April Month Pension Guidelines – పింఛన్ల పంపిణీపై విధివిధానాలు జారీ

ap pension april

ఏపీ లో ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించి పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం విధివిధానాలు జారీ చేసింది. ఈ నెలకి సంబంధించి పెన్షన్ పంపిణీ ఏప్రిల్ 3 (April 3) నుంచి ఏప్రిల్ 6 వరకు కేటగిరీల వారీగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లను పంపిణీ చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దివ్యాంగులు, వీల్ చైర్ కి పరిమితమైన వారు, తీవ్ర అనారోగ్యం తో ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ ఉంటుంది.

UPDATE : పెన్షన్ పంపిణీ ముఖ్యాంశాలు

• రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ సంబంధించి మార్గదర్శకాలు జారీ

• దివ్యాంగులు మరియు వీల్ చైర్ కి పరిమితమై నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ

• మిగిలిన వారందరికీ గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ ఉంటుంది

• ఏప్రిల్ 3 మధ్యాహ్నం నుంచి సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుంది.

• సచివాలయాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పెన్షన్ కంపెనీ కొరకై తెరిచి ఉంటాయి.

• గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో సచివాలయాలు ఒకవేళ గిరిజన నివాసాలకు దూరంగా ఉన్నట్లయితే అటువంటి ప్రదేశాలలో సచివాలయం కాకుండా వేరే ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల నుంచి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రతినెల పెన్షన్ రూపంలో నగదు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 3, 2024 నుండి పెన్షన్ 3000 పెంచి అందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం ముగింపు మరియు సెలవుల దృష్ట్యా ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీ 3వ తేది నుండి ప్రారంభం అవుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్థిక సంవత్సరం ముగింపు మరియు సెలవుల దృష్ట్యా ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీ 3వ తేది నుండి ప్రారంభం అవుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పెన్షన్ పంపిణీ సంబంధించి మార్గదర్శకాలు

  • దివ్యాంగులు మరియు వీల్ చైర్ కి పరిమితమై నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ
  • మిగిలిన వారందరికీ గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ ఉంటుంది
  • ఏప్రిల్ 3 మధ్యాహ్నం నుంచి సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుంది.
  • సచివాలయాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పెన్షన్ పంపిణీ కొరకై తెరిచి ఉంటాయి.

April Month Pension Updates

తేదీఅప్డేట్
02-04-2024newపింఛన్ల పంపిణీపై విధి విధానాలు జారీ చేసిన ఈసి.
30-03-2024ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
27-03-2024new➡ ఎన్నికల కోడ్ అమలులో ఉంది కావున పెన్షన్ పంపిణీలో చిన్న మార్పులు చెయ్యడం జరిగింది.
అందరు వాలంటీర్స్ కి ఒక పత్రం ఇస్తారు. అందులో వాలంటీర్స్ పేర్లు/ ప్రతి వాలంటరీ ఎంత అమౌంట్ అని వివరాలు ఉంటాయి.
➡ తప్పకుండా ఆ పత్రం పెన్షన్ పంపిణీ సమయం లో వాలంటీర్స్ దగ్గరే ఉంచుకోవాలి.
పెన్షన్ పంపిణీ సమయంలో రాజకీయ నాయకులు లేదా అధికారులు అడిగిన వెంటనే ఆ పత్రం చూపించాల్సి ఉంటుంది.
➡ ఆ పత్రంలో ఉన్న విధంగా కాకుండా ఎక్కువ అమౌంట్ వాలంటీర్స్ దగ్గర ఉంటే సంబంధిత వాలంటీర్ ను తొలగిస్తారు.
27-03-2024ఏప్రిల్ 2వ తారీకున పెన్షన్ పంపిణీ ధృవీకరణ పత్రాలు డౌన్లోడ్ చేసుకోవడానికి MPDO/MC/WEA/WWDS వారి లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.
27-03-2024ఏప్రిల్,మే & జూన్ 2024 నెలల పెన్షన్ పంపిణీకి సంబంధించిన నియమాలు విడుదల. మోడల్ పెన్షన్ పంపిణి ధృవీకరణ పత్రము (సచివాలయాలకు & వాలంటీర్లకు ఇవ్వవలసినది అప్డేట్ చెయ్యడం జరిగింది)
26-03-2024ఆర్థిక సంవత్సరం ముగింపు మరియు సెలవుల దృష్ట్యా ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీ 3వ తేది నుండి ప్రారంభం అవుతుంది.

ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీ నియమాలు

  • MPDO / MC వారు పెన్షన్ను పంపిణీ చేయు వారి వివరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి (RO) వారికి ముందుగానే తెలియజేయాలి.
  • పెన్షన్ పంపిణీ ధ్రువీకరణ పత్రమును MPDO వారు వారి పరిధిలో ఉన్నటువంటి పంచాయతీకార్యదర్శులు PS మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ WEA వారికి, MC వారు వారి పరిధిలోనివార్డ్ అడ్మిన్ సెక్రటరీ WAS మరియు వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ WWDS వారికి అందించవలెను.సచివాలయాల పేర్లు, నగదు వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రములు MPDO/MC వారి లాగిన్ లొఅందుబాటులో ఉంటాయి.
  • PS & WEA, WAS & WWDS వారు ధ్రువీకరణ పత్రమును సంబంధిత వాలంటీర్లు అందరికీకూడా అందించవలెను. పెన్షన్ పంపిణీ చేయు సమయంలో తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రమును వారి వద్దఉంచుకోవాలని. సచివాలయంలో వాలంటీర్లకు ఇవ్వవలసిన ధ్రువీకరణ పత్రము WEA/WWDS వారిలాగిన్ లొ అందుబాటులో ఉంటుంది.
  • PS, WEA, WAS, WWSS, VOLUNTEERS తప్పనిసరిగా ఒరిజినల్ ధ్రువీకరణ పత్రమునునగదును బ్యాంకు నుండి తీసుకునే సమయం నుండి పంపిణీ పూర్తి అయ్యేంతవరకు తమ వద్దఉంచుకోవలసి ఉంటుంది .
  • పెన్షన్ పంపిణీ చేయి సమయంలో ఎటువంటి పబ్లిసిటీ చేయరాదు. ఫోటోలు గాని వీడియోలు గానిపంపిణీ చేసే సమయంలో తీయరాదు. తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ నియమాలను పాటించాలి.

April Month Pension Documents

ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణికి సంబంధించిన సమాచారం

కులం, మతం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను వర్తింపజేస్తూ రాష్ట్రంలోని వృద్ధులు దివ్యాంగులు మరియు వితంతులకు ఆర్థిక సహాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా పెన్షన్ పంపిణి చేస్తున్నారు. ఏప్రిల్ నెల 3 నుండి 6వ తారీఖు వరకు గ్రామ,వార్డు సచివాలయాలలో పెన్షన్ పంపిణీ జరుగుతుంది.

పెన్షన్ అమౌంట్ ఎంత?

పెన్షన్అమౌంట్
ART (PLHIV) వ్యక్తులు3000/-
సంప్రదాయ చెప్పులు కుట్టేవారు3000/-
వికలాంగులు3000/-
లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులు3,000/
డప్పు కళాకారులు3,000/
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వం మరియు నెట్‌వర్క్ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకుంటున్న వ్యక్తులు10,000/-

వైయస్సార్ పెన్షన్ కానుక అర్హత ప్రమాణాలు

పెన్షన్అర్హతలు
వృద్ధాప్య పెన్షన్60 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు కలవారు అర్హులు.
గిరిజనులు 50 సంవత్సరాలు ఆపై వయస్సు కలవారు అర్హులు
వితంతు పెన్షన్ వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు ఆ పై వయస్సు కలవారు.
భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా డెత్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వికలాంగుల పెన్షన్ 40% మరియు అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారు మరియు
సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు. వీరికి వయోపరిమితి లేదు
చేనేత కార్మికుల పెన్షన్వయస్సు 50 సంవత్సరాలు మరియు యు ఆ పైన కలవారు.
చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు
కల్లు గీత కార్మికుల పింఛన్వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు.
ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.
మత్స్యకారుల పెన్షన్ వయస్సు 50 సంవత్సరములు మరియు ఆ పైన కలవారు.
మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.
హెచ్ఐవి(PL HIV) బాధితులు పెన్షన్వయో పరిమితి లేదు.
ఆరు నెలలు వరుసగా ART treatment Therapy(యాంటీ రిట్రో వైరల్ థెరపీ) తీసుకున్నవారు.
డయాలసిస్ (CKDU) పెన్షన్వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు. ( స్టేజ్ 3, 4 & 5)
వయో పరిమితి లేదు.
ట్రాన్స్ జెండర్ పెన్షన్ 18 సంవత్సరాలు ఆ పైన వయస్సు కలవారు.
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కలిగినవారు.
ఒంటరి మహిళ పెన్షన్ వయస్సు 35 సంవత్సరాలు మరియు ఆపైన కలిగి ఉండి, చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు, భర్త నుండి విడిపోయిన వారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా ఉండాలి.) గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు, భర్త నుండి విడిపోయినట్లు గా ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేనివారు గ్రామ / వార్డు స్థాయిలో ప్రభుత్వ అధికారుల సాక్షాలతో తాసిల్దారుగారి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి.
అవివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్న వారు, గ్రామాలలో ఉన్న వారికి వయస్సు 30 సంవత్సరములు మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి వయస్సు 35 సంవత్సరాలు, ఆపైన కలిగి ఉండాలి. పెన్షన్ మంజూరు అనంతరం వారు వివాహం చేసుకుని ఉన్నా లేదా ఆర్ధిక పరముగా జీవనోపాధి పొందిన తక్షణమే పెన్షను నిలిపి వేసే బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి వారికి అనుమతి ఉన్నది. (ప్రతి నెల పెన్షన్ పంపిణీ అధికారి ఆమె పరిస్థితి పరిశీలించాలి.)
డప్పు కళాకారుల పెన్షన్ వయస్సు 50 సంవత్సరంలు మరియు ఆ పైన కలవారు.
సాంఘిక సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొందిన వారై ఉండాలి.
చర్మకారుల పెన్షన్ వయసు 40 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు.
లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది.
అభయ హస్తం పెన్షన్ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉండి, 60 సంవత్సరాల వయస్సు కలవారు.

పెన్షన్ పంపిణీ సమయంలో ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ లు

You cannot copy content of this page