార్ బీమా 2023-24 విధి విధానాలు 

అర్హులు ఎవరు ?

  1. 18 సంవత్సరాలు వయసు నిండిన వారై ఉండాలి.
  2. 70 సంవత్సరాల లోపు వయసు అయి ఉండాలి .
  3. BPL కుటుంబానికి చెంది ఉండాలి అనగా తప్పనిసరిగా రేషన్ కార్డు / రైస్ కార్డు కలిగి ఉండాలి.
  4. కుటుంబంలో ప్రాథమికంగా సంపాదించే వ్యక్తి అయి ఉండాలి.

వయసుని ఎలా నిర్ధారిస్తారు ? 

వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి వయసు నిర్ధారణ అనేది ఆధార్ కార్డు లేదా ఆధార్ చట్టం సెక్షన్ 7 లొ ఇవ్వబడిన ఏ డాక్యుమెంట్ అయినా సరిపోతుంది.

ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిని ఎలా నిర్ధారించాలి ? 

కుటుంబంలో ఎవరైతే సంపాదిస్తారో ఆ వ్యక్తి మాత్రమే ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిగా నిర్ధారించాలి. ఆ వ్యక్తి సంపాదనమే పైనే ఆ కుటుంబం మొత్తం ఆధారపడి ఉండాలి.

నామినేని ఏ విధంగా ఎన్నుకోవాలి? 

ఇన్సూరెన్స్ చట్టం 1938, సెక్షన్ 39 ప్రకారం తప్పనిసరిగా ప్రాథమికంగా సంపాదించే వ్యక్తి తన భర్త లేదా భార్య లేదా పిల్లలు లేదా వారిపై ఆధారపడే వారిని నామినీగా లేదా నామినీలుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా సంపాదించే వ్యక్తికి భర్త లేదా భార్య లేదా పిల్లలు లేదా వారిపై ఆధారపడే వాళ్ళు లేకపోతే అప్పుడు చట్టపరమైన ప్రతినిధులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నామిని మైనర్ అయినట్టు అయితే అప్పుడు, ప్రాథమిక సంపాదనదారుడు తనకు నచ్చిన సంరక్షకులకు ఇన్సూరెన్స్ నిధులు అందేలా పెట్టుకోవచ్చు.

ప్రాథమిక సంపాదన దారుడు కింద తెలిపిన విధంగా నామినేని ఎన్నుకోవలిసి ఉంటుంది

  1. వివాహం జరిగినట్టయితే తన భర్త లేదా భార్యను నామినిగా ఎంచుకోవాలి.
  2. వివాహము జరిగి భర్త లేదా భార్య అందుబాటులో లేకపోయినట్టు అయితే కొడుకో లేదా కూతురుని నామినేగా ఎంచుకోవలసి ఉంటుంది.
  3. వివాహము జరగనట్టయితే అప్పుడు తండ్రి లేదా తల్లిని నామినేగా ఎంచుకోవలసి ఉంటుంది.
  4. ఒకవేళ తల్లి లేదా తండ్రి ఇద్దరు లేకపోయినట్లయితే అప్పుడు పెళ్లి కానీ లేదా విడాకులు తీసుకున్న చెల్లి లేదా అక్కను నామినీ గా ఎంచుకోవలసి ఉంటుంది.

 వైయస్సార్ బీమా నమోదు ఎన్ని రోజులలో చేయవలెను ?

  • ప్రాథమిక సంపాదనాధారుడి ఆధార్ నెంబరు ఎంటర్ చేయటం మరియు బయోమెట్రిక్ ద్వారా eKYC తీసుకోవటం, ఆధార్ వివరాలను ఆధార్ సైట్ లో వెరిఫికేషన్ చేయటం ను సర్వే మొదలు అయిన రోజు నుంచి ఐదు రోజులలో గ్రామ వాలంటీరు లేదా వార్డు వాలంటీర్ పూర్తి చేయవలసి ఉంటుంది.
  • ఆధారు బయోమెట్రిక్ ఉపయోగించి వెరిఫికేషన్ ను WEA / WWDS వారు వాలంటీర్ వారు eKYC చేసిన రోజు నుంచి ఐదు రోజులలో పూర్తి చేయవలసి ఉంటుంది.

సర్వేలో గ్రామ వార్డు వాలంటీర్ల పాత్ర ఏమిటి ?

1) ముందుగా సర్వే చేసిన వారికి :

డేటా సరిగా ఉన్నట్టు అయితే : 

  1. వైయస్సార్ బీమా వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లు రైస్ కార్డు ట్రాప్ కి ప్రాథమిక సంపాదనదారుడు వివరాలు చూపించడం జరుగుతుంది. 
  2. ఆ వివరాలను అనగా అతను ప్రాథమిక సంపాదన దారుడా కాదా , నామిని వివరాలు, వారికి రైస్ కార్డు ఉన్నదా లేదా, మిగిలిన వివరాలు సరిపోయాయా లేవా అని చూసుకోవాలి. 
  3. అన్ని వివరాలు సరిగా ఉన్నట్టయితే అప్పుడు మొబైల్ అప్లికేషన్లో e-KYC పూర్తి చేయాలి.

ప్రాథమిక సంపాదన దారుని మార్చటం :

  1. కుటుంబ సభ్యుల విన్నపం మేరకు వాలంటీర్ వారు ఫ్యామిలీ మెంబర్లు ఒకరిని ప్రాథమిక సంపాదన దారుణంగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.
  2. వారి ఆధార నెంబర్ను ఎంటర్ చేయాలి.
  3. బయోమెట్రిక్ ద్వారా eKYC పూర్తి చేసి UIDAI తో వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది.
  4. పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయసు, వృత్తి, కులము, ఉప కులము వెరిఫై చేయాలి.
  5. నామిని వివరాలను ఎంటర్ చేయాలి అనగా పేరు, ఆధార నెంబరు, డేట్ అఫ్ బర్త్ ,రిలేషన్ మరియు బ్యాంకు వివరాలు నమోదు చేయాలి.

నామిని ని మార్చటం :

  1. ముందుగా ఉన్నటువంటి నామిని వివరాలను మార్చి కొత్తగా నామిని వివరాలను అప్డేట్ చేయవలసి ఉంటుంది.
  2. నామిని తప్పనిసరిగా సంపాదించే వ్యక్తి యొక్క కుటుంబంలోని వ్యక్తి అయి ఉండాలి.
  3. ఒకవేళ నామిని మైనర్ అయినట్లయితే గ్రామ వార్డు వాలంటీర్ వారు ఎవరికైతే సర్వే చేస్తున్నారో వారి ఇష్టపూర్వకంగా వారి సంరక్షకుల పేరు, ఆధార నెంబరు మరియు రిలేషన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
  4. అన్ని వివరాలను సరిగా చదివిన తరువాత అక్కడ చూపిస్తున్న Disclaimer ను చూసుకొని గ్రామ వార్డు వాలంటీర్ల బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది.
  5. తరువాత ఫైనల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

మిగిలిన వివరాలలో మార్పు :

  1. ప్రాథమికంగా సంపాదించే వ్యక్తి యొక్క పేరు, వయస్సు, కులము ఉపకలము మరియు వృత్తి వివరాలను మార్చే అవకాశం ఉంటుంది.
  2. నాముని వివరాలు అనగా పేరు ,ఆధార నెంబరు, డేట్ అఫ్ బర్త్, రిలేషన్ మరియు బ్యాంకు వివరాలు మార్చే అవకాశం ఉంటుంది.

సర్వే చెయ్యని వారికి :

  1. గ్రామ వార్డు వాలంటీర్ వారు ఇంటింటికి వెళ్లి వారి యొక్క రైస్ కార్డు నెంబర్ను వైయస్సార్ బీమా వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది.
  2. కుటుంబం అంగీకార ప్రకారం కుటుంబంలో ఒకరిని ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.
  3. వారి ఆధార నెంబర్ను ఎంటర్ చేయాలి. బయోమెట్రిక్ విధానం ద్వారా eKYC పూర్తి చేసి డేటా ను వెరిఫై చేయాలి.
  4. ప్రాథమిక సంపాదన దారుణ యొక్క తండ్రి లేదా భర్త లేదా భార్య పేరు, వయసు , కులము, ఉపకులము, వృత్తి ఎంటర్ చేయాలి.
  5. నామినీ వివరాలు అనగా పేరు, ఆధార నెంబరు, పుట్టిన తేదీ, సంబంధము, బ్యాంకు యొక్క వివరాలను ఎంటర్ చేయాలి.
  6. నామిని మైనర్ అయినట్టు అయితే వాలంటీర్ వారు సర్వే చేస్తున్న వారి ఇష్టపూర్వకంగా వారి యొక్క సంరక్షకుల పేరు, ఆధార నెంబరు, సంబంధము ఎంచుకోవలసి ఉంటుంది.
  7. చివరగా వాలంటీర్ వారు కన్సెంట్ తీసుకొని వారి యొక్క బయోమెట్రిక్ చేయవలసి ఉంటుంది. డేటాను సబ్మిట్ చేయాలి.

సర్వేలో WEA / WWDS వారి పాత్ర ఏమిటి ?

1) ముందు సర్వే చేసిన వారికి :

  1. WEA / WWDS వారు ముందుగా ఉన్నటువంటి ప్రాథమిక సంపాదనదారుల వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది అదేవిధంగా వాలంటీర్ వారు వెరిఫై చేసిన వివరాలను కూడా ఒకసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది.
  2. అదేవిధంగా ప్రాథమిక సంపాదన దారుని వివరాలలో మార్పులు మరియు నామిని మార్పులు మరియు ఇతర మార్పులు ఏవైతే వాలంటీర్ వారు చేస్తారో అవి వెరిఫై చేయవలసి ఉంటుంది.

2) ముందు సర్వే చేయని వారికి (కొత్తగా సర్వే చేయవలసిన వారికి )

  1. గ్రామ వార్డు వాలంటీర్ వారు ముందుగా సబ్మిట్ చేసిన PBE ల వివరాలను WEA / WWDS వారు వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది. సర్వే చేసిన వారు PBE నా ? కాదా ? అని నిర్ధారించాలి.
  2. PBE అయినట్టు అయితే అప్పుడు WEA / WWDS వారు eKYC చేయాలి. కాక పోతే కుటుంబ సభ్యుల విన్నపం మేరకు ఒకరిని PBE గా సెలెక్ట్ చేయాలి.
  3. ఆధార నెంబర్ను ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత పేరు, తండ్రి పేరు / భర్త లేదా భార్య పేరు, వయసు, కులము, వృత్తి, వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది.
  4. నామిని యొక్క పేరు, ఆధార్ నెంబరు, డేట్ అఫ్ బర్త్, సంబంధమును , వెరిఫై చేయాలి.
  5. నామిని మైనర్ అయినట్లయితే సంరక్షకుల యొక్క వివరాలు అనగా పేరు, ఆధార నెంబరు, సంబంధము వెరిఫై చేయాలి.
  6. WEA / WWDS వారికి సర్వేలోని అన్ని వివరాలు మార్పులు లేదా అప్డేట్ చేసే ఆప్షన్ ఉంటుంది.
  7. WEA / WWDS వారు చివరగా అన్ని వివరాలను చదివిన తరువాత వారి కాన్సెంట్ ఇవ్వాలి. డేటా సబ్మిట్ చేయూలి.

తరువాత సంబంధిత MPDO / MC వారికి వారి నుంచి District GSWS Incharge, DRDA PD (వైస్సార్ బీమా జిల్లా నోడల్ అధికారి ) వారికి ఫార్వర్డ్ అవుతాయి.

Note : సర్వేకు సంబంధించి PBE వారి నమోదు మరియు నామినీల వివరాల మార్పు చేర్పు లు తేదీ 07-06-2023 లోపు పూర్తి అవ్వవలసి ఉంటుంది. 

Click here to Share

4 responses to “వైస్సార్ బీమా సర్వే 2023-24 సమాచారం | YSR Bima Survey 2023-24 Information”

  1. harinathareddy Avatar
    harinathareddy

    Super

  2. జి.జగన్నాధం Avatar
    జి.జగన్నాధం

    Help me

  3. Yemineni Anil gowd Avatar
    Yemineni Anil gowd

    Ninna ma daddy accident lo chanipoyaru kani licence ledhu ani maku radhu bhima antunnaru. Sir licence kavalani miru mundhu cheppaledhu ga sir.

  4. Yemineni Anil gowd Avatar
    Yemineni Anil gowd

    Ninna ma daddy accident lo chanipoyaru kani licence ledhu ani maku radhu bhima antunnaru. Sir licence kavalani miru mundhu cheppaledhu ga sir. Please respond sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page