రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ సామాజిక వర్గాలలో 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అక్కచెల్లెమ్మలకు ఆర్ధికంగా అండగా నిలబడేందుకు “వై.యస్.ఆర్ చేయూత” పథకాన్ని ప్రారంభించింది. మధ్య వయస్సులోని అక్క చెల్లెమ్మలు తమ కష్టాన్ని నమ్ముకొని, కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నడిపిస్తున్న, వారి చేతుల్లోడబ్బు పెడితే పూర్తిగా వాళ్ళ కుటుంబం కోసం, ఆర్ధిక స్థితి గతులు మెరుగుపడచడం కొరకు వినియోగిస్తారని నమ్మిమన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘నవరత్నలలో ఒకటిగా “వై.యస్.ఆర్ చేయూత” పధకాన్నిచేర్చి ఆగష్టు 12, 2020 నుండి అమలు చేయడం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసినదే.
ప్రతి సంవత్సరం రూ.18,750/-లు చొప్పున నాలుగేళ్ల పాటు మొత్తం రూ.75,000/-లు ఆర్ధిక సహాయంఅందచేయడం జరుగుతుంది. అందులో భాగంగా అర్హత కల్గిన లబ్దిదారులందరికి గడిచిన మూడు సంవత్సరాలలోమొదటి విడత 24 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.18,750/-ల చొప్పున రూ.4500 కోట్లు, రెండవ విడత నందు24.95 లక్షల మందికి రూ. 4679.46 కోట్లు, మూడవ విడత నందు 26.39 లక్షల లబ్దిదారులకు 4949.44 కోట్లరూపాయలు DBT పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగింది. మొత్తం మూడువిడతల్లో 26.39 లక్షల లబ్దిదారులకు రూ.14,129.11 కోట్లు జమచేయడం జరిగింది. ఇందులో భాగంగా నాలుగవ విడత “వై.యస్.ఆర్ చేయూత పధకం” క్రింద, గౌరవ ముఖ్యమంత్రివర్యులు16 ఫిబ్రవరి, 2024 తేదిన అర్హులైన లబ్ధిదారులందరికి ఆర్ధిక సహాయ మొత్తమును మంజూరు చేయబోతున్నారు. లబ్దిదారులకు అందబోయే చేయూత మొత్తాన్ని, వారు ఎలా వినియోగించుకుంటారనే విషయంలో ఎలాంటి షరతులు లేవు . పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది.
చేయూత ಲಭಿ పొందిన లబ్ధిదారులు ప్రభుత్వ ఆర్థిక సహాయ మొత్తాన్ని పెట్టుబడిగా మార్చుకోవాలని కోరుకునేవారికి, వ్యాపారం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కొరకు రిలయన్స్, HUL, P&G, ITC, అమూల్వంటి భారీ వ్యాపార సంస్థలతోనూ, మరియు అజియో టెక్స్టైల్స్, మహీంద్రా కేతి, గ్రామీణ వికాస కేంద్రం, కాల్గుడి,Heifer, CSC వంటి సంస్థలతో ఒప్పందం చేసుకొని లబ్దిదారులను అనుసంధానం చేయడం ద్వారా వ్యాపారరంగాలలో సహాయ సహకారాలు అందించడం, నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకే అందుబాటులోనికి తీసుకువచ్చేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగినది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సిబ్బంది అందరూ, ప్రభుత్వం ఇవ్వబోయే నాలుగవ విడతవై.యస్.ఆర్ చేయూత మొత్తమును, అర్హత కల్గిన ప్రతి లబ్దిదారునికి తెలియచేసి, ఆసక్తి ఉన్న లబ్ధిదారులకుజీవనోపాధిని ఏర్పాటు చేసుకొనే విధంగా, అవసరమగు సహాయ సహకారాన్ని అందించవలసి ఉంటుంది.
YSR Cheyutha 2024 TimeLines
“వై.యస్.ఆర్ చేయూత పధకం ” నాలుగవ విడత కార్యక్రమం నందు చేయవలసిన పనులు : – YSR Cheyutha 2024 4th Phase Activities
YSR Cheyutha 2024 Pre-Launching Activities
కమ్యూనిటీ కో ఆర్డినేటర్ :
- 08.02.2024 వ తేదీ నుండి 15.02.2024 వ తేదీ వరకు Pre Launching Activities అన్నీగ్రామ సంఘాలలో తప్పక జరిపించాలి.చేయూత లబ్దిదారుల వివరాలను గ్రామ సచివాలయం వారీగా తీసుకోవాలి.
- గ్రామ సచివాలయ పరిధిలోని లబ్దిదారులందరితో ప్రత్యేక గ్రామ సంఘం సమావేశం ఏర్పాటుచేయాలి.
చేయూత పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరియు ఆవశ్యకత గురించి తెలియజేయాలి. - 16 ఫిబ్రవరి, 2024, తేదీ నుండి 25 ఫిబ్రవరి, 2024 వరకు జరిగే చేయూత నాలుగవ విడత కార్యక్రమం గురించి తెలియజేయాలి.
- గడచిన మూడు సం.రాలలో లబ్ధి పొందిన లబ్ధిదారులతో మాట్లాడి, మొబైల్ అప్లికేషన్ నందు నమోదు చేయబడి, వారు చేపట్టిన జీవనోపాధి కార్యక్రమాల గురించి, ఉపయోగించుకొన్న విధానంగురించి, తద్వారా వారి కుటుంబం ఆర్ధికం గా ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని చర్చించాలి.
- గ్రామ సచివాలయ వారిగా ఒకటి లేదా రెండు Best Case Studies / Success Stories తయారు చేయాలి మరియు వారిని Launching కార్యక్రమాలలో మాట్లాడేటట్లు సిద్ధం చేయాలి.
మండల స్థాయిలో APM చేయవలసిన పనులు:
- 08.02.2024 వ తేదీ నుండి 15.02.2024 వ తేదీ వరకు Pre Launching Activities అన్నీ గ్రామ సంఘాలలో తప్పక కమ్యూనిటీ కో ఆర్డినేటర్ సమక్షంలో జరిపించాలి.
- గ్రామ సంఘం లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి, సక్రమంగా జరిగేలా చూడాలి.
- గ్రామ సంఘం వారీగా Best Case Studies / Success Stories సేకరించి, మంచి ఫోటోలతో వాటిని డాక్యుమెంటరీ రూపంలో తయారుచేయాలి.
- అన్ని రకాల జీవనోపాదులపై, కంపెనీల, సంస్థల అనుసంధానం గురించి Case Studies వచ్చే విధంగా చూసుకోవాలి.
- చేయూత రాక ముందు వారి జీవన విధానం, చేయూత లబ్ధి పొందిన తరువాత వారు చేపట్టిన జీవనోపాదుల వల్ల పెంపొందిన ఆర్థిక సాధికారత గురించి అవగాహన కల్పించాలి.
జిల్లా స్థాయిలో DPM చేయూత వారు చేయవలసిన పనులు:
- Pre Launching Activities జరుగుతున్న సమయంలో కనీసం 1/3 వంతు గ్రామ సంఘాలలో అయిన మండల ఏ. పి. యం హాజరు అయ్యే విధంగా చూడాలి .•
- DPM చేయూత వారు ఈ కార్యక్రమం మొత్తాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి.నిర్దేశించిన టైం లైన్స్ లోపు కార్యక్రమాలు అన్ని మండలాలలో, అన్ని గ్రామ సచివాలయాల్లో పూర్తిఆగు విధముగా చూసుకోవాలి.
- CC/APM లకు కావలసిన క్లారిటీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తిచేయవలెను.
- Best Case Studies / Success Stories సేకరించి, అట్టి వివరాలను CEO, SERP వారికిమెయిల్ ద్వారా తెలియజేయాలి.
ప్రాజెక్ట్ డైరెక్టర్ DRDA వారు చేయవలసిన పనులు:
- ప్రతి రోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తూ ప్రగతిని రివ్యూ చేయాలి.
- మండల స్థాయిలో ఆమోదం తెలుపక పిండింగ్ లో ఉన్న లబ్దిదారుల వివరాలను MPDO గారితో మాట్లాడి Approval ఇప్పించాలి.
- ఫీల్డ్ స్థాయిలో ఉన్న సమస్యలను గ్రామ వార్డు/సచివాలయ డిపార్ట్మెంట్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిష్కరించుకోవాలి.
- Time Lines ప్రకారంగా చేపట్టే అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగేటట్లు సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడం.• DPM చేయూత వారికి pre launch నుండి Post launch కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు వెహికల్ ప్రొవిజన్ ఇవ్వవలెను
YSR Cheyutha 2024 Launching Programme:
16, ఫిబ్రవరి 2024 వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో వై.యస్.ఆర్ చేయూత పధకం నాలుగవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మండలాలలోని RBK కేంద్రాలలో అందరూ చేయూత లబ్దిదారులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడం అవకాశం కల్పించడం జరుగుతుంది.
YSR Cheyutha 2024 Post Launching Activities:
జిల్లా స్థాయిలో చేపట్టే కార్యక్రమాలు:
- అన్ని జిల్లాలలో మండలాల వారీగా గౌరవ శాసన సభ్యుల వారి అనుమతితో ముందుగానే తేదీలు ఖరారు చేసుకొని, ప్రణాళికలు రూపొందించి గౌరవ శాసన సభ్యులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు అయ్యే విధంగా చూడాలి.
- వై.యస్.ఆర్ చేయూత నాలుగవ విడత సంబరాలు 17 ఫిబ్రవరి, 2024 నుండి 25 ఫిబ్రవరి, 2024వ తేదీ వరకు జరిగే విధంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- చేయూత పధకాన్ని సద్వినియోగం చేసుకొని జీవనోపాధి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని,ఆదాయ మార్గాలను మెరుగు పరుచుకున్న లబ్బదారులను గుర్తించి, వారితో ఆయా మండలాలో జరిగే కార్యక్రమాలలో మాట్లాడించాలి.
- ఈ కార్యక్రమాలు సక్రమంగా జరిగే విధంగా పథక సంచాలకులు, డి.ఆర్.డి.ఏ మరియు డి.పి.యం చేయూత వారు పర్యవేక్షించాలి.
మండల స్థాయిలో చేపట్టే కార్యక్రమాలు
- 17 ఫిబ్రవరి, 2024 నుండి 25 ఫిబ్రవరి, 2024 వ తేదీ వరకు గౌరవ శాసన సభ్యుల ఆధ్వర్యంలో వారు నిర్దేశించిన తేదీలకు అనుగుణంగా మండల స్థాయి ప్రజాప్రతినిధులతో నాలుగవ విడత వై.యస్.ఆర్ చేయూత కార్యక్రమాలను పండగ వాతావరణంలో లబ్దిదారులు అందరితో కలిసి నిర్వహించాలి. సంబంధిత ఏరియా కో ఆర్డినేటర్ వారు భాద్యత వహించాలి.
- గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సందేశం (HCM లెటర్) చదివి వినిపించాలి మరియు వాలంటీర్ల సహాకారంతో లబ్దిదారులందరికి అందజేయాలి.
- చేయూత పథకం Success Stories సంబందించిన HCM Video Clippings ప్రదర్శించాలి.
- చేయూత లబ్దిదారులు ఏర్పాటు చేసిన జీవనోపాధులు ద్వారా “ఏ రకంగా వారి జీవితాలు మారాయో, ఏ విధంగా ఆర్ధిక పురోగతి సాధించారో” వారి మాటల్లో విజయ గాధలను చెప్పించాలి.
- లబ్దిదారులకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న HUL, P&G, ITC, అమూల్ వంటి వ్యాపార సంస్థలతోనూ, మహీంద్రా కేతి, గ్రామీణ వికాస కేంద్రం, కాల్గుడి, Heifer, CSC వంటి సంస్థలతోనూ మరియు ఇతర ఒప్పంద సంస్థలతో అనుసంధానం కల్పించి వారి కుటుంబ ఆదాయలను పెంచుకొనే మార్గాలను తెలియజేయాలి
- Best Case Studies / Success Stories సేకరించి, డాక్యుమెంటరీ తయారు చేయాలి.
- జీవనోపాధులు ఏర్పాటుకు ఆసక్తి కనబరచిన లబ్దిదారులను గుర్తించి, వారికి బ్యాంక్ మరియు స్త్రీనిధి, ఉన్నతి పధకాల ద్వారా ఋణ సదుపాయాలు కల్పన మరియు లైన్ డిపార్ట్మెంట్, MoU కంపెనీ లతో జీవనోపాధుల ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలి.
- కార్యక్రమం జరిగే ప్రదేశాలలో SHG సభ్యుల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ మరియు కంపెనీ పార్టనర్స్, బ్యాంకర్స్ (స్పాట్ డాక్యుమెంటేషన్, రుణ సదుపాయం కొరకు) తో స్టాల్స్ ఏర్పాటు మరియు గ్రౌండింగ్ చేసిన యూనిట్ల పంపిణీ (Assets Distribution) కార్యక్రమాన్ని చేపట్టాలి.
- లబ్దిదారులందరి నుండి Acknowledgment తీసుకోవడం మరియు ఏ జీవనోపాధి చేపడుతున్నారో అనే విషయాన్ని (Options) సేకరించాలి.
- ప్రతి మండలంలో చేయూత పధకాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. డయాస్, కుర్చీలు, టెంట్స్, సౌండ్ సిస్టమ్, బ్యానర్స్, బొకేలు, శాలువలు, LED స్క్రీన్, SHG ఉత్పత్తులు, కంపెనీ పార్టనర్స్ తో స్టాల్స్ ఏర్పాటు మరియు భోజన సదుపాయాలు మొదలైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.
- పైన తెలిపిన కార్యక్రమాలను పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ చేసి, ఫోటో ఆల్బమ్ తయారుచేయాలి.