చంద్రన్న బీమా పథకాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గ్రామ, వార్డుసచివాలయాల ద్వారానా లేక పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) ద్వారా అమలు చేయాలాఅనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు.రెండు విధానాలూ రూపొందించి ప్రభుత్వం ముందుంచారు.
2014-19 మధ్య ఈ పథకాన్నిసెర్ఫ్ పరిధిలో విజయవంతంగా అమలు చేశారు. ఏడాదికి దాదాపుగా 85 వేల క్లెయిమ్లను పరిష్కరించారు. ఈ విధానంలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు నెలరోజుల్లోనే రూ. 5 లక్షల ఆర్థికసాయం అందేది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బీమామిత్రలను తొలగించి పథకం విధి విధానాలన్నీమార్చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నామమాత్రంగా అమలు చేశారు. ఈవిధానంలో ఏడాదికి సుమారు 25 వేల క్లెయిమ్లను మాత్రమే పరిష్కరించరించగలిగారు.
2 గంటల్లో రిజిస్ట్రేషన్.. 6 గంటల్లో మట్టి ఖర్చుల చెల్లింపు
2014-19 మధ్య బీమా మిత్రల ద్వారా పథకాన్ని అమలు చేసినప్పుడు ఎవరైనా వ్యక్తి చనిపోతే వారి వివరాలను రెండు గంటల్లోనే రిజిస్ట్రేషన్ చేసేవారు. ఆరు గంటల్లో బాధిత కుటుంబం దగ్గరకే బీమా మిత్రలు వెళ్లి మట్టిఖర్చుల కింద రూ.5,000 చెల్లించేవారు.
ఆ తర్వాత రెండు రోజుల్లో బీమా వర్తింపునకుసంబంధించిన అన్ని వివరాలనూ నమోదు చేసినెల రోజుల్లో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకునేవారు. ఒక్కో క్లెయిమ్ నమోదు చేసినందుకుగాను బీమా మిత్రలకు రూ.250నుంచి రూ.500 చొప్పున చెల్లించేవారు.
సర్వీసు చార్జీ కింద ప్రజల నుంచి సేకరించిన సొమ్ముతోనే బీమా మిత్రులకు చెల్లింపులు చేసేవారు. ఈ విధానంతో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఏమీ పడబోదని సెర్చ్ అధికారులు అంతర్గత సమావేశాల్లో ఉన్నతాధికారులకు చెబుతున్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదించారు.
సచివాలయాల ద్వారా అమలుకుకార్మికశాఖ ప్రతిపాదన
బీమా పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే కార్మికశాఖ నుంచి మరో ప్రతిపాదనవెళ్లింది. బీమా పథకాన్ని గ్రామ, వార్డు సచివాలయశాఖ ద్వారా అమలుకు ఆ శాఖ మొగ్గు చూపుతోంది. సెలవుదినాల్లో సచివాలయఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడంతో వైకాపా హయాంలో మట్టి ఖర్చులు ఇవ్వడం,రిజిస్ట్రేషన్లలో జాప్యం జరిగేది.
క్లెయిమ్ పరిష్కారం కూడా నెలల తరబడి పట్టేది. కాల్సెంటర్కు ఫిర్యాదులు వెల్లువెత్తినా పట్టించుకోలేదు. బీమా చెల్లింపులకు బ్యాంకుల ద్వారా వెళ్లడంతో కొందరు బ్యాంకర్లు కొర్రీలు వేసిబీమా సాయం అందకుండా చేసినా అధికారులుదృష్టి పెట్టిన దాఖలాల్లేవు.