వైస్సార్ ఆసరా మూడో విడత అమౌంట్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించి మీ లోన్ status ని కింది విధంగా చెక్ చేయండి.
Step 1 : ముందుగా అన్ని స్టెప్స్ చదివి కింది స్టేటస్ లింక్ పై క్లిక్ చేయండి ..
Link : ఆసరా స్టేటస్ లింక్

Step 2: ఇందులో మీ జిల్లా , మండలం, గ్రామం ఎంచుకోండి.

Step 3: తర్వాత outstanding పైన సెలెక్ట్ చేయండి.
కింది విధంగా అన్ని ఓపెన్ లోన్స్ చూపిస్తాయి. ఇందులో loan Issued date 2019 ఏప్రిల్ 11 లోపు ఉండీ, ఆ డేట్ నాటికి ఇంకా చెల్లించాల్సిన అమౌంట్ కి ఆసరా వర్తిస్తుంది.
ఒకవేళ మీ లోన్ 2019 ఏప్రిల్ నెల తర్వాత క్లోజ్ అయినట్లయితే , అప్పటివరకు outstanding అమౌంట్ ను కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.

అర్హత ఉన్న లోన్లకు మీ ప్రాంతంలో జరిగే చెక్కుల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత మీ పొదుపు ఖాతాలో అమౌంట్ జమవుతుంది. ఏప్రిల్ 5వ తేదీ లోపు మీ ప్రాంతంలో పంపిణీ తేదీ ని అనుసరించి అమౌంట్ జమ కానుంది.
Note: పై విధంగా గ్రామాల వారీగా డేటా చూడవచ్చు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి డేటా కింది లింక్ లో ఉంటుంది , అయితే పట్టణ ప్రాంతాల డేటా లాగిన్ లో నే లేటెస్ట్ డేటా ఉటుంది.
ఇది చదవండి: మీ ఆసరా అమౌంట్ ఇంకా జన కాలేదా? అయితే ఈ వివరాలు చూడండి
Leave a Reply to nagamani mylavarapu Cancel reply